Ather Expresscare ఏథర్ ఎనర్జీ గుడ్ న్యూస్.. ఇక కేవలం గంటలోనే మీ స్కూటర్‌కు క్వాలిటీ సర్వీస్
దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కస్టమర్ల కోసం తొలిసారిగా 'ఎక్స్‌ప్రెస్‌కేర్ సేవ'(Expresscare Service)ను ప్రారంభించింది. అంటే మీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం 60 నిమిషాల్లోనే సర్వీస్ చేసి మీకందిస్తుంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
కస్టమర్లను ఆకర్షించేందుకు ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారులు ప్రత్యేక ఆఫర్లు, వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నారు. ప్రత్యేక క్యాష్‌బ్యాక్, ధర తగ్గింపులు, నిర్దిష్ట రోజులకు ఉచిత రీఛార్జ్ సదుపాయంతో పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకొస్తాయి. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ.. దేశంలో ఎక్స్‌ప్రేస్ కేర్ సర్వీస్‌ను ప్రారంభించింది.

దీని ద్వారా మీ స్కూటర్‌ను కేవలం 60 నిమిషాల్లోనే సర్వీస్ చేసి అందిస్తుందని సంస్థ తెలిపింది. కాగా మొదటి దశలో, దేశంలోని 11 ప్రధాన నగరాల్లో 20 ఎక్స్‌ప్రెస్‌కేర్ సేవా(Ather Expresscare Service Centre) కేంద్రాలను ఏథర్ ఎనర్జీ ప్రారంభించింది. వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్యను 50కి పెంచాలని భావిస్తోంది.
తక్కువ సమయంలో అత్యంత నాణ్యమైన సేవను అందించనున్నట్లు ఏథర్ ఎనర్జీ తెలిపింది. అయితే సంస్థ ప్రకటించినట్లుగా 60 నిమిషాలకు మించి ఎక్కువ సమయం తీసుకోబోమని స్పష్టం చేసింది. స్పీడ్ అండ్ క్వాలిటీ సేవలను అందించేందుకు ప్రతి ఎక్స్‌ప్రెస్ కేర్ సేవా కేంద్రంలో ఇద్దరు ఎంపిక చేసుకున్న నిపుణులను నియమిస్తున్నట్లు వెల్లడించింది.

కస్టమర్ విలువైన సమయానికి ప్రాధాన్యతనిస్తూ ఆ లక్ష్యంతో ఏథర్ ఎనర్జీ ఈ ఎక్స్‌ప్రెస్ కేర్ సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కాగా త్వరలో ఈ సేవలను సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. సర్వీస్ కోసం బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా కస్టమర్లకు ఆలస్యం కాకుండా నిర్దిష్ట సమయంలోనే సర్వీస్ చేసుకోవచ్చు.
ఈ క్రమంలో ఏథర్ ఎనర్జీ ప్రీమియం ప్రాతిపదికన ఈ సర్వీస్‌ను రూ. 125 నుంచి రూ. 150 వరకు అందిస్తోంది. ట్రయల్ రన్‌గా ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌కు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ట్రయల్ రన్‌గా ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌కు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోందని సంస్థ తెలిపింది.
ట్రయల్ రన్‌లో భాగంగా గత రెండు నెలల్లో 2000 మంది కస్టమర్‌లు ఈ సేవను వినియోగించుకున్నారని ఏథర్ ఎనర్జీ వెల్లడించింది. కస్టమర్లకు అంతరాయం లేని సేవా అనుభవాన్ని అందించడానికి ఎక్స్‌ప్రెస్ కేర్‌ను అందించినట్లు ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రన్‌వీత్ సింగ్ ఫోకెలా అన్నారు. సత్వర సేవ ద్వారా కస్టమర్లకు రాబోయే నెలల్లో మరిన్ని సేవలను అందిస్తామని వెల్లడించారు.
ఈ దశలో, ఏథర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేసే యోచనలో ఉంది. కాగా భారత మార్కెట్లో ప్రస్తుతానికి, ఏథర్ ఎనర్జీ మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయిస్తోంది. అవి ఏథర్ 450 అపెక్స్(Ather 450 Apex), ఏథర్ 450ఎక్స్(Ather 450X) మరియు ఏథర్ 450ఎస్(Ather 450S). దేశంలో ఓలా, సింపుల్ ఎనర్జీ, టీవీఎస్ బ్రాండ్ ఇ స్కూటర్లకు సంస్థ గట్టిపోటీనిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








