కొత్త బజాజ్‌ N125 వర్సెస్‌ టీవీఎస్‌ రైడర్‌ 125 రెండిట్లో ఏ బైక్‌ని కొంటే బెటర్‌?

ప్రస్తుతం 125 సీసీ సెగ్మెంట్‌లో బజాజ్ పల్సర్ N 125 (Bajaj Pulsar N 125), టీవీఎస్‌ రైడర్‌ 125 (TVS Raider 125) స్పోర్టీ లుక్‌తో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు బైక్స్‌ని ఆ కంపెనీలు అత్యంత స్టైలిష్ లుక్‌తో రూపొందించాయి. తాజాగా బజాజ్‌ N సిరీస్‌లో 125 మోటార్‌సైకిల్‌ని విడుదల చేసింది. బజాజ్‌ ఎన్‌ సిరీస్‌ని మరింత చేరువ చేసేందుకు ఈ బైక్‌ని బజాాజ్‌ ప్రవేశపెట్టింది. ఇది మార్కెట్‌లో ఇదివరకే అందుబాటులో ఉన్న టీవీఎస్‌ రైడర్ 125 కు నేరుగా పోటిని ఇస్తుంది. ఈ రెండు బైక్స్‌ ధర, కంఫర్ట్, మైలేజీ, ఇతర స్పెసిఫికేషన్స్‌ పరంగా ఒకే విధంగా ఉంటాయి. మరీ ఈ బైక్‌ల మధ్య కీలక తేడాలు చూసి మీ అవసరాలకు తగినట్లుగా ఏదీ కొంటే బెటర్‌ అనేది ఈ ఆర్టికల్‌ చదివాక మీరే డిసైడ్‌ అవ్వండి.

డిజైన్: పల్సర్ N125 స్టోర్టీ డిజైన్‌తో ఫర్‌ఫెక్ట్ సిటీ బైక్‌గా ఉంటుంది. ఏరోడైనమిక్ ఫ్లోటింగ్ ఫ్రంట్, రియర్ ప్యానెల్స్ బైక్ వేగానికి తగినట్లుగా రూపొందించబడ్డాయి. ఆకర్షణీయమైన ఫ్యూయల్ ట్యాంక్ రైడర్లకు మంచి రైడింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఇక టీవీఎస్ రైడర్ టీవీఎస్ అపాచీ RTR 160 4V బైక్ నుంచి తీసుకోబడింది. ఇది కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంజిన్ కింద ఉన్న బాష్ ప్లేట్ మరింత స్పోర్టీ డిజైన్‌ని ఇస్తుంది.

Bajaj Pulsar N 125 Vs TVS Raider 125 Comparison

ఫర్ఫామెన్స్‌: పల్సర్ N 125 124.58 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 12 ps పవర్‌ని 11 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) పొందిన 125 సీసీ బైక్‌ పల్సర్‌ కావడం గమనార్హం. దీని ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెపాసిటీ 9.5 లీటర్లుగా ఉంది. ఇది లీటరుకు 55-60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని అంచనా వేయబడింది.

టీవీఎస్ రైడర్ 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 11.12 ps పవర్‌, 11.2 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది లీటరుకు 67 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది. దీనిపై అధికారిక సమాచారం ఇవ్వాల్సి ఉంది. 123 కిలోల బరువున్న ఈ బైక్ 10 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీని కలిగి ఉంది.

Bajaj Pulsar N 125 Vs TVS Raider 125 Price Comparison

ఫీచర్లు: కొత్త పల్సర్ N 125 పూర్తి డిజిటల్ LCD కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. ఫ్యూయల్ ఎకానమీ రీడింగ్స్‌తో పాటు కాల్ అలర్ట్స్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. అలాగే LED హెడ్‌ల్యాంప్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్, USB ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లు కలవు. ఇంకా ఇందులో మరెన్నో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ రైడర్ బైక్ LCD ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, కాల్‌, మెసేజ్‌ నోటిఫికేషన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీని అందిస్తుంది. సీటు కింద ఒక చిన్న కంపార్ట్ మెంట్, మీ ఫోన్‌ని ఛార్జ్ చేయడానికి USB పోర్ట్ కూడా ఉన్నాయి. సైలెంట్ స్టార్టర్, స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంజిన్ కట్ ఆఫ్ ఫంక్షన్‌తో సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది.

ధర: బజాజ్ పల్సర్ N 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 94,707 గా ఉంది. అలాగే టీవీఎస్ రైడర్ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ.89,952గా ఉంది. బజాజ్ పల్సర్ ఎన్ 125 ప్రస్తుతం 4 కలర్‌ ఆప్షన్స్, 2 విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. ఇక టీవీఎస్ రైడర్ 125 2 కలర్‌ ఆప్షన్స్‌, 5 ఢిఫరెంట్‌ వేరియంట్లలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 26, 2024, 9:20 [IST]
English summary
Bajaj pulsar n125 vs tvs raider 125 price and specifications comparison
Read more on: #auto news #comparison #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+