మీరు పెట్టే 100 రూపాయలకు 100 కి.మీ మైలేజీ పక్కా.. బజాజ్‌ సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తుంది!!

బజాజ్ యొక్క సీఎన్‌జీ ప్రపంచవ్యాప్తంగా రికార్డుని నమోదు చేసేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సీఎన్‌జీ బైక్‌ ప్రపంచంలోనే మొదటిది కావడం మీకు తెలిసిన అంశమే. దీనిపై ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. తక్కువ ధరకే ప్రజలకు వివిధ ప్రయోజనాలను అందించే ఈ బైక్ నేడే (జూలై 5)న లాంచ్ కానుంది. దీనిపై చాలా మందికి రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఈ బైక్ ధర ఎంత మరియు మైలేజీ ఎంత ఇస్తుంది.? ఈ బైక్ ఎలా పనిచేస్తుందనే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఉంది.

బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ని నేడు భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనుంది. గత కొన్ని నెలలుగా ఈ బైక్ గురించి చర్చ జరుగుతోంది. ఈ బైక్ టెస్టింగ్ సమయంలో తీసిన స్పై ఫోటోలు, టీజర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలై పలు సంచనాలను క్రియేట్ చేశాయి. ఈ బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఇంధనం రెండింటితో ఒకేసారి నడిచేలా రూపొందించబడింది.

Bajaj-CNG-Freedom-125

ఈ బైక్‌లో ఫ్యూయెల్ ట్యాంక్ కూడా ఉంటుంది. అదే సమయంలో సీఎన్జీ ట్యాంక్ ఉంటుంది. బైక్‌ ఏ ఇంధనంతో నడపాలో డ్రైవర్ ఎంచుకునేలా స్విచ్ కూడా అందించారు. ఈ బైక్‌ని తొలుత బ్రూజర్‌ అని ఇప్పుడు ఫ్రీడమ్ అని మాట్లాడుకుంటున్నారు. అయితే ‌అఫీషియల్‌ సైట్‌లో తాజాగా ఫ్రీడమ్‌ 125 అని కనిపించింది. ఈ పేరు కన్ఫర్మ్‌ చేయడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.

ఈ రెండు పేర్లతో బైక్స్‌ విడుదల అవుతాయా? లేదా ఒకే పేరుతో విడుదల చేస్తారా అనే విషయంపై సంగ్ధితత నెలకొంది. అయితే ఈ బైక్‌ రెండు వేరియంట్లలో విడుదుల చేసే అవకాశం ఉంది. కావున దీనికి రెండు పేర్లు పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బేస్‌ వేరియంట్‌, టాప్ స్పెక్‌ వేరియంట్‌ అనే రెండు వేరియంట్లలో ఈ బైక్‌ అందుబాటులోకి రానుంది.

Bajaj-CNG-Bike-Expected-Features

ఇక ఈ బైక్ ధర విషయానికొస్తే రూ.లక్ష లోపు ధరకే విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. బేస్ వేరియంట్ ధర రూ.90,000 నుంచి రూ.95,000 మధ్య ఉండొచ్చని అంచనా. ఈ బైక్ టాప్ వేరియంట్ ధర రూ .1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ బైక్ 125 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. బహిరంగ మార్కెట్లో 125 సీసీ సెగ్మెంట్లోని అన్ని బైకుల ధరలు రూ.75,000 నుంచి రూ.85,000 మధ్య ఉన్నాయి. టీవీఎస్ రైడర్ 125 ధర రూ.95,000గా ఉన్నాయి. ఈ బైక్‌ ధర దాదాపు ఒకేలా ఉంటే ఇదొక సంచలనం కానుంది.

Bajaj-CNG-Bike-Mileage-And-Price

ఈ బైక్‌కి ప్రత్యక్ష పోటీగా ఏ మోటార్‌సైకిల్స్‌ లేవు. ఈ ధర, సీసీ విభాగంలో చాలా బైక్స్ అందుబాటులో ఉన్నాయి. హీరో స్ప్లెండర్ సీఎన్‌జీ బైక్‌కి కచ్చితంగా దీనికి పోటీ ఇస్తుందనే అంచనా ప్రజల్లో ఉంది. ఈ బైక్ లాంచ్ తర్వాత ఫర్ఫామెన్స్‌ని బట్టి జనాలు దీనిని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ బైక్‌ కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఈ బైక్ తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడమని చెప్పాలి.

బజాజ్ ఈ సీఎన్‌జీ బైక్‌ని తీసుకురావడం ప్రధాన లక్ష్యం కూడా ఎక్కువ మైలేజీ కోరుకునే వినియోగదారులను ఆకర్షించడం. అందుకే ఈ బైక్‌ ధరను కూడా తక్కువ ధరలో ఉంచాలని భావిస్తోంది. ఈ బైక్‌ పూర్తి స్థాయిలో మార్కెట్‌లోకి వచ్చాక భారీ పోటీ ఉంటుందని.. వినియోగదారులు ఎక్కువగా సీఎన్‌జీ బైక్‌ల వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తున్నారు. ఈ బైక్‌ మైలేజీ 80 నుంచి 90 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో కిలో సీఎన్‌జీ ధర రూ.87కు విక్రయిస్తున్నారు. ఈ బైక్ 87 కిలోమీటర్ల మైలేజీ ఇస్తే, ఒక కిలోమీటరు ప్రయాణించడానికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. అయితే దీన్ని ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారనే దానిపై ఆధారపడి ఉంది. అయితే ఈ బైక్‌ సక్సెస్ అయితే ప్రపంచం లోని బైక్ పరిశ్రమలో భారీ విప్లవమనే చెప్పాలి.

More from DriveSpark

Article Published On: Friday, July 5, 2024, 11:10 [IST]
English summary
Bajaj cng bike expected bike price mileage and specifications details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+