మార్కెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే.. రెండింటీ మధ్య తేడాలు చూసి మీరే డిసైడ్‌ అవ్వండి!

దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ని కొనేవారి సంఖ్య రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌, ఏథర్‌ ఎనర్జీ, టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌, బజాజ్ చేతాక్‌ వంటి కంపెనీల స్కూటర్లు టాప్‌లో ఉన్నాయి. బజాజ్ ఆటో (Bajaj Auto), టీవీఎస్ మోటార్ (TVS Motor) మార్కెట్‌లో పోటాపోటీగా స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. మార్కెట్‌లో తమ గ్రిప్‌ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో బజాజ్ తర్వాత, టీవీఎస్ కంపెనీ ఉంది. ఇటీవల బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 'బ్లూ 3202' (Blue 3202) వేరియంట్‌ని విడుదల చేసింది. ఇది టీవీఎస్ ఐక్యూబ్ (TVS Iqube 3.4 kWh) 3.4 కిలోవాట్ల వేరియంట్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య తేడాలు మీ కోసం..

ధర: తాజాగా బజాజ్ విడుదల చేసిన చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అదే విధంగా టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.1.36 (ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఇక్కడ టీవీఎస్‌ ఐక్యూబ్‌తో పోలిస్తే చేతక్ బ్లూ 3202 ధర రూ.21,000 తక్కువగా ఉంది.

Bajaj Chetak Blue 3202

ఫర్ఫామెన్స్‌: బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారు గరిష్టంగా 5.3 bhp పవర్, 16nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఫుల్ ఛార్జ్ చేస్తే 137 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. ఇది గంటకు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

అదనంగా రూ.5,000 చెల్లించి టెక్ ప్యాక్ ఆప్షన్‌తో కొనుగోలు చేసే చేతక్ బ్లూ 3202 మోడల్ టాప్ స్పీడ్ గంటకు 73 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇక ఈ బ్యాటరీ ప్యాక్‌ని ఫుల్‌ ఛార్జ్‌ చేసేందుకు 5 గంటల 50 నిమిషాలు పడుతుంది. ఇంట్లోనే ఈ స్కూటర్‌ని ఛార్జ్‌ చేసుకోవచ్చు.

TVS iQube Electric Scooter

టీవీఎస్ ఐక్యూబ్ 3.4 కిలోవాట్ల బ్యాటరీ వేరియంట్ ఎలక్ట్రిక్ మోటార్ 5.9 bhp, గరిష్ట శక్తిని 33 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్లుగా ఉంది. ఇది కేవలం 4.2 సెకన్లలో 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

స్పెసిఫికేషన్లు: చేతక్ బ్లూ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో రైడింగ్ మోడ్‌తో వస్తుంది. టెక్ ప్యాక్ మోడల్‌లో ఎకో & స్పోర్ట్స్ రైడింగ్ మోడ్స్ కలవు. అంతే కాకుండా హిల్ హోల్డ్, రివర్స్ మోడ్ ఉన్నాయి. ఇందులో డిజిటల్ కన్సోల్, అల్లాయ్ వీల్స్, భద్రత కోసం డిస్క్, డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇది బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్ సహా వివిధ కలర్‌ ఆప్షన్‌లో లభిస్తుంది.

Bajaj Chetak Blue 3202

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 మిమీ బ్రేక్‌ని కలిగి ఉంది. రివర్స్ పార్క్ అసిస్ట్, USB పోర్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది షైనింగ్ రెడ్, పెర్ల్ వైట్, టైటానియం గ్రే గ్లోసీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, September 12, 2024, 10:15 [IST]
English summary
Bajaj chetak blue 3202 vs tvs iqube electric compatison details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+