స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఇదే టార్గెట్!.. వాహనప్రియులకు పండగే

టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ విభాగంలో అగ్రగామిగా ఉన్న బజాజ్ ఆటో (Bajaj Auto) గత కొన్ని రోజులకు ముందు ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ ఫ్రీడమ్ 12 పేరుతో లాంచ్ చేసిన ఈ సీఎన్‌జీ బైక్ అతి తక్కువ కాలంలోనే గొప్ప ఆదరణ పొందింది. కంపెనీ ఈ బైకును జులై నెలలో లాంచ్ చేసినప్పటి నుంచి ప్రపంచంలోనే ఆటోమొబైల్ ఔత్సాహికుల ద్రుష్టి ఇటువైపు మరలింది. దీంతో మొదటి వారంలోనే దేశంలో 30000 కంటే ఎక్కువ ఎంక్వైరీలు వచ్చినట్లు సమాచారం.

ప్రారంభంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్.. దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికోసం కంపెనీ తగిన ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఆగష్టు 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం నాటికి 77 నగరాల్లో ఫ్రీడమ్ 125 బైక్ ప్రవేశపెట్టడానికి కంపెనీ సంసిద్దమవుతోంది. దీంతో భారతదేశపు మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ చాలామందికి చెరువవుతుంది తెలుస్తోంది.

Bajaj Freedom 125

నిజానికి దేశీయ మార్కెట్లో ఇప్పటి వరకు ఉన్న బైకులన్నీ కూడా పెట్రోల్ ద్వారా నడిచవే. అయితే కారు మాత్రం డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ ఇలా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే సీఎన్‌జీ విభాగంలో బైక్ లాంచ్ చేయాలనే ఆలోచన బజాజ్ కంపెనీకి కలిగింది. ఇందులో భాగంగానే కంపెనీ ఫ్రీడమ్ 125 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ రెండింటిని కలిగి ఉంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్.. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బైకులకంటే సీఎన్‌జీ బైక్ నిర్వహణ తక్కువనే చెప్పాలి. ఈ బైక్ 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్ మరియు 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ పొందుతుంది. ఈ బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ రెండింటిలోనూ ఏకంగా 330 కిమీ పరిధిని అందిస్తుందని ధృవీకరించబడింది. ఇది అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కూడా పొంది ఉంది.

Bajaj Freedom 125

బజాజ్ కొత్త ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ మోనో లింక్డ్ సస్పెన్షన్‌లు, పొడవైన సీట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, డిజిటల్ స్పీడోమీటర్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరెన్నో ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ బైక్ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. కాబట్టి దీనిని ఎక్కువమంది కస్టమర్లు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారని భావిస్తున్నాము. దేశంలో సీఎన్‌జీ విభాగంలో ఉన్న ఒకే ఒక్క బైక్ ఫ్రీడమ్ 125.

బజాజ్ సీఎన్‌జీ బైక్ విస్తరణ 77 నగరాలకు పెంచాలనే విషయం మీద బజాజ్ ఆటో లిమిటెడ్‌లో ప్రెసిడెంట్ 'సారంగ్ కనడే' మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ 125 అతి తక్కువ కాలంలోనే భారతీయులలో అపూర్వమైన ఆసక్తిని కలిగించింది. ఈ అద్భుతమైన ప్రతిస్పందన మమ్మల్ని ఎంతగానో ముగ్దుల్ని చేసింది. కాబట్టి వీలైనంత వేగంగా ఈ బైకును మరింత మంది వాహన వినియోగదారులకు చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

Bajaj Freedom 125

త్వరలో జరగనున్న భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 77 పట్టణాల్లో బజాజ్ ఫ్రీడమ్ 125 అందుబాటులో తీసుకురానున్నట్లు సారంగ్ కనడే అన్నారు. బజాజ్ ఫ్రీడమ్ 125 అత్యంత సురక్షితమైనదని, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఫ్రీడమ్ 125 బైకును దేశంలోని అన్ని ప్రాంతాలకు తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే బజాజ్ సీఎన్‌జీ బైక్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని స్పష్టమవుతోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 31, 2024, 14:00 [IST]
English summary
Bajaj freedom 125 cng bike to be available extends in 77 cities by independence day
Read more on: #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+