బజాజ్ చేతిలో ఓడిపోయిన ఓలా.. చేతక్‌తో చెమటలు పట్టించింది.. దుమ్మురేపుతున్న ఈవీ

ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ మార్కెట్లో ఈవీల వాడకం భారీగా పెరుగుతున్న కొద్ది తయారీదారులు వరుసగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ దేశీయ ఈవీ మార్కెట్‌లో తమ పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఈవీ టూవీలర్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి మెరుగైన సేల్స్‌ను కూడా సాధిస్తున్నాయి. ప్రతి నెల లాగే ఈ డిసెంబర్‌లో కూడా ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీల మధ్య సేల్స్ విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. తాజాగా అందిన డేటా ప్రకారం, ఈ నెలలో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీల మధ్య విక్రయాల పరంగా పోటీ నెలకొంది. ఈ డిసెంబర్ నెలలో ఈ ఈవీ కంపెనీలు మిగతా కంపెనీల కంటే అధికంగా ఈ-స్కూటర్లను విక్రయించాయి.

తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాహన్ వెబ్‌సైట్ ప్రకారం, డిసెంబర్ 1 నుంచి 14 మధ్య కాలంలో ఈవీ టూవీలర్ల సేల్స్ పరంగా బజాజ్ కంపెనీకి చెందిన చేతక్(Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎక్కువగా అమ్ముడుపోయి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సమయంలో చేతక్ దాదాపు 9,513 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. దీంతో బజాజ్ దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ల సేల్స్‌లో మార్కెట్లో అగ్రస్థానం పొందింది.

Bajaj Chetak Electric Scooter

దీని తరువాత డిసెంబర్ 1 నుంచి 14 మధ్య కాలంలో TVS మోటార్‌కు చెందిన iqube 7,567 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఇన్ని సంవత్సరాలు టాప్ ప్లేస్‌లో ఉన్నటుంటి ఓలా ఎలక్ట్రిక్ మాత్రం తన స్థానాన్ని కోల్పోయింది. ఈ కంపెనీ 'ఎస్1' సిరీస్ 6,387 యూనిట్ల విక్రయాలతో ఈ జాబితాలో మూడో స్థానం పొందింది. తర్వాత ఏథర్ ఎనర్జీ 5,053 యూనిట్లతో 4వ స్థానంలో నిలిచింది.

ఇక, డిసెంబర్‌లో మెరుగైన ఈవీ టూవీలర్ సేల్స్‌లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ 1,378 యూనిట్ల సేల్స్‌తో 5వ స్థానం పొందింది. టాప్ ప్లేస్‌లో నిలిచిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే, ఇది రూ.95,000 నుండి రూ.1.56 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌తో 123 నుండి 136 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

Tvs Electric Scooter First Half December Sales

రెండో స్థానంలో నిలిచిన TVS iQube గురించి చూసినట్లయితే ఇది 2.2 KWh, 3.04 KWh, 5.1 KWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ.1.07 లక్షల నుంచి రూ.1.37 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 75 నుండి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ మోడల్ దాదాపు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కూడా కనిపిస్తుంది.

చివరికి ఓలా ఎలక్ట్రిక్ 'S1' సిరీస్ గురించి మాట్లాడుకుంటే, ఇది దేశీయ మార్కెట్లో రూ. 74,999 నుండి రూ. 1.14 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. ఇది 2 KWh, 3 KWh, 4 KWh బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 95 నుంచి 192 కి.మీల వరకు ప్రయాణిస్తుంది.

Ola Electric Scooter First Half December Sales

ఇదిలా ఉంటే డిసెంబర్ 1 నుంచి 14 వరకు అమ్మకాల నివేదిక ప్రకారం, రానున్న రోజుల్లో ఈ కంపెనీల మధ్య పోటీ మరింత పెరగనుంది. TVS iQube, బజాజ్ చేతక్, Ola 'S1' సిరీస్ ఈ-స్కూటర్ల అమ్మకాలు ఇప్పుడు దగ్గరగా ఉన్నప్పటికి వీటి ప్లేస్‌లు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, December 19, 2024, 11:50 [IST]
English summary
Bajaj chetak electric scooter number one in first half december sales
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+