జనాలకు తెగ నచ్చేస్తున్న ఆ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. భారీ సేల్స్‌తో సెప్టెంబర్‌లో నంబర్-2కి జంప్!
గత నెలలో దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ (Electric Two Wheelers) సేల్స్ కొద్దిగా తగ్గాయి. అయితే ఈ పండుగ సీజన్‌లో వీటి సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్‌లో చాలా మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ (2024) నెలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ సేల్స్ రిపోర్ట్ ప్రకారం ఓలా ఎస్1 సిరీస్ స్కూటర్లు (27 శాతం)తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 21.47% మార్కెట్ వాటాతో రెండవ అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా నిలిచింది. ఆ తర్వాత టీవీఎస్ ఐక్యూబ్ (20.26 శాతం) రెండో స్థానంలో ఉంది.
తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం బజాజ్ చేతక్ రెండో స్థానానికి ఎగబాకింది. టీవీఎస్ స్కూటర్లు గత నెల వరకు రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది. బజాజ్ చేతక్ కంపెనీ స్కూటర్లు మంచి బిల్డ్ క్వాలిటీతో స్కూటర్లను విడుదల చేస్తుంది. దీంతో జనాలు ఈ స్కూటర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ కంపెనీ సేల్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి.

ఇక బజాజ్ ఆటో గత నెలలో (సెప్టెంబర్ 2024)లో దేశీయ మార్కెట్‌లో చేతక్ 18,933 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. 2023లో ఇదే సమయంలో కేవలం 7107 యూనిట్లతో పోలిస్తే 166 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ సంఖ్యలో యూనిట్లను విక్రయించింది. ఈ మధ్య కాలంలో 119,759 యూనిట్లను కొనుగోలు చేశారు.
అదే 2023 జనవరి-సెప్టెంబర్‌లో ఇదే కంపెనీ కేవలం 40,602 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ కాలంలో ఏకంగా 195% వృద్ధిని బజాజ్ సాధించింది. ప్రస్తుతం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మల్టీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ కంపెనీ స్కూటర్లలో 'బ్లూ 2903' వేరియంట్ ధర రూ.95,998 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే లీటరుకు 123 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ వేరియంట్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.

దీని గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లుగా ఉంది. బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ కొనుగోలుదారులకు రూ .1.47 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 126 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 73 కిలోమీటర్లుగా ఉంది. బ్యాటరీ 0 నుండి 80% ఛార్జ్ కావడానికి 3 గంటల 35 నిమిషాలు పడుతుంది.
ఇక తాజాగా కంపెనీ విడుదల చేసిన బజాజ్ చేతక్ బ్లూ 3202 వేరియంట్ ధర రూ .1.15 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 137 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లుగా ఉంది. దీని బ్యాటరీ ప్యాక్‌ని కేవలం 3 గంటల 35 నిమిషాల్లో 0 నుండి 80% ఛార్జ్ అవుతుంది.
ఇక రానున్న పండుగ సీజన్‌లో ఈ కంపెనీ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. బజాజ్ చేతక్‌కి మార్కెట్‌లో మంచి పలుకుబడి ఉంది. ఈ కంపెనీ అందించే ఫీచర్లు, దీని బిల్డ్ క్వాలిటీ, రేంజ్, ఇతర స్మార్ట్ టెక్నాలజీతో ఈ స్కూటర్లు జనాలు ఎక్కువగా కొంటున్నారు. దీంతో ఈ స్కూటర్ల సేల్స్ అమాంత పెరిగాయి. రానున్న రోజుల్లోనూ బజాజ్ ఆటో ఇదే దూకుడుని కొనసాగించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








