ప్రపంచంలోనే తొలి CNG బైక్ టీజర్ వచ్చేసింది.. బైక్ ఎలా ఉందో చూశారా?
ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ని బజాజ్ ఆటో ఈ నెల 5 న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ బైక్‌కి అప్‌డేట్స్‌కి సంబంధించి కీలక టీజర్‌ని ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో ఈ బైక్ పేరుని ఇప్పటికీ వెల్లడించలేదు. బైక్ విడుదలకు ముందు విడుదల చేసిన ఈ టీజర్ ప్రత్యేకతలేంటి? మరి ఈ బైక్ ఏ విధంగా ఉండనుంది. ప్రపంచం మొత్త ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బైక్‌కి సంబంధించి కీలక అంశాలు ఈ టీజర్‌లో ఏమున్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం..
కొన్ని నెలల క్రితం బజాజ్ తన మొదటి సీఎన్‌జీ బైక్ భారతదేశంలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ బైక్‌పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బైక్ అందరికీ అందుబాటు ధరలో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ బైక్‌కి సంబంధించిన సాంకేతిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. ఈ బైక్ 100 నుండి 125 సీసీ ఇంజిన్‌ని కలిగి ఉండనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే సరళమైన డిజైన్‌లో మరింత ప్రాక్టికల్ ఫీచర్లతో ఈ బైక్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన స్పై ఫొటోలన్నీ సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. ఈ స్పై ఫోటోల ఆధారంగా బజాజ్ ఇలాంటి రెండు మూడు బైక్‌లను పరీక్షించినట్లు తెలుస్తుంది. అయితే ఈ బజాజ్ సీఎన్‌జీ బైక్ డిజైన్ విడుదలైనప్పుడు, మాకు కొంత సమాచారం లభించింది.
మెయిన్ ఫ్రేమ్ లోని సీటు కింద సీఎన్‌జీ సిలిండర్ సరిపోయేలా బైక్ డిజైన్ చేసింది. ఇందుకోసం మెయిన్ ఫ్రేమ్‌లో సర్క్యూలర్ బ్రేస్‌లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా, ఈ బైక్‌లో అదనపు ఇంధన ట్యాంక్ కూడా ఉంది. బజాజ్ సీఎన్‌జీ మోటార్ సైకిల్ రెండు వేరియంట్లలో విడుదల చేయనుంది. వాటిలో ఒకటి రగ్డ్ లుక్‌లో, మరొకటి సింపుల్ లుక్‌లో ఉండే అవకాశం ఉంది.

తాజాగా ఈ బైక్‌కి సంబంధించి బజాజ్ తన సోషల్ మీడియా పేజ్‌లో ఒక టీజర్‌ని విడుదల చేసింది. టీజర్‌ని బట్టి చూస్తే ఈ బైక్ చాలా సింపుల్ బైక్‌గా డిజైన్ చేసినట్లు అర్థం అవుతుంది. ఈ టీజర్‌లో బైక్ పూర్తి వ్యూ మనకు స్పష్టంగా కనిపించలేదు. అయితే ఈ బైక్ సీఎన్‌జీ నుంచి పెట్రోల్ ఆప్షన్స్‌గా మారడానికి స్విచ్ కలిగి ఉన్నట్లు స్పష్టంగా చూపించబడింది.
స్విచ్ సహాయంతో బైక్‌ని సీఎన్‌జీ ఇంధనంతో నడపాలా లేదా పెట్రోల్‌తో నడపాలా అనే నిర్ణయం రైడర్ తీసుకోవచ్చనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. తరువాత ఈ బైక్ ఫ్రంట్ లుక్‌ని చూపించారు. దీనిలో వృత్తాకార హెడ్ లైట్ ఉంది. ఇది ఎల్ఈడీ హెడ్‌లైటా లేకా మరేదైనా హెడ్‌లైటా అనేది తెలియరాలేదు. అదే సమయంలో బజాజ్ లోగోను కూడా చూపించారు. ఈ భాగం బైక్ ఏ భాగమో తెలియదు.

ధర పరంగా చూస్తే ఈ బైక్ ధర రూ.90,000గా ఉండే అవకాశం ఉంది. ఇందులో కొన్ని అదనపు ఫీచర్లతో వచ్చే బైక్ ధర ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ కావడంతో మార్కెట్‌లో ఈ బైక్ ప్రత్యక్ష పోటీ లేదు. పెట్రోల్ కంటే సీఎన్‌జీ చౌకగా ఉంటుంది కాబట్టి తక్కువ ధరలో ఎక్కువ లాభాల కోసం చూసే వారు ఈ బైక్‌కి మారవచ్చు.
ఈ నెల 5న కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ బైక్‌ని లాంచ్ చేయనున్నారు. ఇటీవలె బజాజ్ ఆటో తన కార్యకలాపాలను 100 దేశాలకు విస్తరించింది. ఈ బైక్ లాంచ్‌తో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేయాలని బజాజ్ ఆటో యోచిస్తోంది. ఒక్కసారి ఈ బైక్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసిన అనంతరం పూర్తి స్థాయిలో ఉత్పత్తిపై దృష్టి సారించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








