రూ. 94,707 లకే కొత్త 'పల్సర్ N125' లాంచ్.. స్టోర్టీ డిజైన్, ఎత్తు తక్కువ ఉన్న వాళ్లు కూడా కొనవచ్చు!
బజాజ్ ఆటో లిమిటెడ్ పాపులర్ పల్సర్ N125 (Pulsar N125) బైక్‌ని నేడు అధికారికంగా విడుదల చేసింది. N సిరీస్‌లో ఈ కొత్త మోటార్‌సైకిల్ ఆధునిక డిజైన్, స్పోర్టీ లుక్‌తో మార్కెట్‌లో దీనిని ప్రవేశపెట్టింది. సరికొత్త అవతారంలో వచ్చిన ఈ బైక్ యువ, రైడింగ్ ఔత్సాహికులకు విపరీతంగా నచ్చుతుంది. 2001లో పల్సర్ బైక్ అరంగ్రేటం చేసినప్పటీ నుంచి భారతదేశం స్పోర్ట్స్ మోటార్ సైక్లింగ్ విభాగంలో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. దీని విలక్షణమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ ఫర్ఫామెన్స్‌తో రైడర్లకు మరింత చేరువ అయ్యింది. పల్సర్ N సిరీస్‌లో సరికొత్త స్టైలింగ్, రిఫైనింగ్, అత్యాధునిక టెక్నాలజీతో బైక్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా మరో 125సీసీ బైక్‌ని బజాజ్ తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..
ప్రస్తుతం 125 సీసీ విభాగంలో టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125), హీరో ఎక్స్‌ట్రీమ్ 125R (Hero Xtreme 125R) మోటార్ సైకిల్స్ స్పోర్టీ లుక్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో మరింత పోటీని పెంచేందుకు పల్సర్ ఎన్ సిరీస్‌లో కొత్త 125 మోటార్‌సైకిల్‌ని నేడు మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను కేవలం రూ .94,707 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. బ్లూటూత్- ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్ అమర్చిన LED డిస్క్ BT వేరియంట్ ధర రూ .98,707 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే బేస్ LED డిస్క్ ధర రూ .94,707 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ కొత్త బజాజ్ 125సీసీ పల్సర్ లైనప్స్‌లోని క్లాసిక్ పల్సర్ 125 కి బిగ్ వెర్షన్‌గా అలాగే NS 125 కంటే దిగువన ఉంటుంది.
ఈ బైక్ డిస్క్ బీటీ వేరియంట్ ఎబోనీ బ్లాక్, కాక్టెయిల్ వైన్ రెడ్, ప్యూటర్ గ్రే సిట్రస్ రష్ వంటి కలర్ ఆప్షన్స్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బేస్ ఎల్ఈడీ డిస్క్ వేరియంట్ పర్ల్ మెటాలిక్ వైట్, ఎబోనీ బ్లాక్, కాక్టెయిల్ వైన్ రెడ్, కరీబియన్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఇది సరికొత్త రీఫ్రెషింగ్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. షార్ప్ హెడ్‌లైట్‌తో ముందు నుంచి స్పోర్టీ లుక్‌తో ఉంటుంది.

ఈ పల్సర్ కొత్త బైక్ 124.58 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8,500 rpm వద్ద 12 ps పవర్‌ని 6,000 rpm వద్ద 11 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ అద్భుతమైన పవర్-టు-వెయిట్ రేషియో ద్వారా వేగవంతమైన శక్తిని అందుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇది దాని సెగ్మెంట్‌లోనే అతి తక్కువ సమయంలో గంటకు 0 నుండి 60 కి.మీ అందుకుంటుంది.
ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) కలిగి ఉన్న మొదటి పల్సర్ ఇదే కావడం విశేషం. ఈ కొత్త N 125 కాంపాక్ట్ డిజైన్ పదునైన టర్నింగ్ రేడియస్ నగర ట్రాఫిక్‌ని సులభంగా నావిగేట్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇది కేవలం 125 కిలోల బరువుతో మాత్రమే వస్తుంది. దీంతో కఠినమైన రోడ్లలోనూ సులువుగా ప్రయాణించేందుకు దోహదపడుతుంది.

ఇది 795 మిల్లీమీటర్ల తక్కువ సీట్‌తో వస్తుంది. దీంతో రైడర్లు సులభంగా నేలపై బ్యాలెన్సింగ్ చేయవచ్చు. అలాగే 198 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో అడ్డంకులను అధిగమించడానికి సహాయపడుతుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ మేనేజ్‌మెంట్, మెసేజ్ అలర్ట్స్‌తో కూడిన పూర్తి డిజిటల్ LCD కన్సోల్‌తో వస్తుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ద్వారా మెరుగైన విజిబిలిటీని పొందవచ్చు.
ఇక రియర్ మోనో-షాక్ సస్పెన్షన్, ఫ్రంట్ ఫోర్క్ కవర్స్, RSU టెలిస్కోఫిక్ ఫోర్క్స్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. సింగిల్ ఏబీఎస్ ఛానల్, కాంబీ బ్రేక్ సిస్టమ్ మెరుగైన బ్రేకింగ్ సామార్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ బైక్ ఇతర పల్సర్ బైక్స్‌తో పోల్చితే దాదాపు 60-65 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కోంది.


Click it and Unblock the Notifications








