పెట్రోల్ టూవీలర్స్‌కి టాటా చెప్పాల్సిన సమయం వచ్చేసింది.. ఆ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై కెవ్వుకేక ఆఫర్లు!
దేశంలో పండుగ సీజన్‌లో వాహనాల సేల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రత్యేకం ఈ సీజన్ కోసం వాహనాల ఉత్పత్తి సంస్థలు ప్రత్యేక దృష్టిన సారిస్తాయి. ప్రతీ కంపెనీ సేల్స్‌ని పెంచుకునేందుకు భారీ ఆఫర్లు, బెనిఫిట్స్‌ని అందిస్తాయి. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 స్కూటర్‌ని ఏకంగా రూ .49,999 కు అందిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ ద్విచక్రవాహనాల నుంచి ఈవీ లోకి మారాలనుకునే వారికి ఇంతకంటే మంచి ఆప్షన్ మళ్లీ రాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఓలా దేశంలో నంబర్ 1 ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీగా ఉంది. భారీ సంఖ్యలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే కోమాకి ఎలక్ట్రిక్, జెలియో ఇబైక్స్, టీవీఎస్ ఎలక్ట్రిక్ ఇంకా మరెన్నో కంపెనీలు భారీ ఆఫర్లను అందిస్తున్నాయి.
ఇప్పుడు ఓలా ప్రధాన ప్రత్యర్థి ఏథర్ ఎనర్జీ కూడా ఫెస్టివల్ ఆఫర్ ముందుకొచ్చింది. ఈ కంపెనీకి స్కూటర్లు సంవత్సరం వరకు కూడా నంబర్ 1గా ఉన్నాయి. అయితే ఓలా ఆఫర్లు, సర్వీస్ సౌకర్యాల వల్ల ఏథర్ ఎనర్జీ సేల్స్ తగ్గాయి. అయినా కానీ మార్కెట్‌లో ఈ కంపెనీ గట్టీ కాంపిటీటర్‌గా ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్ ఓవరాల్ సేల్స్‌లో ఈ కంపెనీ 5వ స్థానంలో ఉంది.

ఈ సంస్థ నుంచి 450X, ఫ్లాగ్‌షిప్ మోడల్ 450 అపెక్స్ (Ather Energy Apex) మోడళ్లపై ప్రత్యేక ఫెస్టివల్ ఆఫర్లను అందిస్తుంది. ఈ రెండు మోడళ్లపై మొత్తం రూ .25,000 వరకు బెనిఫిట్స్‌ని కస్టమర్లు పొందవచ్చు. ఈ ఫెస్టివ్ ఆఫర్‌లో (Ather Energy Festive Offers) ఎనిమిదేళ్ల పొడిగించిన బ్యాటరీ వారంటీ కూడా ఉంది. ఈ తగ్గింపు ఏథర్ ఎనర్జీ స్కూటర్లపై మరింత నమ్మకాన్ని కల్పించనుంది.
8 ఏళ్ల సుదీర్ఘ వారంటీ దాని ఉత్పత్తులపై నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా కొత్త కస్టమర్లను పెట్రోల్ స్కూటర్ల నుంచి ఈవీకి మారేలా చేయనుంది. పండుగ సీజన్ ఆఫర్లను వినియోగదారులతో పాటు ఇతర కమర్షియల్ అవసరాల కోసం చూస్తున్న వారు కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ బ్రాండ్ పండుగ సీజన్ ఆఫర్ కింద ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్ సెంటర్లలో రూ .5,000 విలువైన కాంప్లిమెంటరీ ఛార్జింగ్ సర్వీస్‌ని కూడా అందిస్తోంది.

అలాగే క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లకు రూ.10,000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ని కూడా లభించనుంది. ఏథర్ గ్రిడ్ ఇప్పటివరకు భారతదేశం అంతటా 2,152 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ ఏథర్ ఎనర్జీ 450ఎక్స్ ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో వచ్చే వెర్షన్ 111 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది.
మరో 3.7 కిలోవాట్ల బిగ్ బ్యాటరీ వేరియంట్ 150 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇక 450 అపెక్స్ ఈవీ మార్కెట్‌లోనే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఇది ఆ కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 157 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉంది.

ఈ ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈవీలో 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, 7 కిలోవాట్ల PMS ఎలక్ట్రిక్ మోటార్ ఉన్నాయి. అదనపు పవర్ డెలివరీ కోసం వార్ప్ మోడ్ స్థానంలో ఏథర్ ఎనర్జీ కొత్త వార్ప్ ప్లస్ మోడ్‌ని ఈ ఈవీలో ప్రవేశపెట్టింది.
ఈ స్కూటర్‌లో స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్, వార్ప్, వార్ప్ ప్లస్ అనే ఆరు రైడ్ మోడ్స్ ఉన్నాయి. ఏథర్ 450 అపెక్స్ చూడటానికి 450 సిరీస్ స్కూటర్ల మాదిరిగానే డిజైన్‌ని కలిగి ఉంది. లుక్ ఒకేలా ఉన్నప్పటికీ, ఏథర్ 450 బాడీ ప్యానెల్స్ ఐడీల్ బ్లూ కలర్ ఆప్షన్‌లోనూ లభిస్తుంది. ఈ స్కూటర్ మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








