మరింత తక్కువ ధరలో బజాజ్‌ చేతక్‌ ఇ స్కూటర్‌.. ఈ ఛాన్స్‌ అస్సలు మిస్‌ చేసుకోకండి.!!

భారత మార్కెట్లో ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బజాజ్‌ చేతక్‌(Bajaj Chetak E Scooter)కు మంచి ఆదరణ లభిస్తోంది. బజాజ్‌ ఆటో ఇండియా విక్రయిస్తున్న ఈ స్కూటర్‌.. మెరుగైన పనితీరుతో కస్టమర్లకు ఫేవరెట్‌గా ఉంది. ఈ క్రమంలో బజాజ్‌.. చేతక్‌ స్కూటర్‌ను ఇప్పుడున్న ధర కంటే మరింత సరసమైన ధరలో విడుదల చేయాలని చూస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు(Electric Scooter) ఆదరణ పెరుగుతోంది. లో మెయింటెనెన్స్‌, ఈజీ హ్యాండ్లింగ్‌తో కస్టమర్లు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా FAME ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీలకు సబ్సిడీలను అందిస్తోంది. ఇప్పటికే FAME-1, FAME-2 తో డిస్కౌంట్లు అందించింది. ఈ క్రమంలో FAME-2 సబ్సిడీ ఈ నెలాఖరుకు ముగియనుంది.

Bajaj-Chetak-Electric-Scooter-At-Affordable-Price

ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. FAME-2 సబ్సిడీ ముగిశాక ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పుడున్న ధరలతో పోలిస్తే ఈవీల ధరలు పెరగనున్నాయి. దీంతో ఈవీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. కాగా ఈ నేపథ్యంలో బజాజ్‌ ఆటో ఇండియా తన ప్రముఖ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ మరింత తక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తోంది.

బజాజ్ ప్రత్యర్థి కంపెనీలు ఓలా మరియు ఈథర్ సరసమైన ధరల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. మార్కెట్లో చేతక్‌ ఇ స్కూటర్‌ ధర కాస్త ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో చేతక్ లైనప్‌ను విస్తరించడంలో బిజీగా ఉన్నట్లు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ధ్రువీకరించారు. త్వరలోనే తక్కువ ధరలో చేతక్‌ ఇ స్కూటర్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించారు.

Bajaj-Chetak-Electric-Scooter-At-Affordable-Price

బజాజ్‌ చేతక్‌ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(Bajaj Chetak At Low Price) ధర రూ. లక్ష(ఎక్స్‌-షోరూమ్‌) లోపే ఉంటుందని సమాచారం. అయితే సరసమైన ధర దృష్ట్యా చిన్న బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌తో విడుదల కావచ్చు. కాగా ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే, ఇందులో కొన్ని కీలకమైన ఫీచర్లు ఉండకపోవచ్చు. ఇందులో మోనోక్రోమ్ LCD కన్సోల్‌ను చేర్చే అవకాశాలు ఉన్నాయి.

బజాజ్‌ నుంచి సరసమైన ధరలో రాబోతున్న కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏప్రిల్ లేదా మేలో మార్కెట్లో రావొచ్చని తెలుస్తోంది. కాగా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌ 3 స్కూటర్లలో బజాజ్‌ చేతక్‌ ఇ స్కూటర్‌ ఒకటి. ఈ స్కూటర్‌ మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి, అర్బన్ మరియు ప్రీమియం.

Bajaj-Chetak-Electric-Scooter-At-Affordable-Price

వీటి ధరలు వరుసగా రూ. 1.15 లక్షల నుండి రూ. 1.35 లక్షల వరకు ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. బజాజ్ చేతక్ అర్బన్ వేరియంట్ పూర్తి ఛార్జ్‌పై 113 కిమీల రేంజ్‌ను ఇస్తుంది. గరిష్ఠంగా గంటకు 73 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

కాగా చేతక్ ప్రీమియం మోడల్ పూర్తి ఛార్జ్‌పై 108 కి.మీల రేంజ్ ఇస్తుండగా.. గరిష్ఠంగా గంటకు 63 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రెండు బజాజ్ చేతక్ వేరియంట్లలో డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. దీంతో యువ కస్టమర్లకు ఫేవరెట్‌గా మారింది.

చేతక్‌ ఇ స్కూటర్‌లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్ మరియు డిస్‌ప్లే థీమ్‌ ఫీచర్లు ఉన్నాయి. కాగా చేతక్‌ ప్రీమియం మోడల్ ఇండిగో బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్ మరియు హాజెల్‌నట్‌తో సహా 4 కలర్స్‌లో అందుబాటులో ఉంది. అర్బన్ వెర్షన్ కోర్స్ గ్రే, సైబర్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్‌తో సహా నాలుగు కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, March 25, 2024, 16:21 [IST]
English summary
Bajaj chetak electric scooter launch soon at more affordable price under rs 1 lakh check details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+