ఇక పెట్రోల్‌కు గుడ్‌బై.. బజాజ్ నుంచి తక్కువ ధరలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్స్.. సింగిల్ ఛార్జ్‌తో 153 కి.మీ..

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రోజువారీ వాడకానికి ఎలక్ట్రిక్ టూవీలర్లకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. లీటర్ పెట్రోల్ రూ.110కి దగ్గరగా ఉన్న సమయంలో తమ సంపాదనలో ఎక్కువ భాగం దీనికే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఈవీ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్ స్కూటర్ల మీద పెట్టే ఖర్చులో కొంత వరకు పెడితే సరిపోతుంది. డబ్బులు చాలా వరకు ఆదా అవుతాయి. ఈవీ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను గమనించిన తయారీ కంపెనీలు వరుసగా కొత్త మోడళ్లను పోటా పోటీగా విడుదల చేస్తూ ఎక్కువ మంది కస్టమర్లకు చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఈ మార్కెట్లో హోండా, హీరో, ఓలా, ఏథర్, బజాజ్ వంటి కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. వీటితో పాటు మరిన్ని కంపెనీలు కూడా మార్కెట్లో పట్టు నిలుపుకోడానికి కొత్త లాంచ్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఇండియా ఈవీ టూవీలర్లలో పై చేయి సాధించడానికి తాజాగా దేశీయ ప్రముఖ కంపెనీ బజాజ్(Bajaj) కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త మోడల్‌ పేరు 'చేతక్ 35 సిరీస్ (Chetak 35 series)'. ఈ సిరీస్‌లో 3501, 3502,3503 అనే మూడు వేరియంట్‌లు ఉన్నాయి. ఈ కొత్త స్కూటర్ల ద్వారా ఈవీ టూవీలర్ మార్కెట్లో బజాజ్ అతిపెద్ద వాటాను పొందే అవకాశం ఉంది.

Bajaj Chetak 35 Series Electric Scooters Price

చేతక్ ఈవీతో ఇతర కంపెనీలకు ఎదురుదెబ్బ తగలవచ్చు. ఎందుకంటే కొత్తగా విడుదల అయిన ఈ మూడు వేరియంట్లు చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటి ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. భారత్‌లో మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోనే ఇవి కొనుగోలుకు లభించనున్నాయి. చేతక్ ఈవీ పాత మోడల్‌కు దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్త మోడళ్లతో బజాజ్ కంపెనీ రేంజ్ మరింత పెరుగుతుంది.

చేతక్ 35 సిరీస్‌లో 3501 వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్ షోరూమ్ బెంగళూరు)గా ఉంది. 3502 వేరియంట్ ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్ షోరూమ్ బెంగళూరు), చివరగా టాప్ ఎండ్ మోడల్ 3503 ధరను కంపెనీ ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుంది. ఈ మూడు వేరియంట్లు పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్లే. 35 సిరీస్‌ మొత్తం మెటల్ బాడీతో వచ్చాయి. మెరుగైన పనితీరు, సులభమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

Bajaj Chetak 35 Series Electric Scooters

చేతక్ 35 సిరీస్‌ 3501, 3502 వేరియంట్లు శక్తివంతమైన 3.5 కిలోవాట్ (kWh) బ్యాటరీ ఆప్షన్‌తో వచ్చాయి. బ్యాటరీని పూర్తి ఛార్జింగ్ చేసినట్లయితే 153 కి.మీల వరకు కూడా ఛార్జింగ్ కోసం ఆగకుండా ప్రయాణించవచ్చు. రోజువారీ పనులు చేసుకోవడానికి చేతక్ కొత్త ఈవీ టూవీలర్ మధ్యతరగతి వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్. కంపెనీ 35 సిరీస్‌‌లో ఫీచర్ల పరంగా రాజీ పడకుండా రైడింగ్ సమయంలో అవసరమయ్యే అన్ని ఫీచర్లను కూడా ఇచ్చింది.

వీటి టాప్ స్పీడ్ 73 కిమీగా ఉంది. బ్యాటరీని కేవలం 3 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఎక్కువ సామాన్లను పెట్టుకోడానికి సీటు క్రింద 35 లీటర్ల స్టోరేజ్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లకు ఈ స్కూటరల్లో చాలా ఉన్నాయి. ముందు జియో-ఫెన్సింగ్‌తో టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ,ఇంటిగ్రేటెడ్ మ్యాప్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

Bajaj Chetak 35 Series Electric Scooters Details

ముందు రౌండ్ షేపులో ఉన్నటువంటి LED హెడ్‌లైట్, మెరుగైన బ్రేకింగ్ కోసం ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ కలిగి ఉంది. సస్పన్షన్ సెటప్ కూడా అప్‌డేట్ అయింది. చేతక్ 35 సిరీస్‌ మొత్తం కూడా క్లాసిక్ డిజైన్‌ లాగా ఉంటుంది. సీటు పొడవు 80 మి.మీ. ఆన్‌బోర్డ్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా, థెఫ్ట్ అలర్ట్, యాక్సిడెంట్ డిటెక్షన్‌ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, December 20, 2024, 16:25 [IST]
English summary
Bajaj chetak 35 series electric scooters launched price and specifications check here
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+