Ather Rizta ఫ్యామిలీ స్కూటర్ వచ్చేసింది.. 125 కి.మీ రేంజ్.. ధర, ఫీచర్లు ఇవే
ఏథర్ ఎనర్జీ తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూర్ రిజ్టాను లాంచ్ చేసింది. అతి పెద్ద సీటింగ్ సౌకర్యం, స్టోరేజ్ స్పేస్‌తో ఫ్యామిలీ స్కూటర్‌గా Ather Rizta విడుదల చేసింది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు Halo స్మార్ట్ హెల్మెట్‌ను కూడా లాంచ్ చేసింది. రిజ్టా స్కూటర్ ధర, ఫీచర్లు, బ్యాటరీ పర్ఫామెన్స్ పూర్తి వివరాలు ఈ కథనంలో..
ధర: ఏథర్ రిజ్టా(Ather Rizta) ఫ్యామిలీ స్కూటర్‌ను సంస్థ రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది.(ఎక్స్-షోరూమ్, బెంగళూరు). ఆసక్తి గల కస్టమర్లు రూ. 999 చెల్లించి ఈ ఫ్యామిలీ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. స్కూటర్ డెలివరీలు జులైలో ప్రారంభమవుతాయి.

డిజైన్: ఫ్యామిలీ కస్టమర్ల అభిరుచి, ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఏథర్ రిజ్టాను కొత్త ప్లాట్‌ఫామ్‌తో అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది. ఆకట్టుకునే డిజైన్‌తో మరింత స్టైలింగ్‌గా రిజ్టాను సంస్థ రూపొందించింది. మృదువైన లైన్‌లు, గుండ్రని ప్యానెల్‌లు, మోనో-LED హెడ్‌ల్యాంప్, సొగసైన LED టైల్‌లైట్, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
రిజ్టా స్కూటర్‌పై ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేలా ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డును కలిగి ఉంది. స్టోరేజ్ కోసం పెద్ద బూట్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది. ఇక ఫీచర్ల పరంగా రిజ్టా స్కూటర్ కస్టమర్లను నిరాశ పరచదని సంస్థ వెల్లడించింది. అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.

ఫీచర్లు: ఏథర్ 450X ఆధారంగా టచ్ ఫంక్షనాలిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా తాజాగా Ather Stack 6 సాంకేతికత ఆధారంగా Rizta పార్క్ అసిస్ట్, ఆటో హిల్ హోల్డ్ వంటి ప్రముఖ ఫీచర్లను కూడా కలిగి ఉంది.
రిజ్టా బ్యాటరీ ప్యాక్: రైడర్ల ప్రాధాన్యతలు మరియు రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా రిజ్టాలో రెండు విభిన్న రైడింగ్ మోడ్‌లు SmartEco మరియు Zip ప్రవేశపెట్టింది. ఇందులో శక్తివంతమైన PMS ఎలక్ట్రిక్ మోటారును అమర్చింది. కస్టమర్లకో కోసం మల్టీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లను అందిస్తుంది.

రిజ్టా స్కూటర్‌లోని చిన్న బ్యాటరీ ప్యాక్ 2.9 kWh.. పూర్తి ఛార్జ్‌పై 105 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. పెద్ద 3.7 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై 125 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇది ఏథర్ 450X కంటే ఎక్కువ. కేవలం 3.7 సెకన్లలో 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగం గంటకు 80 కి.మీ.
ఏథర్ రిజ్టా స్పెసిఫికేషన్స్: రిజ్టా స్కూటర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుకవైపు సింగిల్ షాక్ అబ్జార్బర్‌ను కలిగి ఉంది. దీని ద్వారా రైడర్లు సాఫీ రైడింగ్‌ను ఆస్వాదించవచ్చు. బ్రేకింగ్ విషయానికొస్తే.. ఫ్రంట్ డిస్క్ మరియు రియర్ డ్రమ్ బ్రేక్ సెటప్‌ను అందిస్తుంది.

ఏథర్ రిజ్జా.. TVS iQube, Ola S1 Pro, మరియు బజాజ్ చేతక్ వంటి ప్రముఖ స్కూటర్లకు గట్టి పోటీగా విడుదలైంది. ఈ స్కూటర్ బేస్ వేరియంట్ (S) ధర రూ. 1.10 లక్షలు. హై-ఎండ్ వేరియంట్‌ల (Z) ధర రూ. 1.24 నుండి రూ. 1.44 లక్షల వరకు ఉంటుంది. ఆసక్తి గల కస్టమర్లు పూర్తి వివరాల కోసం ఏథర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను సందర్శించి ప్రత్యక్ష అనుభవాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications








