ఒకేరోజు 501 మందికి డెలివెరీ.. కంపెనీ హిస్టరీలో అతిపెద్ద రికార్డ్!

దేశీయ విఫణిలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' (Ather Energy) గత కొన్ని రోజులకు ముందు 'రిజ్టా' (Rizta) స్కూటర్ లాంచ్ చేసింది. అయితే ఇటీవల కంపెనీ పూణేలో జరిగిన 'మీట్ రిజ్టా' (Meet Rizta) కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఏకంగా 501 మందికి రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీకి చూడవచ్చు. ఇది కంపెనీ చరిత్రలో అతిపెద్ద సింగిల్ డే డెలివరీగా నిలిచింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పూణేలో నిర్వహించబడిన మీట్ రిజ్టా కార్యక్రమం ద్వారా కంపెనీ డెలివరీలలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ, డిజైన్ ఫిలాసఫీ గురించి తెలుసుకున్నట్లు కస్టమర్లు పేర్కొన్నారు. ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ చూడచక్కని డిజైన్, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఎక్కువమందిని ఆకర్షిస్తుంది.

Ather Energy Rizta Scooter Delivery

కొత్త ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ సౌకర్యవంతమైన సీటు, 34-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, 22-లీటర్స్ ఫ్రంట్ యాక్సెసరీ స్టోరేజ్‌ ఇలా మొత్తం 56 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. నిజానికి ఫ్యామిలీ స్కూటర్ అంటే ఆ మాత్రం స్టోరేజ్ తప్పనిసరి. అంతే కాకుండా ఈ స్కూటర్ విశాలమైన లెగ్ స్పేస్, వైడ్ ప్లోర్ బోర్డ్ వంటివి పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ స్కిడ్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, యాంటీ థెఫ్ట్ అండ్ టో డిటెక్ట్ మరియు పింగ్ మై స్కూటర్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. నిజానికి సాధారణ పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువనే చెప్పాలి. ఇవన్నీ రైడర్లకు మంచి సేఫ్టీ అందిస్తాయని అవగతమవుతోంది.

Ather Energy Rizta Scooter

ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు రైడింగ్ మోడ్స్ పొందుతాయి. అవి ఎకో మరియు జిప్ మోడ్స్. ఎకో మోడ్ సాధారణ ప్రయాణానికి ఉపయోగపడితే.. జిప్ మోడ్ మాత్రం థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది. కాబట్టి ఇది రోజువారీ ఉపయోగానికి ఉత్తమమైన స్కూటర్ అని చెప్పవచ్చు. ఇది ఎస్, జెడ్ మరియు జెడ్ లాంగ్ రేంజ్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది.

ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరల విషయానికి వస్తే.. 2.9 కిలోవాట్ ఎస్ మోడల్ ధర రూ. 110156, 2.9 కిలోవాట్ జెడ్ మోడల్ ధర రూ. 125156 మరియు టాప్ వేరియంట్ 3.7 కిలోవాట్ జెడ్ మోడల్ ధర రూ. 145157 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఎస్ మోడల్ రేంజ్ 123 కిమీ, కాగా టాప్ స్పీడ్ 80 కిమీ /గం.

Ather Energy Rizta Scooter Front

జెడ్ లాంచ్ రేంజ్ మోడల్ ఒక ఫుల్ చార్జితో 159 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ మోడల్ 4 గంటల 30 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. కంపెనీ ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు డెలివరీ చేయడానికి ఉత్పత్తులను కూడా వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ తమిళనాడులోని హోసూర్‌లో రెండు తయారీ యూనిట్లను కలిగి ఉంది. ఇక్కడ వాహనాల అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా.. బ్యాటరీలు తయారవుతాయి.

ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకుని కంపెనీ మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లోని బిడ్కిన్స్ కూడా మూడవ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా కూడా కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయించనుంది. దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 30, 2024, 12:00 [IST]
English summary
Ather energy 501 rizta scooter delivery in pune single day
Read more on: #ather energy #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+