కొత్త బైక్ కొనాలంటే ఇదే సరైన సమయం.. ఈ ఫేమస్ బ్రాండ్ మోడళ్లపై ఏకంగా రూ. 60,000 తగ్గింపు.. వివరాలివే.!!
కొత్త బైక్ కొనాలనుకునేవారికి ప్రముఖ టూ వీలర్ తయారీదారు కవాసకి(Offers On Kawasaki) సూపర్ న్యూస్ తీసుకువచ్చింది. తన అడ్వెంచరస్ బైక్‌లపై ఈ నెలలో ఏకంగా రూ. 60,000 తగ్గింపును అందిస్తోంది. గుడ్ టైమ్స్ వోచర్‌ల కింద కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరి ఏయే బైక్‌లపై ఈ ఆఫర్లు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
కవాసకి ఇండియా(Kawasaki India March Offers) తన లైనప్‌లోని ఎంపిక చేసిన మోటార్‌సైకిళ్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ మేరకు వివరాలు ప్రకటించింది. 300cc నుండి 500cc మల్టీ-సిలిండర్ మోటార్‌సైకిల్ విభాగంలో మార్కెట్లో విపరీతంగా పోటీ ఉంది. ఈ క్రమంలో ఈ తరహా బైక్‌ల కోసం చూసేవారికి కవాసకి బంపర్ ఆఫర్‌ను తీసుకువచ్చింది.

భారత మార్కెట్లో కవాసకి ఇండియా 300cc నుండి 500cc విభాగంలో ఐదు మోడళ్లను కలిగి ఉంది. నింజా 300, నింజా 400, ఎలిమినేటర్ 400, నింజా ZX-4R మరియు ఇటీవల ప్రారంభించిన నింజా 500. కాగా 650cc కేటగిరీలో ఐదు మోడళ్లు.. నింజా 650, వెర్సిస్ 650, Z650, V650, RS మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.
కాగా ఈ పది వాహనాల్లో.. కవాసకి ఇండియా నాలుగు బైక్‌లపై ఈ ఆఫర్‌ను అందిస్తోంది. Good Times Voucher పేరిట కవాసకి ఇండియా ఈ ప్రయోజనాలను ప్రకటించింది. మోడల్‌ను బట్టి కస్టమర్లు ఆఫర్లను పొందవచ్చు. కవాసకి నింజా 400 పై రూ. 40,000 భారీ తగ్గింపును అందిస్తోంది. మార్కెట్లో నింజా 400 ధర రూ. 5.24 లక్షలుగా(ఎక్స్-షోరూమ్) ఉంది.

కవాసకి నింజా 400 ఇంజిన్ విషయానికొస్తే ఇది 399cc సమాంతర-ట్విన్ DOHC 4V లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 10,000 RPM వద్ద 44.7 bhp మరియు 8,000 RPM వద్ద 37 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

గుడ్ టైమ్స్ వోచర్ బెనిఫిట్ కింద.. కవాసకి నింజా 650 పై.. రూ. 30,000 తగ్గింపును ప్రకటించింది. మార్కెట్లో దీని ధర రూ. 7.16 లక్షలు (ఎక్స్-షోరూమ్). 649cc సమాంతర-ట్విన్ DOHC 4V లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8,000 RPM వద్ద 67.3 bhp మరియు 6,700 RPM వద్ద 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
ఇక మరో మోడల్.. కవాసకి వెర్సిస్ 650 పై కస్టమర్లు రూ. 45,000 భారీ తగ్గింపును పొందవచ్చు. Versys 650 దాని పవర్‌ట్రెయిన్‌ను నింజా 650తో పోలి ఉంటుంది. ఇంజిన్ 8,500 RPM వద్ద 65.7 bhp మరియు 7,000 RPM వద్ద 61 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో వెర్సిస్ 650 ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.77 లక్షలుగా ఉంది.

చివరగా.. కవాసకి వల్కన్ ఎస్ పై.. గుడ్ టైమ్స్ వోచర్ బెనిఫిట్ ద్వారా కస్టమర్లు రూ. 60,000 భారీ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ నాలుగు మోడళ్లలో దీనిపైనే అత్యధిక ఆఫర్ ఉంది. ఈ బైక్ ధర రూ. 7.10 లక్షలు(ఎక్స్-షోరూమ్). వల్కాన్ S దాని పవర్‌ట్రెయిన్‌లను నింజా 650 మరియు వెర్సిస్ 650 ఆధారంగా ఉంటుంది.

Kawasaki Vulcan S ఇంజిన్.. 7,500 RPM వద్ద 59.94 bhp మరియు 6,400 RPM వద్ద 62.4 Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆఫర్లలో జీఎస్‌టీ కూడా ఉందని గమనించాలి. ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకు వర్తిస్తాయి. స్టాక్ లభ్యత ఆధారంగా ఆఫర్లు ఉంటాయని గమనించాలి. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని కవాసకి షోరూమ్‌ను సందర్శించవచ్చు.


Click it and Unblock the Notifications








