రికార్డులను సృష్టించడానికి వస్తున్న బజాజ్ పల్సర్ N125

దేశీయ దిగ్గజ కంపెనీ బజాజ్ దీపావళికి ముందు మార్కెట్లోకి తన సంచలన బైక్ పల్సర్( Pulsar)మోడల్‌లో N125ను ఆవిష్కరించింది. ఇండియాలో పల్సర్‌కు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా యువత ఈ బైక్‌ను ఎక్కువగా ఇష్టపడుతారు. దీంతో తన అమ్మకాలను భారీగా పెంచుకుని మంచి ఆదాయాన్ని పొందడానికి, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 125cc బైక్‌గా అవతరించడానికి పల్సర్ N125(Pulsar N125)ను ఆవిష్కరించింది. ఈ బైక్‌ను కంపెనీ గత కొంత కాలంగా టెస్ట్ చేయగా ఎట్టకేలకు దీనికి సంబంధించిన ఫీచర్లు,స్పెసిఫికేషన్ల వివరాలను వెల్లడించింది. పల్సర్ పాత మోడళ్లతో కొత్త దానిలో సరికొత్త ఫీచర్లు అందించారు. దీని డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

ఇంజిన్-సామర్థ్యం: పల్సర్ N125 బైక్ 125cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. 11.8bhp వద్ద 11Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్ అవుట్‌పుట్ పరంగా NS125 మాదిరిగానే ఉన్నప్పటికీ, N125 తేలికైనది. అయితే దీని ఇంజిన్ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. ఛాసిస్ కూడా కొత్తది.

Bajaj Pulsar N125 Side

బైక్ సస్పెన్షన్ పరంగా, ముందు RSU టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనో-షాక్ సస్పెన్షన్ సిస్టమ్‌ను అందించారు. ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతంలో కూడా సాఫీగా ప్రయాణించేలా సస్పెన్షన్ బాగా సెట్ అవుతుంది. బేస్ వేరియంట్లలో ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేకింగ్ సిస్టం ఉంది. అదే, టాప్ వేరియంట్‌లో ముందు, వెనుక వీల్స్‌కు రెండు చివరలలో డిస్క్ బ్రేక్‌లను అందించారు. స్పీడ్‌ను కంట్రోల్ చేయడానికి సింగిల్-ఛానల్ ABS సిస్టం‌ కూడా ఉంది.

దీని డిజైన్ కూడా లగ్జరీ బైక్ లుక్‌ను అందిస్తుంది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్‌తో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ ఫీచర్లు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. బైక్‌లో రైడింగ్ వివరాలను తెలుసుకోడానికి యాప్ కనెక్టివిటీని అందించారు. ఈ ఫీచర్ ద్వారా రైడర్‌లు తమ ప్రయాణ దూరం వివరాలను తెలుసుకోవచ్చు.

Bajaj Pulsar N125 Front

చీకట్లో కూడా బైక్‌ను సురక్షితంగా డ్రైవింగ్ చేయడానికి LED హెడ్‌లైట్‌లు ఉన్నాయి. ముందు డిస్‌ప్లేలో పెట్రోల్ ఎంత వరకు ఉందో తెలుసుకోవడంతో పాటు, గేర్ పొజిషన్ ఇండికేటర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో రైడర్లు తమకు అవసరమయ్యే ఇతర వివరాలను సైతం చూడవచ్చు. పాత మోడళ్లలో ఇలాంటి ఫీచర్ అందుబాటులో లేదు. కానీ N125లో మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా రైడర్ల అభిరుచులకు అనుగుణంగా దీనిని అందించారు.

ఫాక్స్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్‌తో డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంది. స్ప్లిట్ సీట్లు, సిల్వర్ -కలర్ గ్రాబ్ రైల్, ఆల్-డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. పెట్రోల్ ట్యాంక్ డిజైన్ కూడా సరికొత్తగా ఉంటుంది. ప్రధానంగా దాని గ్రాఫిక్ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది. రైడింగ్‌లో ఇతర వాహనాలకు సైడ్ సిగ్నల్ ఇవ్వడానికి వెనుక టెయిల్ లైట్లు కూడా ఇతర పల్సర్‌ల మాదిరిగానే ఉన్నాయి.

Bajaj Pulsar N125 Launch

రైడర్ కూర్చునే సీటు భాగం కొంచె వంపుతో కూడిన విధంగా ఉంటుంది. వెడల్పుగా, లాగి-వెనుకకు ఉన్నట్లుగా ఉండే హ్యాండిల్‌బార్ సులువుగా పట్టుకునేలా బైక్‌పై పూర్తి స్థయిలో గ్రిప్ అందించేలా పల్సర్ N125 సీటింగ్‌‌ను డిజైన్ చేశారు. ఈ బైక్‌ను సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందించడానికి తయారు చేశారు.

ఇప్పటికే బజాజ్ పల్సర్‌పై యువతలో భారీ క్రేజ్ ఉంది. కొత్త LED హెడ్‌ల్యాంప్, అదిరిపోయే గ్రాఫిక్ డిజైన్‌తో పెట్రోల్ ట్యాంక్, పలు అధునాతన ఆప్షన్లతో కొత్త పల్సర్‌ను ఆవిష్కరించినట్లు కంపెనీ ప్రకటించడంతో కొనుగోలుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అమ్మకాల్లో ఈ బైక్ రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.

Bajaj Pulsar N125 Cover

N160,N250 తర్వాత N లైనప్‌లో పల్సర్ N125 మూడవ బైక్ అవుతుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125R, TVS రైడర్ 125 వంటి బైక్‌లకు పల్సర్ N125 గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నివేదికల ప్రకారం, పల్సర్ N125 అంచనా ధర రూ. 95,000 నుంచి రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని సమాచారం.

More from DriveSpark

Article Published On: Friday, October 18, 2024, 12:54 [IST]
English summary
Bajaj pulsar n125 unveiled engine and all features check in telugu
Read more on: #bajaj pulsar #diwali #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+