ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే సరైన సమయం ఇదే.. ఇంకాస్త ఆలస్యం చేస్తే తర్వాత బాధపడతారు..

మరికొద్ది రోజుల్లో 2024 ఏడాది ముగియనుంది. కొత్త ఏడాదికి సంతోషంగా వెల్‌కమ్ చెప్పడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆటోమొబైల్ కంపెనీలు వరుసగా షాకింగ్‌ న్యూస్ చెబుతున్నాయి. తమ కార్లు, బైకుల ధరలు పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నాయి. 2025 ఏడాదిలో ఆనందంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది బ్యాడ్‌న్యూస్. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటనలు విడుదల చేస్తుండగా, తాజాగా దేశీయ దిగ్గజ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఏథర్ కూడా కొత్త ఏడాదిలో తన టూవీలర్లపై ధరల పెంపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా ఈవీ స్కూటర్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారు వెంటనే ప్రస్తుతం అందుబాటు ధరలకే కొనుగోలు చేయడం ఉత్తమం.

ఎందుకంటే కేవలం కొద్ది రోజుల గ్యాప్‌లోనే మరింత ఎక్కువ ధర పెట్టి టూవీలర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏథర్ కంపెనీ తన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్తా మోడల్ ధరను జనవరి 1 నుంచి పెంచుతుందని ఒక నివేదిక పేర్కొంది. అలాగే ఏథర్ 450 సిరీస్ మోడళ్ల ధరలు కూడా వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నవే.

Ather Electric Scooters

తాజా సమాచారం ప్రకారం, ఏథర్ కంపెనీకి చెందిన 450S, 450X, 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ డీలర్లు తెలియజేసినట్లు తెలుస్తుంది. నివేదిక పేర్కొన్న దాని ప్రకారం, ఈ మూడు స్కూటర్ల ధరలు దాదాపు రూ.4,000 నుంచి రూ.6,000 వరకు పెరిగే అవకాశం ఉంది. కచ్చితంగా ఇంత మొత్తం అని తెలియనప్పటికి కొంచెం అటుఇటూగా ఆ రేంజ్‌లోనే ధరల పెంపు ఉండవచ్చని తెలుస్తుంది.

ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే, ఇది 2.9kWh, 3.7kWh రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రెండు కూడా శక్తివంతమైనవే. చిన్న బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే 90 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. అదే పెద్ద బ్యాటారీ సింగిల్ ఛార్జింగ్‌తో 110 కి.మీల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ ఇంతకుముందు ఒక ప్రకటనలో తెలిపింది. దీని ధర రూ.1,40,599 నుంచి రూ.1,54,999 వరకు ఉంటుంది.

Ather Electric Scooters Price Increases

450X లో 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. అదే ఏథర్ 450S గురించి చూసినట్లయితే, 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 90 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. దీనిలో 7 అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. కంపెనీ ఇటీవల రిజ్తా అనే మోడల్‌ను కూడా విడుదల చేసింది. ఇది ప్రధానంగా మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు కూడా కొత్త ఏడాది నుంచి పెరగనున్నాయి.

ప్రస్తుతం రిజ్తా బేస్ వేరియంట్ ధర రూ.1,09,999 గా ఉంది. తర్వాత మరో టాప్ వేరియంట్ ధర రూ. 1,46,499గా ఉండగా, కంపెనీ తీసుకున్న ధరల పెంపుదల నిర్ణయంతో రిజ్తా అన్ని వేరియంట్ల ధరలు రూ.4,000 నుంచి రూ.6,000 వరకు పెరగనున్నాయి. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, ఈవీ టూవీలర్లకు దేశంలో డిమాండ్ అధికంగా ఉంది. గత ఏడాది కంటే ఇప్పుడు అమ్మకాల సంఖ్య మరింత పెరిగింది.

ఇలాంటి సమయంలో ఇలా ధరలను పెంచడం వలన ఏథర్ ఎలక్ట్రిక్ టూవీలర్లు మరింత భారమై వీటి అమ్మకాలపై ప్రభావం చూపిస్తుందని కొంతమంది పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏథర్‌కు పోటీ ఇస్తున్న కంపెనీలు ధరల పెంపుదలపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఏథర్ మాత్రం ధరలు పెంచినట్లయితే ఈ కంపెనీ టూవీలర్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, December 19, 2024, 9:40 [IST]
English summary
Ather 450 series rizta electric scooters price increases from 1st january 2025
Read more on: #ather energy #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+