ఫేమస్‌ కంపెనీ ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెలివరీలు ప్రారంభం.. ప్రస్తుతానికి ఆంధ్రాలో.. త్వరలో తెలంగాణలోకి!!

ఏథర్ ఎనర్జీ విడుదల చేసిన కొత్త రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో ప్రకటించింది. ఈ స్కూటర్‌ ఏ ప్రముఖ సిటీలలో అందుబాటులో ఉంటుందనే విషయాన్ని ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వెల్లడించాడు. ఏథర్ రిజ్టా రూ .1.10 లక్షల నుంచి ప్రారంభమై రూ .1.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వరకు అందుబాటులో ఉంది.

ఈ సరికొత్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రస్తుతం అహ్మదాబాద్, పూణే, ఢిల్లీ, లక్నో, ఆగ్రా, జైపూర్, నాగ్‌పూర్‌ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా డెలివరీలు ప్రారంభం కానున్నాయి. మిగతా సిటీలలో ఏథర్ రిజ్టా డెలివరీలు అతి త్వరలో ప్రారంభమయ్యాయి. ఏథర్‌ నుంచి వస్తున్న ఈ స్కూటర్‌ సరికొత్త స్కూటర్‌ ఉత్పత్తిని జూన్‌లో ప్రారంభించింది. ఏప్రిల్‌లో ఈ స్కూటర్‌ని విడుదల చేసింది.

Ather-Rizta-Family-Scooter-Deliveries-Begin

కేవలం ఫ్యామీలీలను దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్‌ని సంస్థ విడుదల చేసింది. ఈ స్కూటర్‌ మెయిన్ ఫ్రేమ్ ఒకేలా ఉన్నప్పటికీ తక్కువ సీటు ఎత్తుతో మోడల్‌ని ఫ్యామిలీలకు అనువుగా తీసుకువచ్చిన సబ్ ఫ్రేమ్ కొత్తగా ఉంది. ఈ స్కూటర్‌లోని PMS ఎలక్ట్రిక్ మోటారు 450S నుంచి శక్తిని అందిస్తుంది. ఇది 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకన్లలో 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.

ఏథర్‌ రిజ్టా మల్టీ బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులో 2.9 కిలోవాట్ల యూనిట్‌ బ్యాటరీ ప్యాక్ 123 కి.మీ రేంజ్‌, 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల (క్లెయిమ్) పరిధిని అందిస్తుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ పవర్ ముందు భాగంలో డిస్క్ మరియు వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్‌తో వస్తుంది.

Ather-Rizta-Family-Scooter-Deliveries

ఈ-స్కూటర్ S (2.9 కిలోవాట్), Z (2.9 కిలోవాట్), Z(3.7 కిలోవాట్) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ రిజ్టా ఎస్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో డీప్‌ వ్యూ ఎల్‌సీడీ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. Z వేరియట్స్‌ గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌తో కూడిన TFT స్క్రీన్స్‌తో వస్తాయి. ముఖ్యంగా, ఎస్ ట్రిమ్ ప్రామాణిక సీటును మాత్రమే పొందుతుంది. పిలియన్ రైడర్‌కి బ్యాక్‌రెస్ట్‌ ఆప్షన్‌ లేదు.

జెడ్ ట్రిమ్స్‌ ప్రీమియం సీటుతో వస్తుంది. 2.9 కిలోవాట్ల వెర్షన్లలో ఛార్జింగ్ సమయం 5 గంటల 45 నిమిషాలు, 3.7 కిలోవాట్ల వెర్షన్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి 4 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. పైన తెలిపిన టైమింగ్స్‌ 0-80 శాతం పూర్తయ్యేందుకు పట్టే విధంగా ఉన్నాయి. ఏథర్ రిజ్టా S ధర రూ .1.10 లక్షల (ఎక్స్-షోరూమ్‌) వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

అయితే ఫ్యాన్సీ ఫీచర్లతో ప్రో ప్యాక్ ధర రూ .13,000 కంటే ఎక్కువ ప్రీమియంతో వస్తుంది. ఇక రిజ్టా జెడ్ (2.9 కిలోవాట్ల) ధర రూ .1.25 లక్షలు ప్రో ప్యాక్ కోసం అదనంగా రూ .15,000 చెల్లించాలి. రిజ్టా జెడ్ (3.7 కిలోవాట్) ధర రూ .1.45 లక్షలు.. ప్రో ప్యాక్ కోసం అదనంగా రూ .20,000 చెల్లించాలి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, July 4, 2024, 10:32 [IST]
English summary
Ather rizta family electric scooter deliveries begin in few cities in first
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+