Bajaj Chetak EV బజాజ్‌ చేతక్‌ 2024 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదల.. కీలక ఫీచర్లతో కూడిన టెక్‌ప్యాక్‌..!

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ప్రజలు కూడా ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గత సంవత్సరం గణాంకాల ప్రకారం మొత్తం అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ద్విచక్ర వాహనాల వాటా ఎక్కువగా ఉంది. అందువల్ల ప్రముఖ సంస్థలు ఈ సెగ్మెంట్‌ను టార్గెట్‌ చేస్తూ వాహనాలను విడుదల చేస్తున్నాయి.

తాజాగా ప్రముఖ వాహనాల తయారీ సంస్థ బజాజ్‌ తన బజాజ్‌ చేతక్‌ 2024 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ (Bajaj Chetak 2024) మోడల్‌ను సంస్థ భారత్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. గత మోడల్‌తో పోలిస్తే తాజాగా విడుదల చేసిన వాహనం కీలక మార్పులకు కలిగి ఉంది. ఈ బజాజ్‌ చేతక్ 2024 మోడల్‌ రెండు వేరియంట్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ బజాజ్‌ ఈవీ మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మీ కోసం.

2024-bajaj-chetak-premium

బజాజ్‌ చేతక్‌ 2024 మోడల్‌ అర్బన్‌, ప్రీమియం వేరియంట్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. అర్బన్‌ వేరియంట్ ధర రూ.1.15001 (ఎక్స్‌షోరూం) గా ఉంది. అదే ప్రీమియం మోడల్ రూ.1.35,463 (ఎక్స్‌షోరూం)గా ఉంది. గతంలో పోలిస్తే ఈ బైక్‌ ధర ఎక్కువగా ఉంది. ప్రత్యేక ఫీచర్లు, టెక్‌ సదుపాయాలే ఇందుకు కారణం.

బజాజ్‌ చేతక్‌ 2024 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో మరిన్ని సౌకర్యాలను అందించేందుకు బజాజ్‌ టెక్‌ప్యాక్‌ (Bajaj Tecpac) అనే ప్రత్యేక టెక్నాలజీతో కూడిన ప్యాకేజీని ప్రవేశపెట్టింది. దీని ద్వారా బజాజ్‌ టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్ సిస్టమ్‌, మ్యూజిక్‌ కంట్రోల్, కాల్‌ అలెర్ట్‌, డిస్‌ప్లే థీమ్‌ వంటి ఫీచర్లను అందిస్తుంది. దీన్ని ఆప్షనల్‌ ఫీచర్‌గా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

2024-bajaj-chetak

దీంతోపాటు బజాజ్‌ చేతక్‌ 2024 EV మోడల్‌ హిల్‌ హోల్డ్‌, రివర్స్‌ మోడ్‌, స్పోర్ట్స్‌ మోడ్‌ వంటి రైడింగ్‌ మోడ్‌లను కలిగి ఉంటుంది. సాధారణ మోడ్‌లో 63kmph మరియు స్పోర్ట్‌ మోడ్‌లో 73kmph గరిష్ఠ వేగాన్ని కలిగి ఉంటుంది. ప్రీమియం వేరియంట్‌ 5 అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

ప్రీమియం వేరియంట్‌ 3.2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 800W ఛార్జర్‌ను అందిస్తోంది. 3 గంటల 50 నిమిషాల్లో పుల్ ఛార్జింగ్ చేయవచ్చు. సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా గరిష్ఠంగా 127 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. మరియు సెల్ఫ్‌ క్యాన్సిలింగి బ్లింకర్లు, ఎలక్ట్రానిక్‌ హ్యాండిల్‌ లాక్‌, సీడ్‌ ఓపెనింగ్ స్విచ్‌ కూడా ఉన్నాయి. అర్బన్‌ వేరియంట్‌ బ్యాటరీని 650W ఛార్జర్‌ని ఉపయోగించి.. 4 గంటల 50 నిమిషాల్లో ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు.

2024-bajaj-chetak EV

బజాజ్‌ చేతక్‌ 2024 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రంగులు : ప్రీమియం వేరియంట్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇండిగో బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్‌, హాజెల్‌ నట్‌ రంగుల్లో లభిస్తుంది. అదే అర్బన్‌ వేరియంట్ గ్రే, సైబర్‌ వైట్‌, బ్రూక్లిన్‌ బ్లాక్‌, ఇండిగో మెటాలిక్‌ బ్లూ వంటి నాలుగు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, January 5, 2024, 13:09 [IST]
English summary
Bajaj chetak 2024 electric scooter launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+