ప్రపంచంలోనే తొలి బజాజ్‌ CNG బైక్‌ వచ్చేసింది.. ధర రూ.95,000.. మైలేజీ 330 కి.మీ

కొన్ని నెలలుగా బజాజ్‌ సీఎన్‌జీ బైక్‌ కోసం ప్రపంపచమంతా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు ఈ రోజు (జూలై 5)న సరికొత్త సీఎన్‌జీ ఫ్రీడమ్‌ 125 (Bajaj CNG Freedom 125) బైక్‌ని బజాజ్‌ ఆటో తీసుకువచ్చింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ తొలి సీఎన్‌జీ బేస్డ్‌ బైక్‌ని మార్కెట్‌లోకి విడుదల చేశారు.

ఈ బైక్‌ మొత్తం మూడు వేరియంట్లలో బజాజ్‌ విడుదల చేసింది. బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ డ్రమ్, డ్రమ్ LED, డ్రమ్ LED డిస్క్ అనే వేరియంట్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా 95,000, ధర 1.05 లక్షలు, 1.10 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) ధరలుగా ఉన్నాయి. ఈ బైక్‌కి సంబంధించి బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతానికి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో డెలివరీలు చేయనున్నారు.

Bajaj-CNG-Freedom-125-Bike-Launched

దశలవారీగా ఈ బైక్‌ డెలివరీలను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బైక్‌ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్ మరియు సీఎన్‌జీ రెండింటితో నడుస్తుంది. సీటు కింద సీఎన్‌జీ ట్యాంకును అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 9.5bhp పవర్ మరియు 9.7nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయనుంది.

ఈ బైక్‌లో 2 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌, 2 కిలోలల సీఎన్‌జీ కిట్‌ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ బైక్‌ పెట్రోల్‌, సీఎన్‌జీ రెండు మోడ్‌లు కలిపి 300-330 కిలోమీటర్ల రేంజ్‌ (మైలేజీ)ని అందించనుంది. కేవలం సీఎన్‌జీ మోడ్‌లో 213 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదని బజాజ్ పేర్కొంది. పెట్రోల్ ట్యాంక్ 117 కిలోమీటర్లను అందించనుంది. మొత్తానికి ఈ బైక్‌ మొత్తం 330 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

Bajaj-CNG-Freedom-125-Bike-Launched

ఈ సీఎన్‌జీ బైక్‌ కిలోకు 102 కిలోమీటర్లు, పెట్రోల్‌కి 64 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 ని మరింత స్టైలింగ్ సింపుల్ మోడ్రన్-రెట్రో లుక్‌లో అందించింది. ఈ బైక్ DRLతో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్‌తో వస్తుంది. ఈ బైక్ సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌లో సీఎన్‌జీ లో-లెవల్ అలర్ట్ మరియు న్యూట్రల్ గేర్ ఇండికేటర్‌ సహా అనేక ఇండికేటర్లును చూపిస్తుంది.

ఈ బైక్‌ని ఇతర సాధారణ బైక్స్‌ కంటే భిన్నంగా తయారు చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి డిజైన్‌తో బైక్స్‌ రాలేదు. ముఖ్యంగా ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ 785 మిమీ ఎత్తుతో సెగ్మెంట్‌లో పొడవైన సీటును (నలుగురు కూడా వెళ్లవచ్చు) అందించింది. స్ట్రాంగ్‌ ట్రెల్లిస్ ఫ్రేమ్ మరియు లింక్డ్ మోనోషాక్‌ని అందించారు.

Bajaj-CNG-Freedom-125-Bike-Launched

ఇక హ్యాండిల్‌ బార్‌ వద్ద ఉండే స్విచ్ఛర్‌ ద్వారా సీఎన్‌జీ లేదా పెట్రోల్‌ ఇంజిన్‌లోకి సులభంగా మార్చుకోవచ్చు. గ్రాఫిక్స్‌తో కూడిన 7 డ్యూయల్ కలర్ స్కీమ్‌తో ఈ బైక్‌ వస్తుంది. ఈ బైక్‌ 11 రకాల సేఫ్టీ టెస్టింగ్‌లను నిర్వహించిన తర్వాత మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. అన్ని టెస్ట్‌ల్లోనూ సీఎన్‌జీ కిట్‌కి తన చెక్కు చెదరలేదు.

ఈ బైక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై ప్రయాణిస్తుంది. ఈజిప్టు, టాంజానియా, పెరూ, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాలకు ఈ బైక్‌ని ఎగుమతి చేయనున్నారు. ఈ బైక్‌ హోండా షైన్ 125, హీరో గ్లామర్, టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R తో సహా ఇతర 125 సీసీ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీని ఇస్తుంది.

ఇదొక గేమ్‌ ఛేంజర్‌ బైక్‌గా బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ అభివర్ణించారు. ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సాహించాలని ఆయన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అమెరికా, జపాన్ తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా భారత్ అవతరించిందని నితిన్‌ గడ్కరీ చెప్పారు. పెట్రోల్, డీజీల్‌ వాహనాలకు స్వస్తి చెప్పేలా మరిన్ని కొత్త ఉత్పత్తులు తీసుకురావాలని పలు సంస్థలకు కేంద్ర మంత్రి ఈ వేదికగా సూచించారు.

More from DriveSpark

Article Published On: Friday, July 5, 2024, 15:25 [IST]
English summary
Babaj cng freedom 125 launched in india starting at rs 95000 which give more than 300km range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+