330 కి.మీ మైలేజీ ఇచ్చే పేదోడి బండికి ఫుల్ డిమాండ్.. తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేది అప్పుడే!
ప్రపంచంలోనే మొట్టమొదటి బజాజ్ సీఎన్‌జీ ఫ్రీడమ్ బైక్ (Bajaj CNG Freedom Bike) మార్కెట్‌లో దూసుకెళ్తుంది. ఈ బైక్ భారతీయ ద్విచక్ర వాహన విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఈ బైక్ కొనుగోలు కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ బైక్ కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మాత్రమే కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ దేశంలోని మొత్తం 88 నగరాలకు విస్తరించింది. కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారతదేశంలోని వివిధ నగరాలకు కూడా ఈ బైక్‌ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుంది.
ఈ సీఎన్‌జీ బైక్‌కి సంబంధించిన ఆగస్టులో అమ్మకాలు విడుదల అయ్యాయి. తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఒక్క ఆగస్టులోనే ఫ్రీడమ్ 125 మోడల్ 9,215 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత నెలలో బజాజ్ అత్యధికంగా అమ్ముడైన నాలుగో బైక్‌గా ఇది నిలిచింది. దేశంలో పూర్తి స్థాయిలో ఈ బైక్స్ అందుబాటులోకి వస్తే సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

సీఎన్‌జీ ఆధారిత కార్లు వచ్చి దశాబ్దానికి పైగా పూర్తైనప్పటికీ.. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే సీఎన్‌జీతో నడిచే తొలి బైక్ ఇదే కావడం గమనార్హం. విడుదలకు ముందే బజాజ్ ఆటో ఫ్రీడమ్ బుకింగ్స్‌లోనూ దుమ్మురేపింది. ఈ కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 9.5 ps శక్తిని 9.7 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ బజాజ్ బైక్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో ఫ్రీడమ్ సీటు కింద 2 కిలోల సీఎన్‌జీ సిలిండర్‌ని అందిచారు. రెగ్యూలర్‌గా ఉండే స్థానంలో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ సీటు కొంచెం ముందుంది. ఈ బైక్ సీఎన్‌జీ ట్యాంక్‌ని 11 సేఫ్టీ టెస్ట్‌ల్లో పరీక్షించారు. ఈ టెస్ట్‌లో బైక్ ఎటువంటి ఇబ్బందులకు గురికాలేదు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఈ బైక్‌ని డిజైన్ చేశారు.

ఈ బైక్ 330 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. సీఎన్‌జీతో నడుస్తున్నప్పుడు, ఒక కిలో సీఎన్‌జీకి 102 కిలోమీటర్ల వరకు మైలేజ్, పెట్రోల్ మోడ్‌లో ఫ్రీడమ్ 65 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ మీ రోజువారీ డ్రైవింగ్ ఖర్చులను 50 శాతం తగ్గిస్తుంది. CO2 ఉద్గారాలను 26 శాతం తగ్గించనుంది. అందువల్ల ఈ బైక్ పర్యావరణ హితంగా ఉంటుంది.
ప్యూర్ పెట్రోల్ 125 సీసీ మోటార్ సైకిల్‌తో పోలిస్తే 5 సంవత్సరాలలో రూ .75,000 వరకు ఇంధన ఖర్చులను ఆదా చేయవచ్చు. ఈ బైక్‌ని రూ.1,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీడమ్ బైక్ డ్రమ్, డ్రమ్ ఎల్‌ఈడీ, డిస్క్ ఎల్ఈడీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

దీని ప్రారంభ వేరియంట్ ధర రూ .95,000 అలాగే టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ .1.10 లక్షలుగా ఉంది. ఈ బజాజ్ సీఎన్‌జీ స్పోర్టీ స్టైలింగ్, LED హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీ, గ్రాఫిక్స్‌తో కూడిన డ్యూయల్ కలర్ స్కీమ్, ఫస్ట్-ఇన్-క్లాస్ లింక్డ్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఈ బైక్ బ్రేకింగ్ ఆల్ డ్రమ్ వేరియంట్ డిస్క్ బ్రేక్ సెటప్‌తో లభిస్తుంది.
ప్రస్తుతం కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ డెలివరీలు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలు దశలవారీగా డెలివరీలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి ఇంకో రెండు వారాల్లో రానుంది. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ మోటార్ సైకిల్‌ని పైన చెప్పిన విధంగా ఫ్రంట్ కొలిషన్ టెస్ట్ ట్రక్ ఓవర్ రన్ టెస్ట్, ఫ్రంట్ కొలిషన్ టెస్ట్, 1.5 టన్నుల బరువున్న వస్తువుపై పరీక్షించారు.


Click it and Unblock the Notifications








