ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌పై బజాజ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అదేంటంటే.??
త్వరలో ప్రముఖ ఆటో మేకర్ బజాజ్ ఆటో ఇండియా.. తన మొదటి CNG బైక్‌ను భారత మార్కట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా విడుదలవుతున్న CNG బైక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ బైక్‌కు సంబంధించిన ఆసక్తికర సమాచారం ఇప్పుడు బజాజ్ ప్రియులను ఆకట్టుకుంటోంది. అదేంటంటే..
బజాజ్ ఆటో ఇండియా.. తొలి CNG బైక్‌ను జూన్ 18న దేశంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ దశలో బైక్‌కు సంబంధించిన కీలక సమాచారం ఒకటి వెల్లడైంది. CNG బైక్ బ్లూ ప్రింట్‌ను సంస్థ విడుదల చేసింది. ఇది బజాజ్ CNG బైక్ యొక్క మొత్తం నిర్మాణాన్ని బహిర్గతం చేస్తోంది.

ఈ బ్లూ ప్రింట్ ద్వారా ముఖ్యంగా పెట్రోల్ ట్యాంక్, సీఎన్జీ సిలిండర్లు ఎక్కడ, ఎలా ఉంటాయని వెల్లడించారు. కాగా ఇప్పటికే కార్లు, ఆటోలు సీఎన్‌జీ, పెట్రోల్ ఇంజిన్లతో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బజాజ్ యొక్క CNG బైక్ వాటి మాదిరిగానే CNG మరియు పెట్రోల్‌తో పనిచేస్తుంది.
అందుకే ఈ బైక్‌లో సీఎన్‌జీ మరియు పెట్రోల్ రెండింటినీ నింపే సౌకర్యాన్ని సంస్థ ఏర్పాటు చేస్తోంది. కొత్త బజాజ్ బైక్‌లో సీఎన్‌జీ సిలిండర్‌లను పట్టుకోవడానికి డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిలిండర్లు సీటు కింద కేంద్రంగా ఏర్పాటు చేస్తారు.

ఇక బజాజ్ బైక్‌లో CNG ఫిల్లింగ్ పోర్ట్ ఫ్రంట్ ఎండ్‌లో ఉంటుంది. అయితే ఇందులో పెట్రోల్ ట్యాంక్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. ఎందుకంటే దీనిని చిన్న పరిమాణంలో అందించారు. CNG ఇంధనం కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న బైక్ కాబట్టి.. పెట్రోల్ ట్యాంకుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
అయితే కొత్త బజాజ్ బైక్‌లో పెట్రోల్ ట్యాంక్ సాధారణ పెట్రోల్ ద్విచక్ర వాహనాల మాదిరిగానే ఉంటుంది. అయితే చిన్నదిగా ఉంటుంది. మరియు ఫిల్లర్ నెక్ సాధారణ బైక్‌ల మాదిరిగానే ఉంటుందని బ్లూ ప్రింట్ ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా, ఇంజిన్‌లు సాధారణంగా అన్ని బైక్‌లలో ఉన్నట్లుగానే బజాజ్ CNG బైక్‌లో పొందుపరిచారు.

అయితే ఇందులో ఇది కొద్దిగా వాలుగా.. కొంచెం దిగువ స్థానంలో ఉంటుంది. బజాజ్ ఆటో ఇండియా ఈ బైక్‌ను CNG మరియు పెట్రోల్ రెండింటితో నడిచేలా ఇటువంటి మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ బైక్‌లో 125 సీసీ ఇంజిన్‌ని ఉపయోగించవచ్చని అంచనా వేయవచ్చు.
భారత మార్కెట్లో 125 సీసీ మోటార్‌సైకిళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఈ బైక్ ఇంజిన్‌కు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. త్వరలోనే పూర్తి సమాచారం వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా, ఈ CNG బైక్‌లో మెరుగైన రైడ్ అనుభవాన్ని అందించడానికి టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.
రైడర్లకు మెరుగైన బ్రేకింగ్ అనుభవాన్ని అందించడానికి డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయని తెలుస్తోంది. ఇక బజాజ్ తీసుకువస్తున్న CNG బైక్ చాలా తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. పెట్రోల్ బైకులతో పోలిస్తే తక్కువ ధరలో ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చని సంస్థ చెబుతోంది.
లీటర్ పెట్రోల్‌పై CNG ద్వారా రూ. 25 నుంచి 30 రూపాయలు ఆదా చేసుకోవచ్చని సమాచారం. కాబట్టి అధిక మైలేజీతో పాటు తక్కువ మొత్తంలో ప్రయాణించాలనుకునే వారిలో ఈ బైక్‌కు మంచి ఆదరణ లభిస్తుందని సంస్థ భావిస్తోంది. మరికొద్ది రోజుల్లో లాంచ్ అవుతుండటంతో.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి అవుతాయి.
భారతదేశంలో CNG కార్లు మరియు ఆటోలకు మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. అధిక మైలేజ్ ఇస్తుండటంతో ప్రజలు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో బజాజ్ CNG బైక్‌ను అమ్మకానికి తీసుకురానుంది. ఇది భారత మార్కెట్లో పాపులర్ బైక్‌గా మారుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications








