కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ(Ather Energy) గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఏథర్ ఎనర్జీ నుంచి భారీ అంచనాలతో త్వరలో విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా(Ather Rizta)కు సంబంధించి ప్రీ బుకింగ్‌లను సంస్థ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోనే అతి పెద్ద స్కూటర్, ఫ్యామిలీ స్కూటర్‌ను మొదటిసారిగా ఏథర్ ఎనర్జీ తీసుకువస్తోంది. ఏథర్ రిజ్టా పేరుతో రానున్న ఈ ఫ్యామిలీ స్కూటర్ ఈ ఏడాది ఏప్రిల్ 6 న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకువారి సంస్థ ప్రీ బుకింగ్‌లను ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ బుకింగ్‌లు తెరవబడ్డాయి.

ఏథర్ ఎనర్జీ రిజ్టా(Ather Rizta Pre Bookings) స్కూటర్‌ను కస్టమర్లు రూ. 999 ఫీజు చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఇప్పటికే రిజ్టా స్కూటర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ స్కూటర్ టెస్ట్‌కు సంబంధించి సంస్థ అనేక వీడియోలను విడుదల చేసింది. స్కూటర్ సీటింగ్, బ్యాటరీ కెపాసిటీ, బ్యాటరీ స్టాండర్డ్స్, దాని కేపబిలిటీ గురించి ఆసక్తికర వీడియోలను పంచుకుంది.
ఏథర్ రిజ్టాను, ఫ్యామిలీ-ఓరియెంటెడ్(Rizta Family Scooter) స్కూటర్‌గా ఏథర్ ఎనర్జీ పరిచయం చేయనుంది. ఏథర్ 450X కంటే ఇది చాలా పెద్ద సీటును కలిగి ఉంది. రిజ్టా స్కూటర్ సీటు.. మార్కెట్‌లోనే అతి పెద్దదని సంస్థ ఏథర్ సీఈఓ పేర్కొన్నారు. అంతేకాకుండా రిజ్టా పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్‌తో రానున్నట్లు తెలుస్తోంది.

ఉదాహరణకు ఏథర్ 450X.. 22-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంది. దీనితో పోలిస్తే రిజ్టా స్కూటర్ ఇంకా పెద్ద స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉండొచ్చు. అంతేకాకుండా దీని వాటర్‌వేడింగ్ సామర్థ్యాన్ని కూడా ఏథర్ ఎనర్జీ నిరూపించింది. మోకాళ్ల లోతు నీళ్లలో రిజ్టా స్కూటర్‌ను నడిపిస్తున్న టీజర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది.
ఆ టీజర్ ద్వారా ఏథర్ రిజ్టా.. ఆప్రాన్-మౌంటెడ్ LED హెడ్‌లైట్‌తో ఆకర్షణీయంగా ఉండటంతో పాటు.. DRL హెడ్‌లైట్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ మన్నికను కూడా ఏథర్ ఎనర్జీ టెస్ట్ చేసింది. 40 అడుగుల ఎత్తు నుంచి బ్యాటరీని కింద పడేసినా కూడా ఆ బ్యాటరీ చెక్కు చెదరకుండా ఉందని సంస్థ వీడియోలో ప్రదర్శించింది.
రిజ్టాతో పాటు ఏథర్ ఎనర్జీ కొత్త Atherstack 6 OTA అప్‌డేట్‌ను కూడా విడుదల చేయనుంది. ఇంకా 'Halo' అనే స్మార్ట్ యాక్సెసరీని సంస్థ రిజ్జా లాంచ్‌తో పాటు పరిచయం చేయనుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది స్మార్ట్ హెల్మెట్‌గా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ధర విషయానికొస్తే ఏథర్ రిజ్టా.. సుమారు రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లో రిజ్టా.. TVS iQube , Hero Vida V1 Pro , Ola S1 Air మరియు బజాజ్ చేతక్‌లను ప్రత్యక్ష పోటీగా రానుంది. ఇక ఏథర్ మార్కెట్లో 450 సిరీస్ స్కూటర్లను విక్రయిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








