Ather Rizta ఏథర్‌ నుంచి ఫ్యామిలీ స్కూటర్‌ వచ్చేస్తోంది.. పెద్ద సీటు, డిజైన్‌ సహా ఆకట్టుకునే ఫీచర్లు

దేశంలో ప్రముఖ టూ వీలర్‌ తయారీదారు ఏథర్‌ ఎనర్జీ త్వరలో ఫ్యామిలీ స్కూటర్‌ రిజ్టాను లాంచ్‌ చేయనుంది. ఈ క్రమంలో లాంచ్‌కు ముందే కంపెనీ టీజర్‌ను మరోసారి విడుదల చేసింది. కాగా ఇప్పటికే Rizta E Scooter కి సంబంధించి కీలక విషయాలను వెల్లడించిన ఏథర్‌ ఎనర్జీ.. ఇప్పుడు టీజర్‌ ద్వారా ఈ స్కూటర్‌పై అంచనాలను మరింతగా పెంచింది.

ఏథర్‌ ఎనర్జీ(Ather Energy) సీఈవో ఇప్పటికే రిజ్టా ఇ స్కూటర్‌కు సంబంధించి సీట్‌ సైజ్‌ను.. ఓలా ఎలక్ట్రిక్‌కు చెందిన S1 స్కూటర్‌తో పోల్చడంతో పాటు, హోండా యాక్టివా స్కూటర్‌ సీటుతో పోలుస్తూ రిజ్టాలోని ప్రత్యేకతలను వెల్లడించింది. ఈ క్రమంలో Rizta.. దిగ్గజ బ్రాండ్లకు గట్టి పోటీనివ్వనున్నట్లు తెలుస్తోంది.

Ather-Rizta-Electric-Scooter

యువ రైడర్లు, టెక్నాలజీ అప్‌డేట్లను ఇష్టపడే రైడర్లను లక్ష్యంగా చేసుకుని ఏథర్‌ ఎనర్జీ.. Ather Rizta ఇ స్కూటర్‌ను రూపొందించింది. ఫ్యామిలీ స్కూటర్‌గా పెద్ద సైజు సీట్‌తో, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అర్బన్ కస్టమర్లకు రిజ్టా స్కూటర్‌ మరింత అనువుగా ఉంటుందని తెలుస్తోంది.

ఈ టీజర్‌ వీడియో ద్వారా భారత మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్‌ సెగ్మెంట్‌లో సత్తా చాటుతున్న కంపెనీలతో పోలిస్తే.. రిజ్టా స్పేస్‌ మరియు ప్రాక్టికాలిటీపై సంస్థ ఎక్కువగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. రైడర్‌ తన సీట్లో విశాలంగా కూర్చున్న తర్వాత.. పిలియన్‌ సీటు ఇంకా విశాలంగా కనిపిస్తోంది. దీనిపై ఇద్దరు ప్రయాణికులు సౌకర్యంగా కూర్చునేలా నిర్మించారు.

Ather-Rizta-Electric-Scooter

అంతేకాకుండా రిజ్టా ఇ స్కూటర్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పెద్ద ఫ్లోర్‌బోర్డ్‌ ఉన్నాయి. లగేజ్‌ స్పేస్‌ను ఈ టీజర్‌ వీడియోలో సంస్థ ఎక్కువగా హైలైట్‌ చేసింది. డిజైన్‌తో పాటు దీని స్టైలింగ్‌.. ఏథర్‌ 450 సిరీస్‌ స్కూటర్ల నుంచి వేరు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని పనితీరు, బోల్డ్‌నెస్‌, యూత్‌ను ఆకట్టుకునే డిజైన్‌ ద్వారా రిజ్టా.. యువ రైడర్లను ఆకట్టుకునేలా ఉంటుందని సంస్థ భావిస్తోంది.

ఫీచర్ల విషయానికొస్తే కొత్త ఏథర్‌ రిజ్టా(Ather Rizta Features) ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎల్‌ఈడీ లైట్లు, రైడింగ్ మోడ్‌లు, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. పవర్‌ట్రెయిన్‌ విషయానికొస్తే.. ఇందులో కొత్త బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ మోటార్‌ సెటప్‌ను అమర్చే అవకాశం ఉంది.

Ather-Rizta-Electric-Scooter

భారతీయ మార్కెట్లో రిజ్టా.. టీవీఎస్‌ iQube, బజాజ్‌ చేతక్‌ ప్రీమియం వంటి స్కూటర్లకు గట్టి ఇవ్వనుంది. త్వరలో లాంచ్‌ కానున్న ఈ స్కూటర్‌ ధర రూ. 1.25 లక్షలు(ఎక్స్‌-షోరూమ్‌) గా ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా ఈ స్కూటర్‌ పెద్ద బ్యాటరీ ప్యాక్‌, అధిక రేంజ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

భారత మార్కెట్లో ప్రస్తుతం ఏథర్‌ ఎనర్జీ 450 సిరీస్‌ స్కూటర్లను విక్రయిస్తోంది. మెరుగైన పనితీరు, హై పర్ఫామెన్స్‌ బ్యాటరీ ప్యాక్‌తో 450S, 450X, 450 Apex స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ధరలు వరుసగా రూ. 1.27 లక్షలు, 1.73 లక్షలు, 1.89 లక్షలుగా ఉన్నాయి.(ఎక్స్‌-షోరూమ్‌). ఎంచుకున్న బ్యాటరీ ప్యాక్‌ ఆధారంగా 110 కి.మీ నుంచి 157 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తాయి.

More from DriveSpark

Article Published On: Friday, February 16, 2024, 18:30 [IST]
English summary
Ather energy rizta family electric scooter teaser ahead of launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+