Bajaj CNG Bike బజాజ్ సీఎన్‌జీ బైక్ లాంచ్ అప్పుడే.. ఇక పెట్రోల్ కష్టాలకు చెక్ పెట్టేయండి.!!
సీఎన్‌జీ- ఆధారిత బైక్ ప్రకటనతో బజాజ్ ఆటో ఇండియా.. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బైక్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ Bajaj CNG Bike లాంచ్‌కు సంబంధించి ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. పూర్తి సమాచారం ఈ కథనంలో.. .
భారత మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ బజాజ్ అతి త్వరలో CNGతో నడిచే బైక్‌ను లాంచ్ చేసే యోచనలో ఉంది. కాగా ప్రస్తుతానికి భారత్‌లో CNGతో నడిచే ఆటోలు, కార్లు మరియు భారీ వాహనాలు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. వీటికోసం దేశవ్యాప్తంగా సీఎన్‌జీ గ్యాస్ ఫిల్ స్టేషన్లు కూడా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకువచ్చారు.

అయితే ఇప్పటివరకూ సీఎన్‌జీ విభాగంలో ఒక్క బైక్ కూడా మార్కెట్లోకి రాలేదు. ఈ క్రమంలో తొలిసారిగా సీఎన్‌జీ బైక్‌ను తయారుచేస్తున్నట్లు బజాజ్ ఆటో ఇండియా వెల్లడించింది. ఇప్పటికే ఈ బైక్ ట్రయల్ రన్‌ను కూడా ప్రారంభించింది. Bruzer పేరుతో ఈ బైక్‌ను తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ బైక్ లాంచ్‌కు సంబంధించి.. బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ప్రకటన విడుదల చేశారు.
బజాజ్ CNG బైక్ జూన్‌లో విడుదల కానున్నట్లుగా శుక్రవారం(మార్చి 22న) రాజీజ్ బజాజ్ ధ్రువీకరించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బైక్‌ను వేరే బ్రాండ్‌తో విడుదల చేయనున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే సీఎన్‌జీ బైక్‌లను కొత్త బ్రాండ్‌తో విక్రయించనున్నట్లు రాజీవ్ వెల్లడించారు.

అయితే సీఎన్‌జీ బైక్‌కు సంబంధించి లాంచ్ తేదీని ఆయన ప్రకటించారు. జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించారు. జూన్ నెలాఖరులోగా CNG బైక్ లాంచ్‌ను ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. లాంచ్‌తో పాటు ధర వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే సీఎన్‌జీ బైక్ అధిక మైలేజ్‌తో వస్తున్న కారణంగా.. ధర కూడా కొంచెం ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది.
దేశంలోని పెట్రోల్ కార్ల కంటే CNG కార్లు కొంచెం ఖరీదైనవి కావడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే, CNG కార్ల మాదిరిగానే, బైక్‌లు కూడా పెట్రోల్ మరియు CNG రెండింటిలోనూ నడుస్తాయని తెలుస్తోంది. కాబట్టి ఇందులో CNG కోసం సిలిండర్ మరియు పెట్రోల్ కోసం ఇంధన ట్యాంక్‌ను ఊహించవచ్చు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బజాజ్ సీఎన్‌జీ బైక్ గరిష్ఠంగా కిలోకు 100 కి.మీ మైలేజ్‌ని అందజేస్తుందని సంస్థ పేర్కొంది.

అర్బన్ కమ్యూటర్స్‌కు అనుకూలంగా ఈ బైక్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ధరలోనే ఈ బైక్ లాంచ్‌ను ఊహించవచ్చు. కాగా ఈ బైక్‌ను 100 సీసీ నుండి 160 సీసీ సెగ్మెంట్‌లో విడుదల చేయాలని కూడా సంస్థ భావిస్తోంది. టెక్నాలజీకి అనుగుణంగా బజాజ్ CNG బైక్ ప్రీమియం ఫీచర్లతో విడుదల కావచ్చు. LED లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెరుగైన సస్పెన్షన్ (టెలిస్కోపిక్ మరియు మోనోషాక్) సెటప్, డిస్క్ బ్రేక్‌లను ఆశించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








