ఫీచర్లు, రేంజ్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఢీకొట్టేది లేదు.. మీరు ఏది కొంటారు?

ప్రముఖ టూ వీలర్ సంస్థ బజాజ్ ఆటో ఇటీవలే భారత మార్కెట్లోకి చేతక్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. గణనీయమైన అప్‌గ్రేడ్లతో లాంచ్ అయిన ఈ ఈవీ టాప్ స్పెక్ వేరియంట్.. టీవీఎస్ ఐక్యూబ్ Sకు గట్టి పోటీగా మార్కెట్లోకి వచ్చింది.

బజాజ్ చేతక్ 35 సిరీస్.. 32 సిరీస్ మోడళ్లతో పోలిస్తే మరిన్ని అప్‌గ్రేడ్లను కలిగి ఉంది. స్టైల్ అండ్ లుక్ పరంగా యువతకు ఫేవరెట్ అయిన ఈ స్కూటర్ ప్రీమియం వెర్షన్.. టీవీఎస్ iQube కి పోటీనిస్తుండగా.. ఇక్కడ బ్యాటరీ పనితీరు, ఫీచర్లు మరియు ధర పరంగా చేతక్ 3501, iQube Sలను పరిశీలించవచ్చు.

Bajaj Chetak vs TVS iQube

చేతక్ 3501 ధర: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సరసమైన ధరలో సంస్థ ప్రవేశపెట్టింది. రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.27 లక్షలు(ఎక్స్-షోరూమ్) ధరతో ఉన్నాయి. 3501 మరియు 3502 వేరియంట్‌ల ఎంపికలో కొనుగోలు చేయవచ్చు.

TVS iQube ధర: దేశీయ మార్కెట్లో, TVS iQube.. 2 ఆకర్షణీయమైన వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. సాధారణ iQube వేరియంట్ ధర రూ. 1,47,968 గా ఉంది. iQube S వేరియంట్ ధర రూ. 1,53,909. ప్రాంతాన్ని బట్టి ధరలు మారతాయని గమనించగలరు.

Bajaj Chetak vs TVS iQube

చేతక్ పర్ఫామెన్స్: ఈ బజాజ్ చేతక్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నాయి. ఫుల్ ఛార్జింగ్‌తో 150 కి.మీ రేంజ్ ఇస్తుంది. గంటకు 73 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులోని బ్యాటరీ కేవలం 3 గంటల్లో 0 నుండి 80% వరకు .
ఛార్జింగ్ పూర్తవుతుంది.

ఫీచర్ల పరంగా కొత్త చేతక్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు TAFT టచ్‌స్క్రీన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, ఆన్‌బోర్డ్ ఛార్జింగ్ మరియు ఇంటిగ్రేటెడ్ మ్యాప్‌లను కలిగి ఉంది. ఇందులో భారీ 35-లీటర్ బూట్ స్పేస్ ప్రధానంగా ఉంది.

Bajaj Chetak vs TVS iQube

TVS iQube పర్ఫామెన్స్: రెండు వేరియంట్‌లు 3.04 kWh సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఇది 4.4 kW హబ్-మౌంటెడ్ BLDC మోటారును కలిగి ఉంది, ఇది 140 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. గరిష్ఠంగా గంటకు 75 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 4 గంటల 30 నిమిషాల్లో 0 నుంచి 80% ఛార్జ్ అవుతుంది.

ఈ స్కూటర్‌లో మొబైల్ ఛార్జింగ్ కోసం USB సాకెట్, 32 లీటర్ కెపాసిటీ స్టోరేజ్, ఎకో, స్పోర్ట్ రైడింగ్ మోడ్ ఆప్షన్‌లను సంస్థ అందిస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో ఇది కేవలం 4.2 సెకన్లలో 0 - 40 kmph నుండి స్పీడ్ అందుకుంటుంది. కాగా ప్రస్తుతానికి, గరిష్ఠ రేంజ్ 145 కి.మీగా ఉంది.

Bajaj Chetak vs TVS iQube

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, December 26, 2024, 15:00 [IST]
English summary
Bajaj chetak 35 series vs tvs iqube check the features price and range details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+