ప్రపంచంలోని తొలి CNG బైక్ రిజిస్ట్రేషన్ ఓపెన్.. ఇప్పుడే బుక్ చేసుకోండి!!
బజాజ్ సీఎన్‌జీ బైక్ కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ని తీసుకువస్తున్న కంపెనీగా బజాజ్ నిలువనుంది. ఈ బైక్‌ని తీసుకువస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పెరిగి పోయాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీఎన్‌జీ పవర్డ్ బైక్ మరికొద్ది రోజుల్లో ఇండియాలో లాంచ్ కానుంది. ఈ బైక్‌ని ఈ నెల 5న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనున్నారు. అందుకే ఈ బైక్ భారతీయులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ద్విచక్ర వాహన ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఈ బైక్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ సంస్థ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ప్రారంభం అయ్యింది.
కేవలం మీ పేరు, సెల్ ఫోన్, ఈమెయిల్ ఇవ్వడం ద్వారా ఈ బైక్ కోస రిజిస్టర్ చేసుకోవచ్చు. భారతదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలతో, చాలా మంది ద్విచక్ర వాహన ప్రియులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అందుకే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ వాటిని త్వరగా ఛార్జ్ చేయడంలో ఆలస్యం అవ్వడం అలాగే అందులోని కొన్ని లోపాలను కూడా అధిగమిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాల స్థానంలో సీఎన్‌జీ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టేందుకు బజాజ్ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు దీన్ని అధికారికంగా ప్రారంభించడానికి అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌గా పేరుగాంచిన ఈ బైక్ కేవలం కేవలం సీఎన్జీతోనే కాకుండా పెట్రోల్‌తో కూడా నడుస్తుంది. ఆ సంస్థ ఈ విషయాన్ని కూడా ధృవీకరించింది. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్‌తో కూడా ఈ బైక్ నడవనుంది.
ఈ బైక్ పేరు ఇంకా కంపెనీ ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం బజాజ్ సీఎన్‌జీ బైక్‌గా ప్రస్తుతం బ్రూజర్‌గా (Bajaj Bruzer CNG) పిలుస్తున్నారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ బైక్‌ని లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని బజాజ్ ఆటో సీఈఓ రాజీవ్ బజాజ్ ధృవీకరించారు. ఈ బైక్ కిలో సీఎన్‌జీకి 100 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

ఈ బైక్ అడ్వెంచర్ బైకులను పోలి ఉంటుందని చెబుతున్నారు. ఇటీవలె ఈ బైక్‌కి సంబంధించిన కొన్ని స్పై చిత్రాలు విడుదలయ్యాయి. ఈ బైక్ అమ్మకానికి వస్తే విస్తృత శ్రేణి ప్రజలను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల్లో ఈ బైక్ భారీదని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సీఎన్‌జీ అందుబాటులో ఉన్నందున చాలా మంది పట్టణ వాసులు ఈ బైక్‌ని తప్పకుండా కొనుగోలు చేస్తారని భావిస్తున్నారు.
ఈ బైక్ ఒక్కసారి మార్కెట్‌లోకి వచ్చాక ధరను డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే బజాజ్ సీఎన్‌జీ ధర రూ. 1 లక్ష లోపు ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఇది కూడా అనధికారికమే. హోండా యాక్టివా నుండి హీరో స్ప్లెండర్ వరకు, బజాజ్ సీఎన్‌జీ దేశంలో వీటి అమ్మకాలపై దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకుంటున్నాయి. అయితే జనాలు ఈ బైక్‌ని ఆదరిస్తారా లేదా అనే ప్రశ్న కొన్ని రోజుల పాటు ఉండనుంది. అందులోనూ ప్రపంచంలోనే తొలి ప్రయోగం కావడంతో దీనిపై కొన్ని అనుమానాలు ప్రజలపై ఉన్నాయి. సాంప్రదాయ పెట్రోల్ స్థానాన్ని రిప్లేస్ చేయడానికి వస్తున్న ఈ బైక్ ఏ మేరకు పోటిని ఇస్తుందో లేదా ఇంకా కొన్ని గంటలు మాత్రమే వేచి చూడాల్సి ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








