Bajaj Chetak: బజాజ్‌ చేతక్‌ స్పెషల్‌ ఎడిషన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదల.. ఇప్పుడే కొంటే రూ. 10 వేల డిస్కౌంట్‌

సరికొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషల్ ఎడిషన్‌ని బజాజ్ ఆటో విడుదల చేసింది. దీనికి చేతక్ 3201 అని పేరు పెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మీరు అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో పోల్చితే ఇది కొన్ని మార్పులతో మార్కెట్‌లో అడుగు పెట్టనుంది. జనవరి 2020లో లాంచ్ అయిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌ ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో ఉంది. తాజాగా ఆ కంపెనీ నుంచి వచ్చిన స్పెషల్‌ ఎడిషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్‌ని అధికారికంగా భారత్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం చేతక్ స్కూటర్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. కొత్త చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ ప్రీమియం వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. కొత్త చేతక్ 3201 రూ .1.30 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ధర లాంచ్ చేసింది.

Bajaj-Chetak-3201-Special-Edition-Price

ప్రస్తుతం ఈ స్కూటర్‌ని ప్రారంభ ఆఫర్‌ కింద కొనుగోలు చేస్తే ధర రూ.1.30 లక్షలు మాత్రమే ఉండనుంది. అయితే ఈ ఆఫర్‌ ముగిసిన తర్వాత రూ.10,000 పెరిగి రూ.1.40 లక్షలకు చేరనుంది. ప్రీమియం వేరియంట్ కావడంతో కొత్త చేతక్ 3201 సాధారణ చేతక్‌లకంటే ఎక్కువ ఫీచర్లతో సరికొత్తగా కనిపించనుంది.

కొత్త చేతక్ 3201 సైడ్ ప్యానెల్స్‌లో 'చేతక్' ఉంది. కొత్త చేతక్ స్కూటర్‌ని ఒకటే కలర్‌ ఆప్షన్‌లో రానుంది. ఇది కేవలం బ్రూక్లిన్ బ్లాక్ (Brooklyn Black) కలర్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో స్కఫ్ ప్లేట్లు (స్టీల్‌ పూతతో కూడిన డిజైన్‌), రెండు కలర్‌ ఆప్షన్‌లో కుట్టిన సీట్లు ఉన్నాయి. ఇది అదనపు ఆకర్షణను అందిస్తుంది.

Bajaj-Chetak-3201-Special-Edition-Range

చేతక్ ప్రీమియం వేరియంట్ మాదిరిగానే ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ కూడా TFT డిస్ప్లేను కలిగి ఉంది. దీనిలో నావిగేషన్‌, మొబైల్ ఫోన్ మ్యూజిక్ కంట్రోల్స్, ఫోన్ కాల్ అలర్ట్స్ పొందవచ్చు. కస్టమర్లు ఈ డిస్ ప్లేను కస్టమర్లు వారికి నచ్చిన థీమ్‌ ఆప్షన్‌ని మార్పులు చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌లోని టెక్‌ప్యాక్‌ (TecPac) సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీని ద్వారా స్పోర్ట్‌ రైడ్‌ మోడ్‌, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఆప్షన్స్‌ ఉన్నాయి.

కొత్త చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ స్కూటర్ చేతక్ ప్రీమియం వేరియంట్ మాదిరిగానే 3.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. అయితే స్పెషల్ ఎడిషన్ ప్రీమియం వేరియంట్‌ ఇచ్చే 127 కిలోమీటర్ల రేంజ్‌ కంటే 9 కి.మీ ఎక్కువ రేంజ్‌తో 136 కి.మీ ప్రయాణించగలదు. ఇది గంటకు 73 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

Bajaj-Chetak-3201-Special-Edition-Launch

బజాజ్ చేతక్ 3201 ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్టా జెడ్, ఓలా ఎస్ 1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది. రిస్టా జెడ్ ధర రూ.1.45 లక్షలు, ఎస్1 ప్రో ధర రూ.1.34 లక్షలు, ఐక్యూబ్ ఎస్ ధర రూ.1.46 లక్షలుగా ఉంది. పైవన్నీ ఎక్స్‌-షోరూమ్ ధరలు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 6, 2024, 11:22 [IST]
English summary
Bajaj chetak 3201 special edition launched check price and range details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+