టెన్షన్ ఎందుకు దండగా.. 330 కి.మీ మైలేజీ ఇచ్చే CNG బైక్ ఉండగా!!
ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. బజాజ్ ఆటో ఈ బైక్ జూలై 5న విపణిలోకి విడుదల చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ బైక్‌ని సంస్థ డెలివరీ చేస్తుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ బైక్ మిడిల్ క్లాస్ వాళ్ల ఖర్చులను భారీగా తగ్గించనుంది. మీరు ఈ బైక్‌ని సరిగ్గా నడిపితే సగానికి సగం ఇధనం ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఈ బైక్ ఉత్తమ మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న పెట్రల్ బైక్స్‌తో పోల్చితే మీకు కలిసి వస్తుంది. అయితే ఈ బైక్‌ని సరైన విధానంలో నడపాలి. అప్పుడే మీకు మంచి మైలేజీ వస్తుంది. అసలు ఈ బైక్ ఎంత మైలేజీ ఇస్తుంది? మీరు అనుసరించాల్సిన కీలక విషయాలు ఈ కథనంలో..
ఈ బైక్‌లో రెండు కిలోల సీఎన్‌జీ ఇంధనంతో కూడిన కిట్, 2 లీటర్ల కెపాసిటీ కలిగిన పెట్రోల్ ట్యాంక్ కలదు. పెట్రోల్, సీఎన్‌జీ రెండు మోడ్‌లు కలిపి 330 కిలోమీటర్ల రేంజ్ (మైలేజీ)ని అందిస్తాయి. కేవలం సీఎన్‌జీ మోడ్‌లో 213 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. పెట్రోల్ ట్యాంక్ 117 కిలోమీటర్ల మైలేజీ అందించనుంది. CNG ఫ్యూయల్ లోడ్ చేసేటప్పుడు పంపుల్లో సరైన గ్యాస్ ప్రెజర్ ఉందో లేదో చూసుకుని నింపాలి.

సీఎన్‌జీ పంపులు సాధారణంగా 200-250 పీడనాన్ని కలిగి ఉంటాయి. కొన్ని పంపులలో 180-190 పీడనం మాత్రమే ఉంటుంది. ఎక్కువ పీడనం ఉన్న ఇంధనాన్ని ఫిల్ చేయడం వల్ల మంచి మైలేజీ వస్తుంది. అలా ఉంటే ఎక్కువ గ్యాస్ వస్తుంది. కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించడానికి సహాయపడుతుంది. బజాజ్ ఫ్రీడమ్‌ని కమ్యూటర్ మోటార్ సైకిల్‌గా నడపాలి.
మీరు బైక్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు క్రమంగా వేగాన్ని పెంచాలి. బైక్ ప్రయాణించేటప్పుడు సీఎన్‌జీ మంచి మైలేజీ రావాలంటే బ్రేకింగ్‌ని ఎక్కువగా ఉపయోగించవద్దు. ఇక టాప్ గేర్‌లో వెళ్తుంటే గంటకు 50-55 కిలోమీటర్ల వేగంతోనే నడపాలి. త్వరగా టాప్‌గేర్‌కి స్విఛ్ అయ్యేలా నడపండి. సీఎన్‌జీ పికప్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒకే వేగాన్ని మెయింటైన్ చేయడం ఉత్తమం.

సరైన పనితీరు కొరకు వాహనాన్ని సకాలంలో మెయింటెనెన్స్ చేయడం చాలా ముఖ్యం. రెగ్యులర్ ఆయిల్ మరియు ఆయిల్ ఫిల్టర్ మార్పులు చేయాలి. అదనంగా అవసరమైతే ఎయిర్ ఫిల్టర్‌ని శుభ్రం చేయాలి లేదా మార్చాలి. స్పార్క్ ప్లగ్ మంచి స్థితిలో ఉందో లేదో తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా చెక్ చేయాలి. ఇలా అన్ని సరిగ్గా ఉంటేనే బైక్ దీర్ఘకాలం మంచి మైలేజీ ఇస్తుంది.
ఇంజిన్ పవర్‌ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి సరైన టైర్ ప్రెజర్ అవసరం. తక్కువ పీడనం ఉన్న టైర్లతో బైక్‌ని నడపడానికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది. బజాజ్ ఫ్రీడమ్ ఒక మోస్తరు శక్తివంతమైన హెవీ మోటార్ సైకిల్ కాబట్టి సిఫార్సు చేయబడ్డ టైర్ ప్రెజర్ మెయింటైన్ చేయడం ద్వారా మంచి మైలేజీ పొందవచ్చు. ట్రాఫిక్‌లో ఈ బైక్ కొద్దిగా ఇంధన సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ పద్దతులన్నీ పాటిస్తే బజాజ్ ఫ్రీడమ్ బైక్ కిలో సీఎన్‌జీకి 104 కిలోమీటర్ల మైలేజీని పొందగలరు. మీ బైక్ రైడింగ్, రోడ్లు బైక్ మైలేజీపై ప్రభావం చూపవచ్చు. మీరు ఈ బైక్‌ని రెగ్యులర్ సర్వీసింగ్ చేయించడం వల్ల ఎక్కువ మైలేజీని పొందుతారు. ప్రస్తుతం కిలో సీఎన్‌జీ ధర రూ.92గా ఉంది. అంటే మీరు వంద రూపాయల లోపు ఖర్చు చేస్తే 100 కి.మీ మైలేజీ పక్కా అన్నమాట.
ఈ బైక్‌ని ధర కేవలం రూ. 95,000 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఏడు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ విడుదలకు ముందు 11 రకాల సేఫ్టీ టెస్ట్‌ని నిర్వహించారు. అన్నింట్లోనూ ఈ బైక్ సత్తా చాటింది. మంచి మైలేజీ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ బైక్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








