100 కి.మీ మైలేజీ ఇచ్చే ప్రపంచంలోనే తొలి బజాజ్ CNG బైక్ పేరు వచ్చేసింది.. రేపే విడుదల!
ప్రపంచలోని తొలి సీఎన్‌జీ బైక్ (Bajaj CNG Bike) పేరును బజాజ్ వెల్లడించింది. తమ సంస్థ నుంచి విడుదల చేయబోయే ఈ సీఎన్‌జీ బైక్‌కి ఫ్రీడమ్ 125 (Freedom 125) అని పేరు పెట్టింది. ఈ బైక్‌ని రేపు(జూలై 5) మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల చేయనున్నట్లు బజాజ్ ఆటో (Bajaj Auto) వెల్లడించింది. ఈ సరికొత్త బైక్‌కి సంబంధించిన పేరును (Rushlane.com) బజాజ్ అధికారిక వెబ్‌సైట్‌లో గుర్తించినట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌లో రానుంది. ఈ బైక్ రూపకల్పన కోసం బజాజ్ ఆటో పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ సామర్థ్యాలను, స్మార్ట్ మరియు సృజనాత్మకతను జోడించి తీసుకువచ్చింది.
అయితే నిన్నటి వరకు కూడా ఈ బైక్‌కి సంబంధించి ఎటువంటి పేరుని వెల్లడించలేదు. అంతా రేపు (జూలై 5)న ఈ బైక్ పేరుని ప్రకటిస్తారని భావించారు. అయితే తాజాగా వెబ్‌సైట్‌లో దీని పేరును ఫ్రీడమ్ 125గా పేర్కొంది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం భారీగా పెరిగింది. పెరిగిన ఖర్చనులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇదొక ప్రత్యామ్నాయ బైక్‌గా నిలువనుంది.

బజాజ్ ఈ బైక్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకించినప్పటి నుంచి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బైక్ బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండనుంది. అంతే కాకుండా ఇది కిలోకు 100 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించనుంది. దీంతో ఎక్కువ శాతం మంది ఈ బైక్‌ని కొనుగోలు చేసే ఆసక్తి కనబర్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ బైక్ సంబంధించి బజాజ్ ఆటో ఇటీవలె టీజర్‌ని కూడా విడుదల చేసింది.
ఆ టీజర్ ప్రకారం బైక్ ఇంజిన్‌ని సింగిల్ బటన్‌తో సీఎన్‌జీ లేదా పెట్రోల్ లోకి మార్చుకోవచ్చు. ప్రస్తుతం పేరుని కూడా ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బైక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ బైక్ ఫ్రీడమ్ 125 పేరు డిస్ప్లే అవుతుంది. ఇది 125 సీసీ సెగ్మెంట్‌లోని ఇతర బైక్‌లకు గట్టి పోటీని ఇవ్వనుంది. రేపు విడుదల అనంతరం ఈ బైక్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఈ బైక్ 100సీసీ లేదా 110 సీసీ ఇంజిన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సీఎన్‌జీ ఇంధనం ఉత్తమమైన ఇంధన సామర్థ్యాన్ని అందిచడమే కాకుండా మంచి ఫర్ఫామెన్స్‌కి కూడా ఇవ్వనుంది. 100 కిలోమీటర్ల అందించడం ద్వారా ప్రపంచంలో అత్యంత పొదుపు మోటారుసైకిల్‌గా నిలువనుంది. మైలేజీపై కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మైలేజీ విషయంలో ఈ బైక్‌కి ఇతర సాంప్రదాయ బైక్స్ ఏవి సాటి రాకపోవచ్చని అంటున్నారు.
ఈ బైక్ పూర్తిగా స్మార్ట్ ఫీచర్లతో రానుంది. ఈ బైక్ రెండు వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బేస్ వేరియంట్ కంటే టాప్-స్పెక్ మోడల్‌లో నకిల్ గార్డ్స్, టైర్ హగ్గర్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 లో పొడవైన సీటు, రౌండ్ హెడ్‌లైట్, సీటు కింద సీఎన్‌జీ సిలిండర్ ఉండనుంది.

ఇక ట్యూబ్ లెస్ టైర్లతో అల్లాయ్ వీల్స్ మరియు హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో అడ్వెంచర్ స్టైలింగ్‌తో రానుంది. ఇక ఫైనల్‌గా దీని ధర విషయానికి వస్తే బజాజ్ ప్రపంచంలోని మొదటి సీఎన్‌జీ బైక్ మిడిల్ క్లాస్ వాళ్లకు కూడా అందుబాటు ధరలో విడుదల కానుంది. దీని ధర సుమారు రూ .90,000 నుంచి రూ .1 లక్ష (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని భావించవచ్చు.


Click it and Unblock the Notifications








