బజాజ్ CNG బైక్ కొనడం వల్ల కలిగే 5 ముఖ్య లాభాలు ఇవే.. పెట్రోల్ బైక్స్ కంటే పదిరెట్లు మేలు!!
బజాజ్ ఆటో నుంచి ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ (ఫ్రీడమ్ 125) దేశంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా భారతీయుల్లో ఈ బైక్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పెట్రోల్ బైకులు మాత్రమే భారతీయులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను కూడా భారతీయులు కొంటున్నారు తాజాగా సీఎన్‌జీ బైక్స్ కూడా అందుబాటులోకి రానుంది అయితే ఈ బైక్ కొనుగోలు చేస్తే లాభం ఉంటుందా? లేదా? అనే అంశంపై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ బైక్ గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు మీ కోసం..
డబ్బు ఆదా చేసుకోండి: బజాజ్ బైక్స్ ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈ సంస్థ లాంచ్ చేసే ప్రతీ బైక్ మిడిల్ క్లాస్ వాళ్లను దృష్టిలో పెట్టుకుని తీసుకుస్తుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం డబ్బు ఆదా చేయడం. ఈ బైకులను కొనుగోలు చేయడం మరియు ఉపయోగించడం ద్వారా, వాహనదారులు పెట్రోల్ కోసం ఖర్చు చేసిన చాలా డబ్బును ఆదా చేయవచ్చు.

అయితే పెట్రోల్ కంటే సీన్‌జీ ధర చాలా చౌకనది. దీంతో సీఎన్‌జీ బైక్‌ని ఉపయోగించడం వల్ల పెట్రోల్ కోసం మీరు వెచ్చించే ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. అయితే కిలో సీఎన్‌జీ ధర కేవలం రూ.82కు అందుబాటులో ఉంది. దీనివల్ల ఇంధన ఖర్చులపై ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. ఈ బైక్ బడ్జెట్‌లో టూవీలర్‌ని కొనుగోలు చేయాలనుకునే వారిని ఆకర్షించాలని భావిస్తోంది.
రోజువారీ వినియోగం కోసం: పెట్రోల్‌పై నడిచే బైక్స్ రోజూ నడవడం వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అదే సీఎన్‌జీ బైక్ వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది కాబట్టి రోజువారీ ఉపయోగం కోసం బజాజ్ ఈ బైక్‌ని రూపొందించింది. ముఖ్యంగా కమర్షియల్ వాడకం కోసం చూసే వారు ఈ బైక్‌ని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఉద్గారాలు: భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సమస్య వాహనాల నుండి వెలువడే ఉద్గారాలు. అందుకే ఒక్కో వాహనం ఎంత ఉద్గారాలను విడుదల చేయాలనే దానిపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. పెట్రోల్ బైక్స్‌తో పోలిస్తే ఈ సీఎన్‌జీ బైక్స్ తక్కువ ఉద్గారాలను కలిగి ఉంటాయి. అందువల్ల పర్యావరణ ప్రేమికులు ఈ బైక్‌ని ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉంటుంది.
తక్కువ ధర: పెట్రోల్, సీఎన్‌జీ టెక్నాలజీ ఉన్న కార్లు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. అందువల్ల పెట్రోల్ బైకుల కంటే ఎక్కువగా ఈ సీఎన్‌జీ బైక్ ధర ఉంటుందనే అంచనా ప్రజల్లో ఉంది. కానీ బజాజ్ ఈ సీఎన్‌జీ బైక్స్‌ని తక్కువ ధరకు విక్రయించాలని యోచిస్తోంది. ఈ కారణంగా సీఎన్‌జీ బైక్స్ పెట్రోల్ బైక్ మాదిరిగానే విక్రయించే అవకాశం ఉంది.

అధిక మైలేజీ: మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా, పెట్రోల్ కంటే సీఎన్‌జీ చౌకైనదని మనందరికీ తెలుసు. దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది. అయితే పెట్రోల్ బైక్, సీఎన్‌జీ బైక్ మైలేజీని పోల్చి చూసుకోవాలి. వీటితో పోలిస్తే సీఎన్జీ బైక్లు మరింత డబ్బును ఆదా చేస్తాయి. ఉదాహరణకు పెట్రోల్ బైకులు లీటరుకు 50 నుంచి 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తే సీఎన్‌జీ బైక్స్ ఎక్కువ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.
డ్రైవ్స్‌పార్క్ వ్యాఖ్య: ప్రపంచంలోనే తొలిసారిగా బజాజ్ సీఎన్‌జీ వాహనాన్ని భారత్‌లో లాంచ్ చేస్తోంది. ఈ వాహనం పేరు ఫ్రీడమ్ 125గా భావిస్తున్నారు. రేపు బైక్ లాంచ్ అయిన తర్వాతే పూర్తి వివరాలు, సాంకేతిక వివరాలు వెల్లడవుతాయి. ఈ కొత్త బైక్ లాంచ్ తర్వాత దీనిని కొనుగోలు చేయాలా? లేదా? అనే విషయంపై మీరే నిర్ణయం తీసుకోవాలి.


Click it and Unblock the Notifications








