Bajaj Exports బజాజ్‌ ఎగుమతుల్లో 49 శాతం ఈ బైక్‌దే.. ఏంటీ వాహనం ప్రత్యేకత?

భారత ఆటోమొబైల్ మార్కెట్లో బజాజ్‌ సంస్థ అనేక ద్విచక్ర వాహనాలను తయారు చేస్తోంది మరియు విక్రయిస్తోంది. మరికొన్ని వాహనాలను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. బజాజ్‌ మోడళ్లలో కొన్ని భారత్‌ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా.. మరికొన్ని మాత్రం విదేశాల్లో ఆదరణ పొందుతున్నాయి.

భారత్‌ మార్కెట్‌లో బజాజ్‌ పల్సర్‌, ప్లాటినా వంటి మోడళ్లు అత్యధికంగా అమ్ముడైన వాహనాల జాబితాలో ఉన్నాయి. ప్లాటినా అధిక మైలేజీ ఇచ్చే వాహనాల్లో అగ్రస్థానంలో ఉంది. అదే పల్సర్‌ బైక్‌ లుక్‌ సహా సౌకర్యవంతమైన వాహనాల్లో అగ్రస్థానంలో ఉంది. అయితే ఈ రెండు వాహనాలు విదేశాల్లో అనుకున్నంత ఆదరణను సంపాదించలేదు. పల్సర్‌ బైక్‌ ఇప్పుడిప్పుడే ఎగుమతుల్లో వృద్ధి చెందుతోంది.

Bajaj boxer record lever exports in December 2023

భారత్‌లో ఆదరణ లేకున్నా.. విదేశాల్లో : అయితే బజాజ్‌ బాక్సర్‌ (Bajaj Boxer) బైక్‌కు భారత్‌లో ఆదరణ లేదు. ప్రస్తుతం ఈ బైక్‌ భారత్‌లో అందుబాటులో లేదు. అయితే ఈ బైక్‌ విదేశాల్లో విపరీతమైన ఆదరణ పొందింది. బజాజ్‌ సంస్థ మొత్తం ఆశ్చర్యకర స్థాయిలో విదేశీ ఎగుమతులను కలిగి ఉంది. డిసెంబర్‌ 2023లో బజాజ్‌ మొత్తం ఎగుమతుల్లో 49.04 శాతం వాటాను బజాజ్‌ బాక్సర్‌ బైక్‌ కలిగి ఉంది.

49.04 శాతం బజాజ్‌ బాక్సర్‌ వాహనాలదే : డిసెంబర్ 2023 సంవత్సరంలో బజాజ్‌ సంస్థ మొత్తం 1,08,062 వాహనాలను ఎగుమతి చేసింది. ఇందులో గరిష్ఠంగా 52,196 యూనిట్లు అంటే 49.04 శాతం బజాజ్‌ బాక్సర్‌ వాహనాలు ఉన్నాయి. ఇటీవల పల్సర్‌ బైక్‌కి కూడా ఆదరణ పెరుగుతోంది. డిసెంబర్‌ 2023 సంవత్సరంలో 26,431 యూనిట్లను విక్రయించింది. ఈ బైక్‌ 24.46% శాతం వృద్ధిని నమోదు చేసింది.

 bajaj-boxer-exports-2023

విదేశాల్లో బజాజ్‌ బాక్సర్‌కు విశేష ఆదరణ : బజాజ్‌ CT బైక్‌, బజాజ్‌ డిస్కవరీ బైక్‌లు కూడా గణనీయ వృద్ధిని సాధించాయి. వరుసగా 16,836, 7392 యూనిట్లను ఎగుమతి అయ్యాయి. వీటితోపాటు బజాజ్‌ డొమినార్‌ 2,344 యూనిట్లు, 1,861 ప్లాటినా బైక్‌లను ఎగుమతుల్లో ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం భారత్‌ కంటే విదేశాల్లో బజాజ్‌ బాక్సర్‌ బైక్‌లకు ఆదరణ కనిపిస్తోంది.

గత సంవత్సరంతో పోలిస్తే తగ్గిన ఎగుమతులు : డిసెంబర్‌ 2022 తో పోలిస్తే.. డిసెంబర్ 2023 సంవత్సరంలో కొంత క్షీణతను ఎదుర్కొంది. ఏడాది ప్రాతిపదికన 4.91 శాతం క్షీణించింది. అంటే 5,578 యూనిట్లు ఎగుమతులు తగ్గాయి. అలాగే 2022 సంవత్సరంతో పోలిస్తే 2023 సంవత్సరంలో ఎగుమతుల్లో క్షీణత ఉంది.

 bajaj-boxer-news

బజాజ్‌ సంస్థ భారత్‌లో వాహనాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు కచ్చితంగా మేలు చేస్తుంది. భారత్‌లో తయారీ కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దీంతోపాటు ఈ స్థాయిలో ఎగుమతులు బజాజ్‌ కు కలిగి వస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 30, 2024, 18:26 [IST]
English summary
Bajaj boxer record lever exports in december 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+