Halo స్మార్ట్ హెల్మెట్‌ను లాంచ్ చేసిన ఏథర్ ఎనర్జీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ(Ather Energy).. తన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్టా స్కూటర్‌తో పాటు, తన హాలో స్మార్ట్ హెల్మెట్‌ను కూడా లాంచ్ చేసింది. అధునాత ఫీచర్లతో రైడర్ ఫ్రెండ్లీగా దీన్ని పరిచయం చేసింది. ఇప్పటివరకూ హెల్మెట్‌కు కెమెరాను అమర్చుకుంటామనే విషయం తెలిసిందే.. ఇప్పుడు టెక్నికల్ ఫీచర్లతో కూడా హెల్మెట్ అందుబాటులో వచ్చింది.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా.. ఆధునిక కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఆటో మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉన్నాయి. వాహనాల్లో అధునాతన ఫీచర్లను తీసుకువస్తున్నాయి. ఇప్పుడు హెల్మెట్‌లో కూడా టెక్ ఫీచర్లను వినియోగిచుకోవచ్చు. ఈ మేరకు ఏథర్ ఎనర్జీ Halo Smart Helmet ను లాంచ్ చేసింది.

హాలో స్మార్ట్ హెల్మెట్‌లో మ్యూజిక్ మరియు కాల్ రిసెప్షన్ కోసం ఇంటిగ్రేటెడ్ స్పీకర్లను ఏథర్ ఎనర్జీ ప్రవేశపెట్టింది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మరియు బ్లూటూత్‌కు సపోర్ట్‌గా ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్ ఒక వారం వరకు ఉంటుంది. హాలో స్మార్ట్ హెల్మెట్ ధర రూ. 14,999. పరిచయ ఆఫర్ కింద ప్రస్తుతం రూ. 12,999 ధరలో అందుబాటులో ఉంది.
ఇక ఏథర్ రిజ్జా తన Ather Stack 6 సాఫ్ట్‌వేర్‌కు అనేక అప్‌గ్రేడ్‌లను తీసుకువచ్చింది. రైడర్ అనుభవాలను మెరుగుపరిచేలా ఇది ప్రయోజకరంగా ఉంటుంది. కొత్త Ather మొబైల్ యాప్‌లో మెరుగైన డ్యాష్‌బోర్డ్ డిస్‌ప్లే, మెరుగైన GPS యాక్టివిటీస్, స్టెబలిటీతో రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.

ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌తో పాటు, 'Ride Statistics' ను ఆకర్షణీయమైన 'Ride Stories''గా కూడా మార్చింది. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్‌లకు ఇంటరాక్టివ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. మీ రైడ్ హైలైట్‌లను కూడా ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా, Ather Rizta డ్యాష్‌బోర్డ్‌లో WhatsApp ఇంటిగ్రేషన్ వంటి వినూత్న ఫీచర్లను కూడా అందిస్తోంది.
కస్టమర్లను రైడింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ చూసుకోవాల్సిన అవసరం లేకుండా మీ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ద్వారా.. Ather Stack ద్వారా వాట్సాప్ మెసేజ్‌లు, కాల్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అంతే కాకుండా లైవ్ లొకేషన్ షేరింగ్ సౌలభ్యం మరియు భద్రతను కూడా మరింత మెరుగుపరుస్తుంది.

వీటితో పాటు 'Ping My Scooter' ఫీచర్ ద్వారా, రద్దీగా ఉండే పార్కింగ్ ప్రాంతాల్లో కూడా మీ స్కూటర్ లొకేషన్ ఐడెంటిఫికేషన్‌ను సులభతరం చేస్తుంది. ఇందుకోసం దాదాపు 40 వాయిస్ ప్రాంప్ట్‌లను అందిస్తోంది. ఈ ఫీచర్ల ద్వారా రైడర్లు చాలా స్మార్ట్‌గా రైడింగ్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.
కాగా ఏథర్ రిజ్టా(Ather Rizta) ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సంస్థ రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది.(ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఆసక్తి గల కస్టమర్లు రూ. 999 చెల్లించి ఈ ఫ్యామిలీ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. స్కూటర్ డెలివరీలు జులైలో ప్రారంభమవుతాయి. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








