యువతను సస్పెన్స్‌లో పడేసిన 'ఏథర్' కొత్త టీజర్.. ఇంతకీ అందులో ఏముంది.??
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనతయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy).. త్వరలో రిజ్టా అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది ఫ్యామిలీ కోసం సంస్థ ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. పెద్ద సీట్ సౌకర్యంతో పాటు అధునాతన ఫీచర్లతో ఇది లాంచ్ కానుంది.
ఏథర్ ఎనర్జీ.. రిజ్టా(Ather Rizta) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఏప్రిల్ 6వ తేదీన మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. అంతేకాకుండా అదే రోజు, ఈథర్ కంపెనీ తన కమ్యూనిటీ డేని కూడా జరుపుకోనుంది. ఈ దశలో భారత్‌లో మరో క్వాలిటీ ఈవెంట్ చేసేందుకు ఏథర్ ఎనర్జీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఏథర్ ఎనర్జీ కంపెనీ దేశంలో కొత్త ఉత్పత్తిని విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే అది కొత్త వాహనం మాత్రం కాదు. కంపెనీ యాక్సెసరీస్‌గా సంస్థ వెల్లడించింది. అదే రోజు ఏప్రిల్ 6న దీన్ని కంపెనీ దీనిని ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఒక పోస్ట్‌ను పెట్టింది.
ఏథర్ ఎనర్జీ తన అధికారిక సోషల్ మీడియా పేజ్‌లో 'సే హాలో'(Halo) అనే టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది. దీని ద్వారా, కంపెనీ తన కొత్త ఉత్పత్తిని ప్రారంభించడాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ ద్వారా కొత్త ఉత్పత్తిపై ఎలక్ట్రిక్ వాహన ప్రియుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి.
టీజర్ వీడియోను పరిశీలించినట్లయితే ఇది స్మార్ట్ హెల్మెట్(Ather Smart Helmet) అని తెలుస్తోంది. అయితే తమ కంపెనీ హెల్మెట్‌లను ప్రవేశపెట్టబోతోందన్న సమాచారాన్ని మాత్రం సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఏప్రిల్ 6 వ తేదీన దీనిపై స్పష్టత రానుంది. ఒకవేళ ఇది హెల్మెట్ అయితే, హెల్మెట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, హెడ్స్-అప్ డిస్‌ప్లే, నావిగేషన్ మొదలైన ఫీచర్లు ఉండే అవకాశాలు ఉన్నాయి.
కాగా భారత మార్కెట్లో ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం.. కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ స్కూటర్‌ను పరిచయం చేసినప్పటి నుంచి భారత కస్టమర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో తన స్మార్ట్ యాక్సెసరీస్(Say Halo) గురించి ఆసక్తికర సమాచారాన్ని సంస్థ పంచుకుంది.
ఏథర్ రిజ్జా సీటు.. హోండా యాక్టివా కంటే పెద్దదిగా ఉంటుందని ఏథర్ ఎనర్జీ కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఇది పెద్ద బూట్ స్పేస్‌తో కూడా వస్తుంది. తద్వారా దీనిపై ఫ్యామిలీ స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని సంస్థ చెబుతోంది. దీనిపై వృద్ధులు కూడా సులభంగా ఎక్కి ప్రయాణించవచ్చని వెల్లడించింది.
ఇక ఫీచర్లు, సౌకర్యాలను పక్కనబెడితే.. రేంజ్ పరంగా కూడా ఏథర్ రిజ్టా కూడా భారతీయ కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని సంస్థ చెబుతోంది. పెద్ద స్క్రీన్‌తో పాటు కనెక్టివిటీ ఫీచర్లతో రాబోతుందని తెలుస్తోంది. కాగా ఏథర్ ఎనర్జీ ఉత్పత్తులకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. 450X ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌కు యువతలో క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఫ్యామిలీ కస్టమర్లను కూడా పెంచుకోవాలనే యోచనలో రిజ్టాను తీసుకువస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








