Bajaj Pulsar స్మార్ట్ ఫీచర్లతో బజాజ్ పల్సర్ N160, N150 లాంచ్.. ప్రత్యర్థి కంపెనీలకు ఇక చుక్కలే!!
అప్‌డేటెడ్ స్మార్ట్ ఫీచర్లతో పల్సర్ N160 మరియు పల్సర్ N150లను బజాజ్ సంస్థ విడుదల చేసింది. పూర్తిగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పల్సర్ లైనప్‌లో భారీ మార్పులు చేసింది. గతంలో పల్సర్ NS160 మరియు పల్సర్ NS200తో USD ఫ్రంట్ ఫోర్క్‌లను అందించింది. తాజాగా పల్సర్ N150 మరియు పల్సర్ N160 లలో స్మార్ట్ ఫీచర్లను తీసుకువచ్చింది.
2024 బజాజ్ పల్సర్ N160 మరియు పల్సర్ N150లు పూర్తి స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడేషన్‌తో సంస్థ ప్రవేశపెట్టింది. భారత్‌లో మధ్య తరగతి కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగంలో బజాజ్ కింగ్ మేకర్‌గా ఉంది. పల్సర్ సిరీస్ మోటార్ సైకిళ్లతో బజాజ్ మార్కెట్‌లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. 2024 బజాజ్ పల్సర్ N160 మరియు పల్సర్ N150లో కొత్త సాంకేతికతను జోడించి పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ LCD క్లస్టర్‌ని అందిస్తుంది.

బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో, బైక్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌తో పల్సర్ N160 మరియు N150తో కనెక్ట్ చేయవచ్చు. దీని ద్వారా మీరు బైక్ రైడింగ్ చేసేటప్పుడు కాల్స్‌ని యాక్సెప్ట్ మరియు డిస్కనెక్ట్ చేయవచ్చు. ఇందులో మొబైల్ నోటిఫికేషన్ అలర్ట్స్, మొబైల్ సిగ్నల్ స్ట్రెంత్ మరియు బ్యాటరీ పర్సంటేజ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పేస్ డిస్టన్స్, ఇన్‌స్టంట్ ఫ్యూయల్ ఎకానమీ మరియు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ వంటి ఫీచర్లన్ని స్మార్ట్‌గా తెలుసుకోవచ్చు.
డిజైన్ విషయానికి వస్తే, 2024 పల్సర్ N160 మరియు N150 పల్సర్ N250 మాదిరిగానే ఉంటుంది. డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. డిజైన్, ఛాసిస్ మరియు ఇతర బైక్ బయటి భాగాలు బాడీ ప్యానెల్‌లు, ప్యూయల్ ట్యాంక్ మరియు హెడ్‌ల్యాంప్ అసెంబ్లింగ్‌లు ముందు మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైక్ డిజైన్ ఇప్పటికే యూజర్లకు సుపరిచితం కావడంతో ఎటువంటి మార్పులు చేయలేదని తెలుస్తోంది.

పల్సర్ N160 యొక్క 164.82cc DTS-i ఇంజన్ 15.8 bhp శక్తిని మరియు 14.65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ నుండి సుమారు 45 కి.మీ మైలేజీ అందిస్తుందని తెలుస్తోంది. మరోవైపు, పల్సర్ N150, 149.68cc ఇంజన్ 14.3 bhp మరియు 13.5 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండు బైక్స్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌లు జత చేయబడి ఉంటాయి.
బజాజ్ బెస్ట్-ఇన్-క్లాస్ పవర్ మరియు టార్క్, బెస్ట్-ఇన్-క్లాస్ పాసింగ్ యాక్సిలరేషన్ క్షణాల్లో 30-70 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. బజాజ్ పల్సర్ N160లో N250లో అందించే ఫీచర్లు ఉన్నాయి. LED DRLలు, Bi-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు మరియు గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి ఫీచర్లతో N250 వంటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో పొందవచ్చు. యువ రైడర్‌లకు ఈ బైక్ అమితంగా నచ్చుతుంది.

పూర్తి స్మార్ట్ ఫీచర్లున్న 2024 బజాజ్ పల్సర్ N160 మరియు పల్సర్ N150లు TVS Apache 160 మరియు Apache 160 4V, Yamaha FZ లైనప్, సుజుకి నుంచి Xtreme 160R 4V మరియు Gixxer 150 పోటీగా ఉండనుంది. ఈ బైక్ ఒక్కసారి మార్కెట్‌లోకి వచ్చాక పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. బజాజ్‌కి ఉన్న మార్కెటింగ్ ఆధారంగా సేల్స్ కూడా భారీ స్థాయిలో జరుగుతాయని చెప్పుకొస్తున్నారు.

2024 పల్సర్ N160 ప్రారంభ ధర రూ. 1,30,560 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్ బ్లాక్, రెడ్, మరియు బ్లూ అనే మూడు కలర్లలో అందించబడుతుంది. అలాగే పల్సర్ N150 ధర రూ.1,17,677 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది కేవలం బ్లాక్ అండ్ వైట్ షేడ్స్‌లో ఆఫర్ చేయబడింది.


Click it and Unblock the Notifications








