నాకు ఆ కంపెనీ స్కూటర్లు మాత్రమే కావాలంటున్న జనాలు.. బ్రాండ్‌ ముఖ్యం బిగులు!

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు భారీ సంఖ్యలో స్కూటర్లు, మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. అయితే ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌లో 80 శాతానికి పైగా జనాలు స్కూటర్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో చాలా వరకు కంపెనీలు సైతం వీటి ఉత్పత్తి పైనే పోకస్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ విభాగంలో టాప్‌లో కొనసాగుతుంది. ఆ తర్వాత భారీగా కస్టమర్లను ఆకర్షిస్తున్న స్కూటర్లలో బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు (Bajaj Chetak Electric Scooters) ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా ‌అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉన్నాయి.

ముఖ్యంగా సెప్టెంబర్‌ 2024లో బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు దుమ్మురేపాయి. అప్పటి వరకు టాప్ 2 లో ఉన్న టీవీఎస్‌ స్కూటర్ల అమ్మకాలను బజాజ్‌ చేతక్‌ బీట్‌ చేసింది. మార్కెట్‌లో మొత్తం 21.47 శాతంతో బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ రెండో స్థానంలో ఉంది. 27 శాతం వాటాతో ఓలా ఎలక్ట్రిక్‌ తొలిస్థానంలో ఉంది. ఇక టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ 20.26 శాతంతో మూడవ స్థానంలో కొనసాగుతుంది.

Bajaj Chetak Electric Scooters Variants Price and Range

ఇక బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఒక్కో వేరియంట్‌ వేర్వేరు ఫీచర్లు, వివిధ ధరలను కలిగి ఉన్నాయి. మీ రోజువారీ వినియోగాన్ని బట్టి ఈ కంపెనీ నుంచి లభించే స్కూటర్లను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బజాజ్‌ 2903, 3202, 3201 వేరియంట్ల ధరలు, రేంజ్‌, ఇతర స్పెసిఫికేషన్స్‌కి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

చేతక్ 2903: ఇది కంపెనీ లైనప్స్‌లోనే బేస్‌ వేరియంట్‌గా ఉంది. ఈ బేస్ మోడల్ 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌ దీని గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లుగా ఉంది. ఇది కాంబీ బ్రేక్‌ సిస్టమ్‌, 5 inch LCD స్క్రీన్‌ డిస్‌ప్లే, అల్లాయ్‌ వీల్స్‌, ఛార్జింగ్‌ పోర్ట్‌ ఇన్‌బిల్ట్‌ నావిగేషన్‌ సిస్టమ్‌ ఇంకా మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది.

Bajaj Chetak Electric Scooters

ఈ స్కూటర్‌ని 0- 80 శాతం ఛార్జ్‌ చేయడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఈ మోడల్ ధర రూ .95,998 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌పై 123 కిలోమీటర్ల క్లెయిమ్ రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్‌ 3.4 బ్యాటరీ ప్యాక్‌లోనూ లభిస్తుంది. కస్టమర్లు తమ అవసరానికి తగిన వేరియంట్‌ని ఎంచుకోవచ్చు.

చేతక్ 3202: ఇదొక మిడ్-వేరియంట్‌గా ఉంది. ఈ స్కూటర్‌ 3.2 కిలోవాట్ల పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని స్టాండర్డ్ టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు కాగా.. ఆప్షనల్ టెక్ ప్యాక్‌తో వచ్చే స్కూటర్‌ వేగం గంటకు 73 కిలోమీటర్లకు పెరుగుతుంది. దీని 80 శాతం ఛార్జింగ్ కోసం3 గంటల 35 నిమిషాలు పడుతుంది. దీని ధర రూ .1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Bajaj Chetak Electric Scooters Variant wise Price

చేతక్ 3201: మెరుగైన ఫీచర్లను కోరుకునే వారు టాప్ వేరియంట్ 3201 బెస్ట్ ఆప్షన్‌గా పరిగణించవచ్చు. ఇది మిడ్ వేరియంట్ మాదిరిగానే బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, అధునాతన TFT డాష్‌ బోర్డ్‌ని కలిగి ఉంటుంది. ఈ మోడల్ అదనంగా స్విచ్ గేర్‌తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ ఆప్షన్‌, 73 కిలోమీటర్ల టాప్‌ స్పీడ్‌ని కలిగి ఉంటుంది.

ఈ కంపెనీ స్కూటర్లను ఎంచుకునేటప్పుడు ధర, వాటి రేంజ్‌ చాలా కీలకం. బేస్ వేరియంట్ ధర రూ.95,998, 123 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది. ఇక మిడ్ వేరియంట్ రూ .1.15 లక్షలతో 136 కిలోమీటర్ల రేంజ్‌, టాప్ వేరియంట్ అదే రేంజ్‌తో రూ .1.27 లక్షల ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్లు వివిధ కలర్‌ ఆప్షన్స్‌, స్పెషల్‌ వేరియంట్స్‌ లోనూ లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, October 14, 2024, 10:47 [IST]
English summary
Bajaj chetak electric scooters variant wise price and range details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+