Bajaj chetak VS Ather 450X బజాజ్ చేతక్ VS ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఏది బెస్ట్ ఆప్షన్?
బజాజ్ ఇటీవల చేతక్ 2024 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను (Bajaj Chetak Electric Scooter) విడుదల చేసింది. అర్బన్, ప్రీమియం వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే విధంగా మరో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ 450X జెన్ 3 (Ather 450X) కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ రెండు స్కూటర్ల ఫీచర్లు ఎలా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది మెరుగైన పనితీరును కనబరుస్తోందో చూద్దాం.
బజాజ్ చేతక్ డిజైన్, ఫీచర్ల పరంగా పాత మోడల్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్ చేయబడింది. వృత్తాకార హెడ్‌లైట్, కర్వడ్ బాడీ ప్యానల్‌ను కలిగి ఉంది. అదే ఏథర్ 450X స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఏరోడైనమిక్ లుక్‌తో వస్తుంది. డిజైన పరంగా యువతను ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

ఏథర్ 450X ప్రో, బజాజ్ చేతక్ 2024 ధరలు : బజాజ్ చేతక్ ప్రీమియం రూ.1,35,463 (ఎక్స్‌షోరూం) అదే టెక్‌ప్యాక్‌తో కలిపి రూ.1,44,463గా (ఎక్స్‌షోరూం) ఉంది. అదే ఏథర్ 450X ధర రూ.1,44,921 (ఎక్స్‌షోరూం) గా ఉంది ప్రో ప్యాక్‌తో కలిపి ధర రూ.1,67,999 (ఎక్స్‌షోరూం)గా ఉంది.
ఫీచర్లు : బజాజ్ మరియు ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్లు కీలక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. బజాజ్ చేతక్ ప్రీమియం Tecpac తోపాటు రెండు రైడ్ మోడ్‌లను కలిగి ఉంది. దీంతోపాటు హిల్ హోల్డ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, సీక్విన్షియల్ బ్లింకర్స్, 5- అంగుళాల కలక్ TFT, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

ప్రో ప్యాక్‌తో కూడిన ఏథర్ 450X స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్ మరియు వార్ప్ రైడింగ్ మోడ్‌లలో అందుబాటులో ఉంది. హిల్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్ట్, మ్యూజిక్ మరియు కాల్ డిస్‌ప్లే, నావిగేషన్, గైడ్ మీ హోం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యాక్యుమెంట్ నిల్వ, OTA (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్‌లు, మరియు రిమోట్ ఛార్జ్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మోటార్ మరియు బ్యాటరీ : బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ 3.2kWh బ్యాటరీ ప్యాక్.. గరిష్ఠంగా 127 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 73 కి.మీగా ఉంది. సింగిల్ ఛార్జింగ్ చేసేందుకు 4 గంటల 30 నిమిషాలు పట్టనుంది.

అదే ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ 3.7kWh బ్యాటరీ ప్యాక్ ను 6.2kW మోటార్‌తో జతచేసింది. ఈ స్కూటర్ 110 కి.మీ గరిష్ఠ రేంజ్ ఇస్తుంది. గరిష్ఠంగా 90 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఛార్జింగ్ చేసేందుకు 4 గంటలు 30 నిమిషాలు పట్టనుంది.
బజాజ్ చేతక్ 2024 ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్‌తో అందించబడుతుంది. 12 అంగుళాల టైర్లతో ముందు వైపు డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. అదే ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్స్ మరియు మోనోషాక్‌తో వస్తుంది. 12 అంగుళాల చక్రాలతో ముందు, వెనుక డిస్క్ బ్రేకులను కలిగి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








