మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మాత్రం పోటీ తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలో బజాజ్ ఆటో తన చేతక్ బ్రాండ్ క్రింద మరింత అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేయాలని యోచిస్తోంది. చేతక్ బ్రాండ్‌లో కొత్త మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మేలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
బజాజ్ ఆటో ప్రస్తుతం చేతక్(Bajaj Chetak) బ్రాండ్ క్రింద చేతక్ అర్బన్ మరియు చేతక్ ప్రీమియం అనే రెండు వేరియంట్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. అర్బన్ ఇ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.23 లక్షలు కాగా ప్రీమియం స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.47 లక్షలుగా ఉంది.

ఈ క్రమంలో బజాజ్ చేతక్ టెస్ట్ మ్యూల్ గత సంవత్సరం హబ్-మౌంటెడ్ మోటార్‌తో పరీక్షిస్తున్నట్లు టెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇది త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. జనవరి 2020లో EV మార్కెట్లోకి ప్రవేశించిన బజాజ్ ఆటో, 2024 ఆర్థిక సంవత్సరంలో 1,06,431 చేతక్ ఇ-స్కూటర్‌లను విక్రయించింది. దీంతో కంపెనీ మార్కెట్ వాటా 14 శాతం పెరిగింది.
బజాజ్ చేతక్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 నగరాల్లో దాదాపు 200 స్టోర్లలో అందుబాటులో ఉంది. నివేదికల ప్రకారం, బజాజ్ ఆటో రాబోయే మూడు లేదా నాలుగు నెలల్లో స్టోర్ల సంఖ్యను దాదాపు 600కు విస్తరించాలని యోచిస్తోంది. దీంతో భారత మార్కెట్లో బజాజ్ స్కూటర్లకు క్రేజ్ మరింతగా పెంచుకోవాలని సంస్థ యోచిస్తోంది.

ఇక బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క విభిన్న వేరియంట్‌లను పరిశీలిస్తే, అర్బన్ వేరియంట్ ప్రస్తుత చేతక్ ప్రీమియంతో పోలిస్తే కొంచెం ఎక్కువ రైడింగ్ రేంజ్‌ను ఇస్తుంది. చేతక్ ఎలక్ట్రిక్ లైనప్‌కి తాజాదనాన్ని ఇవ్వడంతో పాటు.. దాని ప్రత్యర్థుల నుండి పెరుగుతున్న పోటీని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంది.
కాగా బజాజ్ ఆటో కూడా 'టెక్‌ప్యాక్'ని అందిస్తుండగా.. దీని ధర రూ. 1.21 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది ప్రస్తుత మోడల్ కంటే రూ.6,000 ఎక్కువ ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాక్ స్కూటర్ గంటకు 74 కి.మీ గరిష్ట వేగాన్ని అందించడంతో పాటు ప్రత్యేక స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంది.

ఫీచర్ల పరంగా, కంపెనీ 'టెక్‌ప్యాక్' ప్యాకేజీకి హిల్ హోల్డ్, రివర్స్ మోడ్ మరియు OTA అప్‌డేట్‌ను కూడా చూడవచ్చు. చేతక్ అర్బన్ పూర్తి ఛార్జ్‌పై 113 కి.మీల రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. అయితే ఇది ఇప్పటికే ఉన్న ప్రీమియం వేరియంట్ కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. కాగా ప్రీమియం మోడల్ యొక్క IDC పరిధి 126 కి.మీ.
కొత్త అర్బన్ ట్రిమ్ యొక్క బ్యాటరీ ప్యాక్ సామర్థ్యం 2.9 kWh. TecPac ప్యాకేజీని ఎంచుకోవడం ద్వారా ప్రీమియంలోనే కాకుండా అర్బన్ వేరియంట్‌లో కూడా చేర్చవచ్చు. బజాజ్ చేతక్ EVతో ఇప్పుడు కొత్త కలర్ స్క్రీన్ కూడా అందుబాటులో ఉండటం కూడా గమనార్హం. ఈ కొత్త 5-అంగుళాల TFT స్క్రీన్ మోడల్ యొక్క ప్రీమియం వేరియంట్ అందుకున్న అత్యంత ముఖ్యమైన అప్‌డేట్.

అంతేకాకుండా, బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 73 కి.మీకి పెరిగింది, అయితే కొత్త 3.2 kWh బ్యాటరీ ప్యాక్ చేతక్ EVకి ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 127 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇక త్వరలో విడుదల కానున్న కొత్త స్కూటర్ గురించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








