భళా బజాజ్.. 100 దేశాలకు విస్తరించిన మన భారతీయ కంపెనీ బైక్స్
మన దేశానికి చెందిన బజాజ్ మోటార్స్ సరికొత్త రికార్డుని నెలకొల్పింది. బ్రెజిల్‌లో తాజాగా ఉత్పత్తి ప్లాంట్‌ని నెలకొల్పింది. మంచి ఆటోమోబైల్ నెట్‌వర్క్ ఉన్న బ్రెజిల్ వంటి దేశాల్లో ఆధిపత్యాన్ని చలాయించేందుకు బజాజ్ యత్నిస్తోంది. అందులో భాగంగానే తాజాగా తొలి అడుగు వేసింది. ఇప్పటికే బ్రెజిల్‌లో మార్కెట్‌లో బజాజ్‌కి చెందిన కొన్ని బైక్స్ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డామినర్ (Dominar) మోటార్ సైకిల్ దూసుకెళ్తుంది. ఈ బైక్ 18 నెలల కిందటే బ్రెజిల్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ దేశంలో ప్లాంట్ నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి, అసెంబ్లింగ్, టెస్టింగ్, వెహికిల్ అసెంబ్లింగ్ వంటి వాటిపై దృష్టి సారించనుంది.
బ్రెజిల్‌లోని మానస్‌లో కొత్త ప్లాంట్ ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసినట్లు బజాజ్ ఆటో తెలిపింది. భవిష్యత్తులో బ్రెజిల్‌లో ఇతర మోడళ్లను ప్రవేశపెట్టడంతో కంపెనీ కార్యకలాపాలు కూడా విస్తరించనున్నారు. బ్రెజిల్‌లోని ఈశాన్య భాగంలోని మానస్ ఆటోమొబైల్ తయారీకి అనువుగా ఉంది. ఇది బ్రెజిల్‌లోని అమెజాన్ రాష్ట్రంలో ఉంది. తాజాగా ఇక్కడ 9,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బజాజ్ ప్లాంట్‌ని ఏర్పాటు చేసింది.

బజాజ్ తెలిపిన వివరాల ప్రకారం మానస్ ప్లాంట్‌లో ఒక షిఫ్ట్‌లో 20,000 యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో తన ప్లాంట్ సామర్థ్యాన్ని విస్తరించాలని యోచిస్తున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 50,000 యూనిట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023 జూన్లో బజాజ్ ఈ ప్లాంట్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఏడాదిలో పనులు పూర్తి చేసి ప్రారంభించగలిగారు.
మరో ఏడాదిలో పూర్తిస్థాయిలో ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని ద్విచక్ర వాహన దిగ్గజం తెలిపింది. మానస్ ప్లాంట్ అధికారిక ప్రారంభోత్సవానికి అమెజాన్ రాష్ట్ర గవర్నర్ మరియు స్థానిక వ్యాపార భాగస్వాములతో సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. బజాజ్ కస్టమర్ ఫ్రాంఛైజీ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిందని.. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు 100 దేశాలకు విస్తరించిందని ప్రకటించింది. ఇది ఒక కీలక మైలురాయిగా బజాజ్ అభివర్ణించింది.

ఏడాదిన్నర క్రితం బజాజ్ కంపెనీ బ్రెజిల్‌లో డామినార్‌ని మార్కెట్‌లో విడుదల చేసింది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ మోడల్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. మొదటగా ఈ బైక్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కంపెనీ పెంచుకునే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త తయారీ సామర్థ్యాలు విస్తృతమైన సరఫరా చైన్‌నినిర్మించడానికి కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి సహాయ పడుతుందని బజాజ్ వెల్లడించింది. కొత్త ప్లాంట్స్ ద్వారా మా వినియోగదారులకు మరింత చేరువ అవుతామని చెప్పింది.
మానస్ ప్లాంట్ అధునాతన, ఆటోమేటెడ్ ప్రొడక్షన్ లైన్ మరియు ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్‌లతో రూపొందించబడిందని బజాజ్ తెలిపింది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు, డెలివరీ చైన్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ మరియు HR మిగతా ఆపరేషన్స్ అన్ని ఇక్కడి నుంచి నిర్వహించనున్నారు. ప్రారంభంలో ప్లాంట్‌లో డొమినార్ మోడల్స్ ఆ తరువాత పల్సర్ మోడల్స్ తయారీపై కంపెనీ దృష్టి పెట్టనుంది.

బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ని భారతదేశంలో విడుదల చేసే పనిలో ఉంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కంపెనీ తొలి సీఎన్జీ బైక్‌ని జూలై 5న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బజాజ్ స్వయంగా టీజర్ చిత్రాల ద్వారా ప్రకటించారు. బజాజ్ సీఎన్‌జీ బైక్ 100-150 సిసి సెగ్మెంట్‌లో వచ్చే అవకాశం ఉంది.
ఈ బైక్‌లో సీఎన్‌జీ, పెట్రోల్ ట్యాంకులతో కూడిన డ్యూయల్ ఫ్యూయల్ ట్యాంక్‌లు ఉండే అవకాశం ఉందని స్పై చిత్రాల ద్వారా అర్థం అవుతుంది. దీంతో సీఎన్‌జీ అయిపోయినా పెట్రోల్ మోడ్‌లో తదుపరి ఫ్యూయల్ స్టేషన్‌కి చేరుకునే అవకాశం ఉంటుంది. సీఎన్‌జీ మోటార్‌సైకిల్ సాంప్రదాయ బైకులతో పోల్చితే 50 శాతం ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందని బజాజ్ పేర్కొంది. ఇండియాలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైకుల్లో ఒకటిగా ఈ సీఎన్‌జీ బైక్ నిలువనుంది.


Click it and Unblock the Notifications








