ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ని తెగ కొనేస్తున్నారు.. 330 కి.మీ మైలేజీ, ధర కేవలం రూ. 95,000 మాత్రమే!

ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్‌కి జనాలు బ్రహ్మరథం పాడుతున్నారు. బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 సీఎన్‌జీ బైక్‌ని అక్టోబర్‌లో భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. బజాజ్‌ ఆటో నుంచి ఇప్పటికే పేరొందిన పల్సర్ సేల్స్‌లో నంబర్‌ 1గా ఉండగా.. ఇప్పుడు బజాజా సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌కి కూడా అంతే మొత్తంలో డిమాండ్‌ లభిస్తోంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌తో నడిచే ప్రపంచంలోనే తొలి మోటార్ సైకిల్ కావడం భారీ మైలేజీ అందిస్తుండటంతో జనాలు ఈ బైక్‌ని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చాలా ఏళ్ల రీసెర్చ్‌ తర్వాత బజాజ్ ఈ బైక్‌ని విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో సీఎన్‌జీ బైక్‌ని ఈ ఏడాది జూలైలో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ బైక్‌ సేల్స్‌లో దూసుకెళ్తుంది.

అయితే కేవలం సీఎన్‌జీతో మాత్రమే కాకుండా పెట్రోల్‌తోనూ నడుస్తుంది. అందువల్ల దీనిని బై-ఫ్యూయల్ మోటార్ సైకిల్ అని పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని బజాజ్‌ షోరూమ్స్‌కి ఈ బైక్‌ని చేర్చడంతో జనాలు కొనేందుకు ముందుకు వచ్చారు. ఫ్రీడమ్ 125 ఇప్పటి వరకు లేని విధంగా అక్టోబర్ నెలలో ఆల్ టైమ్ రికార్డు అమ్మకాలను సాధించింది. వాహన్ డేటా ప్రకారం సీఎన్‌జీ బైక్‌ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..

Bajaj Freedom 125 CNG Bike Latest News

నవంబర్ 4 నాటికి మొత్తం 20,942 యూనిట్ల సీఎన్‌జీ బైక్స్‌ అమ్ముడయ్యాయి. ఇందులో జూలై చివరి రెండు వారాల్లో 272 యూనిట్లు, ఆగస్టులో 4,111 యూనిట్లు, సెప్టెంబర్‌లో 4,937 యూనిట్లు, అక్టోబర్‌లో భారీ మొత్తంలో 11,041 యూనిట్లు, నవంబర్ మొదటి మూడు రోజుల్లో 581 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ముందుగా ఈ సీఎన్‌జీ బైక్స్ డెలివరీలను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రమే చేశారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా మార్కెటింగ్ ప్రారంభించడంతో జనాలు దీని కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ మోటార్ సైకిల్ ప్రస్తుతం భారతదేశంలోని 77 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ సీఎన్‌జీ, పెట్రోల్‌ బైక్‌ 125 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

Bajaj Freedom 125 CNG Bike Price

ఈ బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్ వేరియంట్‌ రూ .95,000, డ్రమ్ LED వేరియంట్‌ రూ .1.05 లక్షలు, డిస్క్ LED రూ .1.10 లక్షలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్‌ షోరూమ్‌ ధరలు మాత్రమే. ఇక ఈ బైక్‌ ఇతర రెగ్యూలర్‌ బైక్స్‌తో పోలిస్తే ఫ్రీడమ్ బైక్‌ మీ ఖర్చును 50 శాతం వరకు తగ్గిస్తుంది.

ఇందులోని 2 కిలోల కెపాసిటీ ఉన్న సీఎన్‌జీ ట్యాంక్‌ 200 కిలోమీటర్లకు పైగా మైలేజీని.. రెండు లీటర్ల కెపాసిటీ ఉన్న పెట్రోల్ ట్యాంకు మోడ్‌లో 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది. రెండు ఫ్యూయల్‌ ఆప్షన్స్‌లో ఈ బైక్‌ 330 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మోనో లింక్డ్ సస్పెన్షన్ సిస్టమ్, పొడవైన సౌకర్యవంతమైన సింగిల్-పీస్ సీటు, LED హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ స్పీడోమీటర్లు ఉన్నాయి.

Bajaj Freedom 125 CNG Bike Fuel Tank

ఈ బైక్‌లోని వృత్తాకార హెడ్ లైట్, కాంపాక్ట్ ఫ్యూయల్ ట్యాంక్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాండిల్ బార్ బ్రేస్, నకిల్ గార్డ్స్‌ మరింత అందాన్ని పెంచుతాయి. ఇక ఇందులో చెప్పుకోవాల్సింది స్విచ్. దీంతో సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కి మారడానికి అనుమతిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో బైక్ గరిష్ట వేగం గంటకు 93.4 కిలోమీటర్లు కాగా.. సీఎన్‌జీ మోడ్‌లో గంటకు 90.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 5, 2024, 18:27 [IST]
English summary
Bajaj freedom 125 cng bike record sales in october 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+