బజాజ్ చేతక్ 3501 vs 3502.. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్, ధర, బ్యాటరీల మధ్య తేడాలు

దేశీయ దిగ్గజ కంపెనీ బజాజ్ ఈవీ మార్కెట్‌పై కీలకంగా దృష్టి పెట్టింది. ఇతర కంపెనీలు ఈవీ టూవీలర్లను లాంచ్ చేస్తూ దూసుకుపోతున్నాయి. దీంతో వీటి కంటే ఎక్కువ వాటాను సంపాదించడానికి తన ఫేవరెట్ మోడల్ చేతక్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్‌‌లో గతంలో తీసుకువచ్చింది. తాజాగా ఇదే మోడల్‌‌లో ఇటీవలే చేతక్ 35 సిరీస్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. దీనిలో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. మొదటిది 3501, రెండోది 3502 చివరిది 3503. ఇవన్నీ మిడిల్‌క్లాస్ వినియోగదారులకు అందుబాటు ధరలోనే లభిస్తున్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా ఈవీ టూవీలర్ మార్కెట్లో బజాజ్ ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది.

మొదటి రెండు వేరియంట్ల వివరాలను బజాజ్ వెల్లడించినప్పటికి మూడో వేరియంట్ ధర, ఇతర ఫీచర్ల తాలుకూ డేటాను మాత్రం పేర్కొనలేదు. 3501 మోడల్ ఈ నెల చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ అవతుంది. అదే 3502 మాత్రం జనవరి నుంచి డెలివరీకి అందుబాటులో ఉంటుంది. చేతక్‌ 3501, 3502 గురించిన వివరాలను కస్టమర్ల కోసం క్రింది కథనంలో క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది.

Bajaj Chetak 3501 And 3502 Electric Scooters

డిజైన్: బజాజ్ చేతక్ 35 సిరీస్‌లో 3501, 3502 వేరియంట్ల డిజైన్ చూడటానికి ఒకే విధంగా కనిపిస్తున్నాయి. రెండింటికి కూడా ఒకే ఛాసిస్‌ను అందించారు. వీల్‌బేస్ పొడుగ్గా ఉండటంతో పాటు, సీటు క్రింది భాగంలో ఎక్కువ సామాన్లు పెట్టుకోడానికి ఇవి సరిపడినంతా స్థలాన్ని కలిగి ఉన్నాయి. డిజైన్ సేమ్ ఉన్నప్పటికి వేరు వేరు కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి. 3501 వేరియంట్ ఐదు కలర్స్‌లలో, 3502 నాలుగు కలర్స్‌లో కొనుగోలుకు ఉంటుంది.

బ్యాటరీ పనితీరు: రెండు వేరియంట్లలో కూడా 3.5 kWh బ్యాటరీని అందించారు. బ్యాటరీని పూర్తి ఛార్జింగ్ చేసినట్లయితే 153 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. టాప్ స్పీడ్ 73 కి.మీలుగా ఉంది. రెండింటి మధ్య ప్రధాన తేడా ఛార్జింగ్ మాత్రమే. 3501 ఆన్‌బోర్డ్‌ ఛార్జర్ ద్వారా కేవలం 3 గంటల్లో 0-80 శాతం నుండి ఛార్జ్ అవుతుంది. అదే 3502 ఆఫ్‌బోర్డ్ ఛార్జర్‌తో 3 గంటల 25 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తవుతుంది.

Bajaj Chetak 3501 Vs 3502

ఫీచర్లు : 3501, 3502 వేరియంట్ల ఫీచర్లను చూసినట్లయితే చాలా వరకు ఒకే విధమైన వాటిని కలిగి ఉన్నాయి. రెండు 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ మోడల్ 3501 టచ్ ఆధారంగా పనిచేసే డిస్‌ప్లేపుతో వచ్చింది. అదే 3502 మాత్రం నాన్-టచ్ TFT క్లస్టర్‌తో ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్‌లో అదనంగా సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లను ఇచ్చారు. అయితే మిడ్ వేరియంట్‌లో మాత్రం ఇది లేదు.

3501లో ముందు భాగంలో చిన్న వస్తువులను పెట్టుకోడానికి 5 లీటర్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. 3502 వేరియంట్‌లో మాత్రం ఈ సదుపాయం ఉండదు. రెండిట్లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ,ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్, మ్యూజిక్ కంట్రోల్, రౌండ్ షేపు LED హెడ్‌లైట్ వంటి వాటిని కలిగి ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లు ఒకే విధమైన ఎకో, స్పోర్ట్స్ అనే రైడింగ్ మోడ్స్‌లను అందిస్తాయి. ఇంకా, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్స్‌తో కూడా కలిగి ఉన్నాయి.

Chetak 3501 Vs 3502 Full Details

ధర విషయానికి వస్తే, జాజ్ చేతజ్ 3501 వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా ఉంది, అదే రెండో వేరియంట్ 3502 ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). టాప్ వేరియంట్ 3503 మోడల్ ధర వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇదిలా ఉంటే రెండు వేరియంట్లకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభం అవుతాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 23, 2024, 14:02 [IST]
English summary
Bajaj chetak 35 series 3501 vs 3502 electric scooters battery design details
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+