రూ. 95,998 లకే బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. 123 కి.మీ రేంజ్‌ పక్కా

బజాజ్ చేతక్ 2901 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని బజాజ్‌ ఆటో లాంచ్‌ చేసింది. కొత్త వేరియంట్ విడుదలతో చేతక్ పోర్ట్ ఫోలియోను విస్తరించేందుకు బజాజ్‌ ఆటో ఈ స్కూటర్‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. చేతక్‌ 2901గా పిలువబడే ఈ స్కూటర్‌ బుకింగ్స్ ఇప్పటికే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్‌కి సంబంధించి ప్రొడక్ట్ వివరాలు, టెస్ట్ రైడ్స్ మరియు బుకింగ్స్‌ ఇతర కొరకు కస్టమర్లు సమీప షోరూమ్‌ని సందర్శించవచ్చు. జూన్ 15 నుంచి ఈ సరికొత్త స్కూటర్‌ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి సంబంధించిన బ్యాటరీ, రేంజ్‌, ఫీచర్లు ఇతర పూర్తి వివరాలు మీకోసం..

బజాజ్ చేతక్ 2901 బైక్ రెడ్, వైట్, బ్లాక్, లైమ్ ఎల్లో, అజూర్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటర్‌లోని 2.88kWh బ్యాటరీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి శక్తిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ARAI క్లెయిమ్ చేసిన వివరాల ప్రకారం 123 కిలోమీటర్ల పరిధిని అందించనుంది. అందుబాటు ధరలో 100 కి.మీ రేంజ్ అందించే జాబితాలో ఈ స్కూటర్‌ చేరింది.

Bajaj-Chetak-2901-Launch

ఈ చేతక్ 2901లో కలర్ డిజిటల్ కన్సోల్, ట్యూబ్ లెస్ టైర్లతో అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్లు పూర్తి టెక్ ప్యాక్‌తో ఈ ఫీచర్లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. టెక్ ప్యాక్‌లో హిల్ హోల్డ్, రివర్స్, స్పోర్ట్ అండ్ ఎకానమీ మోడ్స్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ లైట్స్, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా బజాజ్ ఆటో ప్రస్తుతం చేతక్ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించే పనిలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు దేశం అంతటా 500కి పైగా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. బజాజ్ చేతక్‌ ప్రీమియం, అర్బనే మరియు 2901 అనే మూడు వేరియంట్లలో స్కూటర్లను అందిస్తోంది. ప్రీమియం అత్యంత ఖరీదైనది కాగా, 2901 లైనప్‌ తక్కువ ధరలో అందుబాటులో ఉండనుంది.

Bajaj-Chetak-2901-Electric-Scooter

ఈ సరికొత్త స్కూటర్‌లో కొన్ని ఫీచర్లను బజాజ్‌ తొలగించింది. బజాజ్ చేతక్ 2901లో ఫ్రంట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌ ఉండదు. దీని స్థానంలో ఓపెన్ స్టోరేజ్ బిన్‌లను అందించింది. 2901లో చేతక్ ప్రీమియంలో అందుబాటులో ఉన్న రిమోట్ కీ ఫోబ్‌ను అందించలేదు. దీనికి బదులుగా సాధారణ కీ మరియు కీ స్లాట్‌ను ఉపయోగిస్తుంది. ఈ చేతక్ 2901 గరిష్ట వేగం గంటకు 63 కి.మీ తో ప్రయాణిస్తుంది.

పైన తెలిపిన కొన్ని ఫీచర్లు మిస్‌ అయినా సరే బజాజ్‌ 2901 రిచ్‌ లుక్‌ని కలిగి ఉంటుంది. సాంప్రదాయ పెట్రోల్‌ స్కూటర్లకు ఏమాత్రం తీసీపోకుండా చేతక్ 2901 వినియోగదారులను ఆకట్టుకుంటుందని బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు. ధరలో ఎలాంటి మార్పులు లేకుండా పెట్రోల్ స్కూటర్‌ కంటే తక్కువ ధరలో ఫుల్ సైజ్ మెటల్ బాడీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Bajaj-Chetak-2901-Electric-Scooter-Launch

ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 95,998గా ఉంది. కొత్త చేతక్ 2901 టీవీఎస్‌ ఐక్యూబ్‌ సిరీస్‌లో 2.2kwh, ఓలా S1X Plus 3kwh స్కూటర్లతో స్కూటర్లతో పోటిపడనుంది. ఇంకా ఈ స్కూటర్‌ అత్యాధునిక స్మార్ట్‌ అప్‌గ్రేడ్స్‌తో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌ బుకింగ్స్‌ని ఆల్రెడీ సంస్థ స్వీకరిస్తోంది. సేల్స్‌లో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ ఓలా, ఏథర్‌, టీవీఎస్‌ తర్వాత 4వ స్థానంలో ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, June 7, 2024, 13:32 [IST]
English summary
Bajaj chetak 2901 launched at rs 95998 which gives 123 km range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+