మోకాళ్ల లోతు నీళ్లలోనైనా ఏథర్‌ రిజ్టా ఇ స్కూటర్‌తో సేఫ్‌ జర్నీ.. ఇంట్రెస్టింగ్‌ టీజర్‌ చూసేయండి.!!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ నుంచి మరికొద్ది రోజుల్లో ఏథర్‌ రిజ్టా(Ather Rizta) పేరుతో ఫ్యామిలీ స్కూటర్‌ విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ స్కూటర్‌కు సంబంధించి టెస్ట్‌ రైడ్‌లు జరుగుతున్నాయి. అనేక విధాలుగా సంస్థ ఈ స్కూటర్‌ను పరీక్షిస్తోంది. ఈ క్రమంలో తాజాగా 400 మి.మీ లోతులో నీటి ప్రవాహంలో ఈ స్కూటర్‌ను టెస్ట్‌ రైడ్‌ చేశారు.

భారత మార్కెట్లో ఏథర్‌ ఎనర్జీ ఇప్పటికే స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేసి జోరుగా విక్రయాలను సాధిస్తోంది. మెరుగైన పర్ఫామెన్స్‌, స్టైలిష్‌ డిజైన్‌తో సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిశీలించవచ్చు. ఈ క్రమంలో ఫ్యామిలీ స్కూటర్‌ కోసం వెతుకుతున్న కస్టమర్ల కోసం, ఈథర్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిస్టా పేరుతో ఏప్రిల్ 6వ తేదీన లాంచ్‌ చేయనుంది.

Ather-Rizta-Electric-Scooter-Water-Wading-Test

ప్రస్తుతం ఏథర్‌ ఎనర్జీ ఈ స్కూటర్‌(Ather Rizta Launch)ని పరీక్షిస్తోంది. ఈ టెస్ట్‌ రైడ్‌లకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటోంది. కాగా కొద్ది రోజుల క్రితం దీని బ్యాటరీ టెస్టింగ్ వీడియో విడుదలైంది. ఇప్పుడు ఈ స్కూటర్‌ను నీటిలో పరీక్షిస్తున్న వీడియో ఒకటి విడుదలై నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఈ వీడియోలో, ఒక వ్యక్తి ఈథర్ రిజ్టా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(Ather Rizta Waterproofing Video)ను నడుపుతున్నాడు. దాదాపు 400 మిల్లీమీటర్ల లోతులో డిజైన్‌ చేసిన ఓ చిన్నపాటి నీటి కాలువలో ఈ స్కూటర్‌ను రైడ్‌ చేస్తున్నాడు. ఆ నీళ్లలో రిజ్టా స్కూటర్ ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా ప్రయాణించడాన్ని చూడవచ్చు.

Ather-Rizta-Electric-Scooter-Water-Wading-Test

ఈ టెస్ట్‌ ద్వారా, ఈథర్ తన వాహన బ్యాటరీ మరియు మోటారుకు IP67 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ ఇస్తుంది. దీని ద్వారా కంపెనీ ఆ నాణ్యతను పరీక్షించగా.. విజయవంతంగా, ఈ స్కూటర్ 400 మిల్లీమీటర్ల లోతు నీటిని సురక్షితంగా దాటింది. అందువల్ల, ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసేవారు వర్షాకాలంలో కూడా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఏ సమస్య లేకుండా నడపవచ్చు.

అయితే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నీళ్లలో నడపడం ద్వారా దాని లైఫ్ తగ్గిపోతుంని మరియు బ్యాటరీ దెబ్బతింటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇందుకోసమే ఏథర్‌ ఈ టెస్ట్‌ నిర్వహించి.. దానికి IP67 సర్టిఫికేట్‌ను ఇచ్చింది. అంతేకాదు ఈ వీడియోలో, రిజ్జా స్కూటర్‌ ముందు భాగంలో డిస్‌ప్లే స్కీన్‌ను, LED హెడ్‌ల్యాంప్‌ను కూడా ప్రదర్శించింది.

Ather-Rizta-Electric-Scooter-Water-Wading-Test

కానీ వీడియోలో స్క్రీన్(Ather Energy) అస్పష్టంగా ఉంటుంది. కాగా ఇది 7-అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో రావొచ్చని భావిస్తున్నారు. అయితే ఇదే డిస్‌ప్లేను ఏథర్‌ 450ఎక్స్‌లో చూడవచ్చు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఏథర్‌ రిజ్టా స్కూటర్‌కు సంబంధించి పలు వీడియోలు ఔత్సాహికులను ఆకర్షిస్తున్నాయి.

అతి పెద్ద సీటింగ్‌తో పాటు, బ్యాటరీ, ఇంకా వాటర్‌ ప్రూఫింగ్‌తో ఏథర్‌ రిజ్జా తనను తాను నిరూపించుకుంటోంది. ఏప్రిల్ 6న అధికారికంగా విడుదల కానుంది. లాంచ్‌ సమయంలో ఈ స్కూటర్‌ ధర మరియు ఇతర అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఫ్యామిలీకి బెస్ట్‌ ఆప్షన్‌గా ఈ స్కూటర్‌ నిలుస్తుందని ఏథర్‌ ఎనర్జీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 20, 2024, 18:41 [IST]
English summary
Ather rizta electric scooter water wading test to proof its battery and motor capacity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+