CNG బైక్ హా మజాకా.. కొనేందుకు ఎగబడుతున్న జనం.. వారం రోజుల్లోనే అన్ని బుకింగ్స్ ఏంట్రా బాబు!
ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ని బజాజ్ ఆటో (Bajaj Auto) విడుదల చేసింది. ఈ బైక్‌ని ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ (Bajaj Freedom 125 CNG) పేరుతో మార్కెట్‌లోకి వచ్చింది. కేవలం రూ. 95,000 ప్రారంభ ధరతో ఈ బైక్‌ని విడుదల చేయడం గమనార్హం. ఈ బైక్ డ్యూయల్ ఫ్యూయల్ ట్యాంక్ (పెట్రోల్, సీఎన్‌జీ)తో వస్తుంది. సీఎన్‌జీ 2 కిలోల సిలిండర్ మరియు పెట్రోల్ కోసం 2-లీటర్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. ఈ బైక్ ఇప్పుడు బుకింగ్స్‌లో దూసుకుపోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సాధించింది. దేశవ్యాప్తంగా టాప్ టూవీలర్ తయారీదారుల్లో ఒకటిగా ఉన్న బజాజ్ ఆటో జూలై 5న ఈ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ని విడుదల చేసింది. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ పవర్‌ట్రైన్‌తో తీసుకు వస్తుండటంతో దీనిపై అంచనాలు అమాంతం పెరిగాయి. తక్కువ నిర్వహణ ఖర్చుతో ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే ఇది బెస్ట్ ఆప్షన్‌గా ప్రవేశపెట్టింది.

ఫ్రీడమ్ 125ని అధికారికంగా భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం దాదాపు 30,000 మందికి పైగా దీనిని కొనేందుకు ఆసక్తిని కనబరిచారని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ సీఎన్‌జీ బైక్ కోసం ఇప్పటికే 6,000 బుకింగ్స్ వచ్చాయని బజాజ్ ఆటో అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ జూలై 18న ప్రారంభమయ్యాయి. రూ.1,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బైక్‌ని రిజర్వ్ చేసుకోవచ్చు.
బజాజ్ ఆటో ఫ్రీడమ్ సీఎన్‌జీ బైక్‌ని మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఎంట్రీ లెవల్ డ్రమ్ వేరియంట్ ధర రూ.95,000 కాగా, మిడ్ వేరియంట్ డ్రమ్ ఎల్ఈడీ ధర రూ.1.05 లక్షలు, టాప్ ఎండ్ డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ ధర మరో రూ.1.10 లక్షల వద్ద విడుదల చేసింది. ఇవన్నీ (ఎక్స్-షోరూమ్) ధరలు.

ఫ్రీడమ్ ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లో ముందు మరియు వెనుక చక్రాలలో డ్రమ్ బ్రేకులు, హాలోజెన్ హెడ్‌లైట్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ నిర్వహణ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ఉంది. ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు లేవు. టాప్ ఎండ్ డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ ముందు భాగంలో 240 mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.
ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఫుల్ LCD ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ 125 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 9.4 bhp శక్తిని మరియు 9.7 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కిలో సీఎన్‌జీకి 102 కిలోమీటర్లు, పెట్రోల్‌తో నడుస్తున్నప్పుడు లీటరుకు 64 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని బజాజ్ తెలిపింది.

రెండు ఇంజిన్ల ఫుల్ ట్యాంక్‌పై 330 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇతర పెట్రోల్ బైక్స్‌తో పోల్చితే నెలవారిగా రూ .1,800 వరకు ఆదా చేయగలరు. ఈ బైక్‌పై ఉన్న భయాలను తొలగించడానికి, బజాజ్ ఆటో 11 రకాల క్రాష్ టెస్టులకు నిర్వహించింది. అన్నింట్లోనూ ఈ బైక్ సత్తా చాటింది. ఈ బైక్ ఏడు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








