బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటోలు వైరల్.. సింగిల్ ఛార్జింగ్‌తో 127 కి.మీ రేంజ్!
బజాజ్ చేతక్ భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్‌లలో ఒకటి. 1990 నుంచి ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ వాహనం ఎలక్ట్రిక్‌గా అందుబాటులో ఉంది. 2020 జనవరి నుంచి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Bajaj chetak premium electric scooter) అందుబాటులో ఉంది. తాజాగా బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రీమియం వెర్షన్ ఇ- స్కూటర్ ఫోటోలు వైరల్ : బజాజ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేకం మార్కెట్లోకి వచ్చాయి. దీంతో బజాజ్ ఆటో తన చేతక్ స్కూటర్ కొత్త ప్రీమియం వెర్షన్‌ను అభివృద్ధి చేసింది. ఈ స్కూటర్ జనవరి 5న విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రీమియం వెర్షన్ స్కూటర్ ఫోటోలు డీలర్‌షిప్ షోరూం నుంచి బయటకు వచ్చాయి.

రెండు వేరియంట్లలో లభిస్తుంది : బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2024 వెర్షన్.. అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈ రెండు వేరియంట్ల డిజైన్, ఫీచర్లలో పెద్దగా తేడా లేదు. అర్బన్ వేరియంట్ ధర కొంచెం తక్కువగాను, ప్రీమియం వేరియంట్ ధర కొంచెం ఎక్కువగాను ఉండే అవకాశం ఉంది.
TFT ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్ సహా : పాత వెర్షన్ బజాజ్ చేతక్‌తో పోలిస్తే ఈ స్కూటర్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీతోపాటు టర్న్ బై టర్న్ నావిగేషన్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ ఫంక్షన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

బూట్ స్పేస్ పెరిగే అవకాశం : బజాజ్ చేతక్ ఈవీలో ఇప్పటికే అనేక రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం వెర్షన్‌లోనూ రైడింగ్ మోడ్‌లు ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్ అండర్ సీట్ బూట్ స్పేస్‌ను 18 లీటర్ల నుంచి 21 లీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
సింగిల్ ఛార్జింగ్‌తో 127 కి.మీ రేంజ్ : బజాజ్ చేతక్ ప్రీమియం స్కూటర్ 3.2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జింగ్ తో ఇది 127km రేంజ్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది. అయితే ఈ స్కూటర్ జనవరి 5న విడుదల కానుంది. అదే రోజు మరిన్ని కచ్చితమైన ఫీచర్ల గురించి తెలిసే అవకాశం ఉంది. దీంతోపాటు బుకింగ్ వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








