పెట్రోల్‌ బైక్‌ వర్సెస్‌ CNG బైక్‌ మధ్య తేడాలు.. సీఎన్‌జీ బైక్‌ మీ ఇంట్లో ఉంటే మీకు సిరుల పంటే!!

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ (Bajaj Freedom CNG 125) బైక్ నేడు విడుదలైంది. ఈ బైక్‌ తక్కువ బడ్జెట్‌తో పాటు ఎకో ఫ్రెండ్లీ కమ్యూటింగ్ సొల్యూషన్స్‌తో ముందుకు వచ్చింది. ఇది పెట్రోల్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) రెండింటితో నడిచే డ్యూయల్ ఇంజిన్‌ ఆప్షన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. మంచి మైలేజీ, తక్కువ ధరలో బైక్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ బైక్‌ బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. బైక్‌ డెలవరీలు కూడా మహారాష్ట్ర, గుజరాత్‌లో ప్రారంభం అయ్యాయి. అతి త్వరలోనే మిగతా రాష్ట్రాల్లోనూ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. తాజాగా విడుదలైన ఈ బైక్‌లో ముఖ్యంగా 5 కీలకమైన అంశాలు మీకోసం..

డ్యూయల్ ఫ్యూయల్ కెపాసిటీ: బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ పెట్రోల్‌తోనూ నడుస్తుంది. ఇది రైడర్ల లాంగ్‌ జర్నీకి అనువుగా ఉండనుంది. ఈ డ్యూయల్‌ ఫ్యూయల్‌ ఇంజిన్ మన ఖర్చుకి తగినట్లుగా అందుబాటులోని ఇంధనాన్ని ఎంచుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. దీంతో సుదూర ప్రాంతాలకు సైతం ఈ బైక్‌పై ఎటువంటి ఆందోళన లేకుండా ప్రయాణించవచ్చు. ఇది మీ రవాణా ఖర్చులను తగ్గిస్తుంది.

Bajaj-Freedom125-CNG-Bike-Advantages

మైలేజీ: ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ అసాధారణమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణానికి మరియు సుదూర ప్రయాణాలకు చాలా చౌకగా ఉంటుంది. ఈ ద్విచక్ర వాహనం 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. సీఎన్‌జీతో ఆపరేట్ చేస్తే కిలోమీటరుకు రూ.1, పెట్రోల్‌తో ఆపరేట్ చేస్తే కిలోమీటరుకు రూ.2.25 రన్నింగ్ ఖర్చు అవుతుంది.

ఎకో ఫ్రెండ్లీ: ద్విచక్ర వాహన విభాగంలో పర్యావరణ అనుకూల టూవీలర్స్‌కి ఇది ప్రత్యామ్నాయంగా నిలువనుంది. సాంప్రదాయ పెట్రోల్ ఇంజిన్‌లతో పోలిస్తే సీఎన్‌జీ తక్కువ స్థాయి కాలుష్య కారకాలను విడుదల చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఇది పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి మరియు పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛమైన గాలి నాణ్యతకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా సీఎన్‌జీ పెట్రోల్ కంటే 26.7% తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తుంది.

Bajaj-Freedom-125-Bike-Advantages

ధర: బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్‌ వినియోగదారులకు అందుబాటు ధరలో అందించిది. ఈ సీఎన్‌జీ ఇంధనంతో తక్కువ నిర్వహణ ఖర్చులతో కలిపి, రోజు వారి ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు ఈ బైక్‌ దోహదం చేస్తుంది. బడ్జెట్‌లో బైక్‌ కొనుగోలు చేసేవారికి ఇది మంచి ఎంపికగా అవుతుంది. ఈ బైక్‌ ప్రారంభ రూ.95,000, నుంచి రూ.1.10 లక్షల వరకు ఉంది. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

డిజైన్: బజాజ్ ఫ్రీడమ్ చాలా ఫ్రెష్ బాడీ మరియు డిజైన్‌తో వస్తుంది. రౌండ్‌ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, షార్ప్ లుక్ ట్యాంక్‌ డిజైన్ కోసం కొత్త విధానాన్ని అనుసరించింది. ఇందుకోసం పొడవైన సీటును అందించారు. సీటు కింద స్థలాన్ని 2 కిలోల సీఎన్‌జీ ట్యాంక్‌కి కేటాయించారు. దాని డిజైన్ ఇతర సాంప్రదాయ బైక్స్‌ కంటే భిన్నంగా ఉంటుంది.

Bajaj-Freedom-125-CNG-Bike-Top-Features

ఇంజిన్ & టెస్టింగ్: బజాజ్ ఫ్రీడమ్‌లో 125సీసీ ఇంజిన్‌ని ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9.37bhp పవర్ 9.7nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ని అన్ని విధాలా పరీక్షించిన తర్వాతే మార్కెట్‌లో విడుదల చేశారు. దీనిని 11 రకాల క్రాష్‌ టెస్ట్‌లను నిర్వహించారు. దీంతో ఎలాంటి పరిస్థితుల్లోనూ సీఎన్‌జీ కిట్‌ దెబ్బతినకుండా ఉంటుంది. కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించేందుకు ఈ క్రాష్‌ టెస్ట్‌ వీడియోలను విడుదల చేశారు.

ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ కావడం.. ఎక్కువ లాభాలు (మైలేజీ, నిర్వహణ ఖర్చు, ధర) ఉండటంతో ఈ బైక్‌ని కొనేందుకు జనాలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. రేపటి నుంచి ఈ బైక్‌ వినియోగదారులతో పాటు ఆటోమోబైల్‌ ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బైక్‌లోని అడ్వాంటేజెస్‌ పెట్రోల్‌ బైక్స్‌లో ఉండవు. దీంతో రానున్న రోజుల్లో సీఎన్‌జీ బైక్స్‌తో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలను జనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, July 5, 2024, 17:59 [IST]
English summary
Bajaj freedom 125 cng top 5 advantages than regular motorcycles full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+