యూత్‌కు పండగే.. పిచ్చెక్కిస్తున్న కొత్త పల్సర్.. రూ.90వేలకే కనీవినీ ఎరుగని ఫీచర్లు
ఇండియా మార్కెట్లోకి గతంలో బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన పల్సర్( Pulsar) మోడల్‌కు మంచి ఆదరణ ఉంది. సగం మంది యువత ఈ బైక్‌ను చాలా ఇష్టంగా కొనుగోలు చేశారు. గత కొన్నేళ్లుగా పల్సర్ అమ్మకాలు బజాజ్ కంపెనీ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొత్తగా పల్సర్ N125(Pulsar N125)మోడల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ బైక్‌ను కంపెనీ గత కొంత కాలంగా పరీక్షిస్తుంది. అన్నిటెస్ట్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదలకు సిద్ధంగా ఉంది. పాత మోడళ్లతో పోలిస్తే, దీనిలో సరికొత్త ఫీచర్లను అందించారు.
బజాజ్ పల్సర్ N125(Bajaj Pulsar N125)డిజైన్, లుక్ మొత్తం కూడా అధునాతనంగా ఉంటుంది. ఇది 125cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 11.8 PS వద్ద 10.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. పాత వాటితో పోలిస్తే ఈ కొత్త N పల్సర్ ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. దీనిలో కొత్త ఛాసిస్‌ను కూడా అందించారు.

బైక్ సస్పెన్షన్ సెటప్ పరంగా ముందు స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా బైక్ అన్నిరకాల రోడ్లపై కూడా సులువుగా ప్రయాణిస్తుంది. ముఖ్యంగా ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతంలో కూడా సాఫీగా ప్రయాణించేలా సస్పెన్షన్ ఉపయోగపడుతుంది. స్పీడ్‌ను కంట్రోల్ చేయడానికి పల్సర్ N125 బేస్ వేరియంట్‌లో ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ కాంబినేషన్ ఉంటుంది.
అయితే టాప్ వేరియంట్‌లో మాత్రం ముందు, వెనుక వీల్స్‌కు రెండు చివరలలో డిస్క్ బ్రేక్‌లను అందించవచ్చని సమాచారం. ఇది సింగిల్-ఛానల్ ABS సిస్టంను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ బైక్‌లో రైడింగ్ వివరాలను తెలుసుకోడానికి యాప్ కనెక్టివిటీని అందించారు. ఈ సదుపాయం ద్వారా రైడర్లు తమ ప్రయాణ దూరం వివరాలను తెలుసుకోవచ్చు.
ఇంకా, బైక్‌లో ఉన్న డిజిటల్ డిస్‌ప్లే ద్వారా రైడర్లు, తమ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే SMSలు, మిస్డ్ కాల్ నోటిఫికేషన్‌లు, కాల్స్‌ను చూడవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ రైడర్లకు బాగా ఉపయోగపడుతుంది. యాప్‌లో బైక్ రైడింగ్‌కు సంబంధించిన సూచనలు, చిట్కాలు చూడటంతో పాటు, ఇతర మాన్యువల్‌ను కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బైక్‌లో టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్ ఉందో లేదో ఇంకా తెలియరాలేదు. లాంచ్ టైంలో దీని గురించి తెలుస్తుంది.
స్పోర్టీ లుక్‌తో వస్తున్న పల్సర్( Pulsar)N125 ముందు డిస్‌ప్లేలో పెట్రోల్ ఎంత వరకు ఉందో తెలుసుకోవడంతో పాటు, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇంకా రైడర్లు తమకు అవసరమయ్యే ఇతర వివరాలను సైతం చూడవచ్చు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో సరికొత్త అనుభూతిని పొందుతారని కంపెనీకి చెందిన పలువురు అధికారులు చెప్పారు. ఈ బైక్‌ను సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందించడానికి తయారు చేశారు.
ఇందులో వెడల్పుగా, లాగి-వెనుకకు ఉన్నట్లుగా ఉండే హ్యాండిల్‌బార్, సెంట్రల్‌గా మౌంట్ చేయబడిన ఫుట్ పెగ్‌లు ఉన్నాయి. ఇప్పటికే బజాజ్ పల్సర్‌పై యువతలో భారీ క్రేజ్ ఉంది. కొత్త LED హెడ్‌ల్యాంప్, సొగసైన పెట్రోల్ ట్యాంక్, పలు అధునాతన ఆప్షన్లతో కొత్త పల్సర్‌ను అందిస్తున్నట్లు సమాచారం బయటకు రావడంతో ఎప్పుడెప్పుడు బైక్ మార్కెట్లోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
ఈ బైక్‌ను అనేకసార్లు పరీక్షించారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త ఫీచర్లతో వస్తున్న పల్సర్ N125, ఇతర కంపెనీల మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. నివేదికల ప్రకారం, పల్సర్ N125 అంచనా ధర రూ. 90,000 నుంచి రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇది TVS రైడర్ 125, Hero Xtreme 125R వంటి మోడళ్లతో పోటీ పడుతుందని మార్కెట్ వర్గాల వారు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








