'కొత్త పల్సర్ N125' ధర వింటే కొనాలనిపిస్తుంది.. కానీ ముందు ఈ బైక్‌లో కొత్తగా ఏముందో కచ్చితంగా తెలుసుకోవాలి!
యూత్‌లో పల్సర్ బైక్ అంటే క్రేజ్ ఎక్కువ. దీని సుపరిచితమైన డిజైన్, ఫర్ఫామెన్స్ వల్ల యువత ఎక్కువగా ఈ బైక్‌ని కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా బజాజ్ న్యూ జనరేషన్ N సిరీస్ పల్సర్లతో మార్కెట్‌లో సరికొత్త వ్యూహాంతో అడుగుపెడుతోంది. తాజాగా N సిరీస్‌లో బేబీ పల్సర్‌ని మార్కెట్‌లో విడుదల చేసింది. రెండు రోజుల క్రితం మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ పల్సర్ N 125 మోటార్ సైకిల్ విభాగంలో స్పోర్టీ లుక్‌తో వస్తుంది. ఈ బైక్ టాప్ ఫీచర్లు, దాని డిజైన్‌కి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
కొత్త పల్సర్ N 125 కొత్త ఛాసిస్, డిజైన్, ఇంజిన్ కలయికతో మార్కెట్‌లో అడుగుపెట్టింది. తక్కువ ధరలో లభించే ఈ కమ్యూటర్ స్పోర్ట్ బైక్ LED డిస్క్, LED డిస్క్ బీటీ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే రెండు వేరియంట్ల మధ్య కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. ముందుగా ఈ బైక్ కొనాలని ఫిక్స్ అయితే ముందుగా ఈ రెండింటీ మధ్య వ్యత్యాసాలు కస్టమర్లు కచ్చితంగా తెలుసుకోవాలి.

LED డిస్క్: ఈ బేస్ వేరియంట్ బజాజ్ పల్సర్ N 125 ధర రూ .94,707 (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. టాప్ వేరియంట్‌తో పోలిస్తే ఇది రూ.4,000 తగ్గింపుతో వస్తుంది. ఇందులో షార్ప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇది రెండు వేరియంట్లలో ఒకేలా ఉంటుంది. దీని ముందు భాగం 240 mm డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.
ఈ LED డిస్క్ వేరియంట్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్‌కి బదులుగా సెమీ-డిజిటల్ LCD స్క్రీన్‌ని అందించింది. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టెయిల్ లైట్స్, న్యూట్రల్ ఇండికేటర్, సైడ్-స్టాండ్ పొజిషన్, ఫ్యూయల్ గేజ్ వంటి సమాచారాన్ని అందిస్తుంది. ఈ బేస్ మోడల్ 100/90 R 17 చిన్న సైజ్ వెనుక టైర్, బీటీ వేరియంట్‌లో 110/80 ఆర్ 17 పరిమాణంతో పెద్ద టైర్ కలదు.

LED డిస్క్ బీటీ: దీని ధర రూ.98,707 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. దీనికి అదనంగా చెల్లించే రూ.4,000 ఫీచర్లతో ఈ బైక్ స్మార్ట్‌గా మారుతుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇది టర్న్ బై నావిగేషన్ రాకపోయినా కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ పొందొచ్చు.
ఇక పల్సర్ N 125 టాప్ వేరియంట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (iSG)తో వస్తుంది. ట్రాఫిక్‌లో ఇది మైలేజీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రెండు వేరియంట్లలోనూ 124.58 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఇది 8,500 rpm వద్ద 11.8 bhp పవర్‌ని 6,000 rpm వద్ద 11 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. క్లాసిక్ పల్సర్ 125 వెర్షన్ కంటే ఈ బైక్ 20 కిలోల బరువు తక్కువగా ఉంటుంది. ఈ పల్సర్ N 125 కమ్యూటర్ స్పోర్ట్స్ బైక్ బరువు కేవలం 125 కిలోలు మాత్రమే. ఇది 9.5-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది.
ఇందులో ఫ్రంట్ ఫోర్క్స్ కవర్స్ కొత్తగా అనిపిస్తాయి. వెనుక భాగంలో మోనోషాక్, 130 mm రియర్ డ్రమ్ బ్రేక్స్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ బైక్‌ని ఏక కాలంలో నిలువరించేందుకు సహాయపడతాయి. ఈ N 125 మార్కెట్‌లో లభించే 125 సీసీ విభాగంలోని టీవీఎస్ రైడర్, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R వంటి మోటార్‌సైకిల్స్‌కి గట్టి పోటీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








