Ather 450S ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.20,000 తగ్గింపు... 115 కి.మీ రేంజ్ సహా మరెన్నో ఫీచర్లు..!
ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఆశాజనకంగా వృద్ధి చెందుతోంది. అనేక తయారీ సంస్థలు నెలవారీగా గణనీయస్థాయిలో విక్రయాలను నమోదుచేస్తున్నాయి. బెంగళూరు ఆధారంగా తన కార్యకలాపాలను సాగిస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్ మార్కెట్‌లో తమ విక్రయాలు పెంచుకొనేందుకు ఈ నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది.
ఏథర్ తమ ఎంట్రీ లెవల్ మోడల్ Ather 450S ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ.20,000 తగ్గించింది. ఈ స్కూటర్ ధర రూ.1.09 లక్షలుగా ఉండగా.. తగ్గింపుతో రూ.97,500 (ఎక్స్‌షోరూం)కు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా ప్రో ప్యాక్‌తో కూడిన ఏథర్ 450S ఈవీ ధర రూ.25,000 తగ్గింది.

ఏథర్ 450S ప్రో ప్యాక్‌తో కొనుగోలు చేసే కస్టమర్లు రైడ్ అసిస్ట్, ఏథర్ బ్యాటరీ ప్రొటెక్ట్, ఏథర్‌స్టాక్ అప్‌డేట్‌లు సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందుకు అదనంగా రూ.10000 విలువైన ఏథర్ కనెక్ట్ ఫీచర్‌ను (3 సంవత్సరాల వరకు ఉచితం) పొందనుంది.
ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 5.4kW ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. గృహ విద్యుత్ కనెక్షన్ ద్వారా 0-80 శాతం ఛార్జింగ్ చేసేందుకు 6.36 గంటల సమయం పడుతుంది. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్‌తో 115 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. మరియు 3.9 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ ఈవీ గరిష్ఠంగా 90 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తుంది.

ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో, స్మార్ట్ ఎకో, రైడ్, స్పోర్ట్ వంటి రైడింగ్ మోడ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఈవీ 7- అంగుళాల డీప్‌వ్యూ డిస్‌ప్లే సహా డజన్ల కొద్దీ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. డిజైన్ సహా ఇతర అంశాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందంజలో ఉంది.
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. 2022 సంవత్సరం కంటే 2023లో ఈవీల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. అయితే ఈ విక్రయాలు మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. భారత్‌లోని పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే విక్రయాలు మరింత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

మౌలిక సదుపాయాలు అంటే ఛార్జింగ్ స్టేషన్లు, నిపుణులు వంటి కొరత అనేక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఇవి వూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ప్రజలు ఈవీల కొనుగోలుపై మరింత ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రముఖ సంస్థలు దేశంలోనే పలు ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లో తొలిదశలో ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








