Ather Rizta Full Review Video ఏథర్ రిజ్టా ఫర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ వీడియో
బెంగుళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ స్కూటర్లు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి. తాజాగా ఆ కంపెనీ కేవలం ఫ్యామీలల కోసం ప్రత్యేకంగా ఓ స్కూటర్‌ని విడుదల చేసింది. దాని పేరే ఏథర్ రిజ్టా. ఈ స్కూటర్ రోజువారీ కుటుంబ అవసరాలతో పాటు మంచి రైడింగ్ అనుభూతిని కల్పించనుంది.
ఏథర్ ఎనర్జీ నుంచి విడుదలైన ఫ్యామిలీ స్కూటర్ రిజ్టాను మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ టెస్ట్‌రైడ్ చేసింది. ఈ స్కూటర్‌కి సంబంధించిన ఫర్ఫామెన్స్, ఫుల్ రివ్యూ కింద వీడియోలో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ స్కూటర్ నిజంగా ఫ్యామిలీల కోసం రూపొందిచారా లేదా ఇతర అవసరాలకు సైతం ఇది పనికి వస్తుందా లేదా అనే విషయాన్ని రివ్యూలో తెలుసుకోండి.
ఈ స్కూటర్ ఇప్పటి వరకు వచ్చిన డిజైన్‌లకంటే భిన్నంగా ఉండనుంది. ముఖ్యంగా ఇందులో మీరు 54 లీటర్ల లగేజీ స్పేస్‌ని పొందవచ్చు. ఇక Rizta Z వేరియంట్‌లో 7-అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉండగా, Rizta Sలో 450S మాదిరిగా 'డీప్‌వ్యూ' LCDని పొందుపరచారు.
ఈ స్కూటర్‌లో నావిగేషన్, ఫైండ్ మై స్కూటర్, థెఫ్ట్ నోటిఫికేషన్‌లు, అలెక్సా మరియు మరిన్ని ఇతర అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. 'ప్రో' ప్యాకేజీ స్కూటర్‌లో డ్యూయల్ డిస్‌ప్లేలు ప్రత్యేకించి అనేక ఫీచర్లకు అనుమతిస్తాయి. Z వేరియంట్‌లో ప్రయాణం చేసేటప్పుడు Google Maps, WhatsApp ప్రివ్యూలు మరియు కాల్ అలర్ట్స్ వంటి ప్రత్యేక ఫీచర్లున్నాయి.



Click it and Unblock the Notifications








